BigTV English
Advertisement

Mrs. Movie: మిసెస్.. మీకు మింగుడు పడడం లేదా.. పురుషాహంకారం బయటపడిందా.. ?

Mrs. Movie: మిసెస్.. మీకు మింగుడు పడడం లేదా.. పురుషాహంకారం బయటపడిందా.. ?

Mrs. Movie: సాధారణంగా  రీమేక్స్ అన్నిసార్లు వర్క్ అవుట్ అవ్వవు. ఒక సినిమా ఒక భాషలో హిట్ అయ్యింది అంటే  దాన్ని ఇంకో భాషలో రీమేక్ చేస్తారు. కొన్నిసార్లు ఆ రీమేక్ వర్క్ అవుట్ ఎవ్వడు.. ఇంకొన్నిసార్లు ఒరిజినల్ కన్నా మరింత విజయాన్ని అందుకుంటుంది. మిసెస్ సినిమా అదే నిరూపించింది. ఈ సినిమా మూడు భాషల్లో రీమేక్ అయ్యింది.  మలయాళంలో ది గ్రేట్ ఇండియన్ కిచెన్ అనే పేరుతో ఒక సినిమా వచ్చింది. నిమిషా సజయన్, సూరజ్ వెంజరమూడు జంటగా నటించిన ఈ సినిమాను మ్యాన్ కైండ్ సినిమాస్, సిమ్మెట్రీ సినిమాస్, సినిమా కూక్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించగా జియో బేబీ దర్శకత్వం వహించాడు. 2021 లో వచ్చిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. 


ఇక ఇదే సినిమా అదే పేరుతో తమిళ్ లో రీమేక్ అయ్యింది. రాహుల్ రవీంద్రన్, ఐశ్వర్య రాజేష్  జంటగా నటించిన ఈ సినిమాకు ఆర్. కన్నన్ దర్శకత్వం వహించాడు. 2023 లో రిలీజ్ అయిన ఈ సినిమా కేవలం ఓటీటీకి మాత్రమే పరిమితమయ్యింది. జీ5 ఓటీటీలో తెలుగు డబ్బింగ్ తో స్ట్రీమింగ్ అవుతుంది. ఒరిజినల్ వెర్షన్ కు వచ్చినంత గుర్తింపు మాత్రం తమిళ్ సినిమాకు రాలేదు.   ఇక ఇప్పుడే ఇదే సినిమా హిందీలో మిసెస్ అనే పేరుతో రీమేక్ అయ్యింది.

దంగల్ సినిమాలో అమీర్ ఖాన్ రెండో కూతురుగా నటించి మెప్పించిన సన్యా మల్హోత్రా ప్రధాన పాత్రలో నటించిన సినిమా మిసెస్. ఆర్తి కడవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా  గతేడాది రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. గతేడాది నుంచి ఈ సినిమా కోసం చాలామంది గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఓటీటీకి వస్తుందా అని ఎదురుచూసినవారికి ఊరట లభించింది.  ఫిబ్రవరి 7 నుంచి మిసెస్ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.


Vishnu Manchu: స్పిరిట్ లో ఛాన్స్.. ప్రభాస్ ను బాగా వాడుతున్నారుగా మా ప్రెసిడెంట్ గారు

ఓటీటీలో ఈ సినిమా  మంచి విజయాన్ని అందుకుంది. ఇంకోపక్క  ఈ సినిమాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సినిమాపై సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫౌండేషన్ అనే ఒక పురుష హక్కుల సంస్థ.. మిసెస్ పై విమర్శలు గుప్పించింది. ఈ సినిమాలో స్త్రీవాదాన్ని ఎక్కువగా చూపించారని.. ఇందులో మహిళలు.. భర్తను, అత్తమామలను చూసుకోవడం, వంట చేయడంలో తప్పేమి ఉంది. అది స్త్రీని అణిచివేయడం ఎలా అవుతుందని చెప్పుకొచ్చింది. వంట చేయడంలో ఒత్తిడి ఎక్కడ ఉంటుంది.. తరతరాలుగా ప్రతి మహిళ కుటుంబానికి ఇస్టంగానే వండిపెడుతుందని చెప్పుకొచ్చింది.

అయితే వీరి వాదనను నెటిజన్స్ తోసిపుచ్చుతున్నారు. ఇప్పుడు వీరికి పురుషాహంకారం బయటపడింది.. అందులో హీరోయిన్ పడే కష్టాలు కనిపించలేదు కానీ.. వండడం మాత్రమే కనిపించిందా.. ? వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు అని ప్రశ్నిస్తున్నారు. అసలు వారు అంతగా విమర్శించడానికి ఈ సినిమాలో ఏముంది.. ? మిసెస్ కథ ఏంటి అనేది తెలుసుకుందాం.

రిచా ఒక డ్యాన్సర్. చదువుకున్న అమ్మాయి. పెళ్లి వయస్సు రావడంతో రిచాకు డాక్టర్ దివాకర్ తో పెద్దలు పెళ్లి చేసి అత్తారింటికి పంపుతారు. అక్కడకు వెళ్ళాక ఆమె  వంటమనిషిగా మారిపోతుంది. భర్త డాక్టర్ కావడంతో అన్ని ఆరోగ్యకరమైన వంటలే చేయాలనీ ఆర్డర్. ఇక మామగారు.. మరో రకం. ఆయనకు మిక్సీలో పిండి పట్టడం ఇష్టం ఉండదు. రోట్లో నూరాలి. ఏది పడితే అది తినడు. కుక్కర్ లో రైస్ పెట్టకూడదు. భర్త డాక్టర్ అన్న మాటే కానీ.. శుభ్రత ఉండదు. ప్లేట్ లో ఉన్న చెత్తను కూడా తీయకుండా  వదిలేస్తాడు. అలా రోజు రిచా.. వారికి వండిపెట్టడం.. తిన్నాకా ప్లేట్స్ కడగడం.. రాత్రి అయితే భర్తతో సంసారం చేయడం ఇదే పని.

ఇక అత్తగారు..  ఊరు వెళ్లడంతో ఆమె పనిభారం మరింత ఎక్కువ అవుతుంది. ప్రతిరాత్రి ఆమెకు కలలో కూడా ఆ సింక్, వాసన, నీళ్లు ఇవే గుర్తుకువస్తు ఉంటాయి. ఇక ఇదంతా పడలేక కొద్దిగా రిలాక్స్ కోసం ఆమె జాబ్ చేయాలనుకుంటుంది. ఆడవారు జాబ్ చేయడం మా ఇంటావంటా లేదని ఆపించేస్తారు. సంప్రదాయాలు తెలియవని, నీ పేరెంట్స్ ఇలానే పెంచారా .. ? అని ఎప్పుడు కించపరుస్తూ ఉంటారు. ఇక ఇవన్నీ తట్టుకోలేని రిచా చివరకు ఏం చేసింది.. ? భర్తను మార్చుకుందా.. ? లేక భర్తకు ఎదురుతిరిగిందా.. ? స్వేచ్ఛగా తిరిగిన ఒక అమ్మాయి.. అత్తారింట్లో బంధీగా  ఎలా మారింది.. ? అనేది సినిమా.

నిజం చెప్పాలంటే ఈ సినిమాలో రిచా పాత్ర.. ఎంతోమంది ఆడవారికి ప్రతీక.  అత్తవారింటిలో కట్టుబాట్లు, ఆచారాలు అని.. కట్టిపడేస్తున్నారు. ఒక స్వేచ్ఛ ఉండదు. తండ్రి ఇంట్లో స్వేచ్ఛగా పెరిగిన ప్రతి కూతురు అత్తవారింట్లో వంటమనిషిగా, పనిమనిషిగా మారుతుంది. రిచా పాత్ర ద్వారా చాలా నిజాలను డైరెక్టర్ బయట పెట్టింది. ప్రస్తుతం ఏ సినిమా జీ5 టాప్ 1 ట్రెండింగ్ లో ఉంది.

Related News

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Big Stories

×