Big Tv Live Original: దేశంలో కొన్ని మొబైల్ నెంబర్ల విషయంలో పరిమితులు ఉన్నాయి. వీటిలో కొన్ని అత్యవసర సేవల కోసం ఉపయోగించే ఉండగా, మరికొన్ని నెంబర్లను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయా మొబైల్ నెట్ వర్క్ సంస్థలు భద్రతను పెంచడంతో పాటు మోసాన్ని నిరోధించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నాయి. అందులో భాగంగానే కొన్ని నంబర్లను సాధారణ వినియోగం నుంచి నిషేధించారు. మరికొన్నింటిని పరిమితం చేశారు. ఇంతకీ దేశంలో పరిమితులు విధించిన నెంబర్లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..
1.అత్యవసర నెంబర్లు
దేశంలో కొన్ని నెంబర్లను అత్యవసర సేవల కోసం కేటాయించారు. వీటిని వ్యక్తిగత అవసరాల నుంచి తొలగించాయి.
⦿ 112 – నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్
⦿ 100 – పోలీసు హెల్ప్ లైన్ .
⦿ 101 – అగ్నిమాపక విభాగం
⦿ 102 – అంబులెన్స్ సేవ
⦿ 108 – విపత్తు నిర్వహణ, మెడికల్ ఎమర్జెన్సీ
⦿ 181 – మహిళల హెల్ప్ లైన్.
⦿ 1098 – పిల్లల హెల్ప్ లైన్.
ఈ నెంబర్లను ప్రజలకు సంబంధించిన భద్రత కోసం కేటాయించారు.
2.అంతర్జాతీయ, ప్రీమియం రేట్ నంబర్లు
కొన్ని అంతర్జాతీయ, ప్రీమియం రేట్ నంబర్లను దేశంలో బ్యాన్ చేశారు. కొన్నింటిని పరిమితం చేశారు.
⦿ శాటిలైట్ నెంబర్లు: (ఉదా.. +870, +881, +882). దేశంలో ఇలాంటి శాటిలైట్ నంబర్లను అనధికారికంగా ఉపయోగించడం చట్టవిరుద్ధం.
⦿ ప్రీమియం రేట్ నంబర్లు: (ఉదా.. 1900, 1809, 900 సిరీస్) ఈ నంబర్లు ఎక్కువ ఛార్జీలు పడేలా చేస్తాయి. ఈ నెంబర్లను టెలికాం ప్రొవైడర్లు వీటిని బ్లాక్ చేస్తాయి.
⦿ ఇంటర్నేషనల్ టోల్ ఫ్రీ నంబర్లు: కొన్ని విదేశీ టోల్-ఫ్రీ నంబర్లు (US నుంచి 800-సిరీస్ వంటివి) ఉంటాయి. ఇవి దేశంలో పని చేయకపోవచ్చు.
3.ఫ్రాడ్, స్కామ్ నంబర్లు
సైబర్ మోసాలు పెరగడంతో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI), టెలికాం ఆపరేటర్లు తరచుగా స్కామ్ లు, స్పామ్ మోసానికి సంబంధించిన నంబర్లను నిషేధిస్తారు. అలాంటి వాటిలో ఆర్థిక మోసానికి ఉపయోగించే నంబర్లు ఉన్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్ స్కామ్‌లు, ఫేక్ జాబ్ ఆఫర్లు, లాటరీ స్కామ్ నెంబర్లు ఉంటాయి. DND (డు నాట్ డిస్టర్బ్) నిబంధనలను ఉల్లంఘించే రోబో కాల్, టెలిమార్కెటింగ్ నంబర్లు కూడా ఉంటాయి. బ్యాంకులు, ప్రభుత్వ సంస్థల లాంటి ఫేక్ కస్టమర్ సర్వీస్ నంబర్లను కూడా సర్వీస్ ప్రొవైడర్లు బ్యాన్ చేస్తారు.
Read Also: కేబుల్స్‌తో జంజాటం వద్దు.. వైర్ లెస్ మొబైల్ ఛార్జర్ సిద్ధం, ఇలా పనిచేస్తుంది!
4.సిమ్ కార్డులు, అనధికార సర్వీసుల దుర్వినియోగం
⦿ రిజిస్టర్ చేయబడని VoIP నంబర్లు కొన్ని టెలికాం చట్టాలకు అనుగుణంగా ఉండవు. అలాంటి నెంబర్లను పరిమితం చేస్తారు.
⦿ వెరిఫై చేయని సిమ్ లను అంటే ఫేక్ డాక్యుమెంట్లు, అనధికార KYC పద్ధతులను ఉపయోగించి పొందిన మొబైల్ నంబర్‌లను టెలికాం ప్రొవైడర్లు బ్లాక్ చేస్తారు.
కస్టమర్ల భద్రతను కాపాడేందుకు టెలికాం నియంత్రణ సంస్థలు నిర్దిష్ట నంబర్లను నిరంతరం పర్యవేక్షిస్తాయి. వినియోగదారులకు అవసరమైన సూచనలు చేస్తుంటాయి. అనుమానాస్పద కాల్స్ గురించి ఫిర్యాదు చేస్తే వాటి మీద సర్వీస్ ప్రొవైడర్లు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
Read Also: మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీని తినేసే యాప్స్ ఇవే.. వెంటనే కంట్రోల్ చేయండిలా!