BigTV English

Lavu Krishnadevaraya : మరో వికెట్ పడింది.. వైసీపీకి ఎంపీ లావు కృష్ణదేవరాయలు రాజీనామా..

Lavu Krishnadevaraya : వైసీపీలో మార్పులు, చేర్పులు ఎఫెక్ట్‌తో మరో వికెట్ పడింది.. నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఎంపీ పదవికి రాజీనామా ప్రకటించి.. పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. దాంతో వైసీపీ నుంచి బయటకొచ్చిన ఎంపీల సంఖ్య మూడుకు చేరింది. కృష్ణదేవరాయల్ని నరసరావుపేట నుంచి గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయమని సీఎం జగన్ ఆదేశించడంతో.. ఆయన ససేమిరా అంటూ ఏకంగా పార్టీకే రిజైన్ చేశారు. అధిష్టానం లెక్కలు వేరు.. తన లెక్కలు వేరంటూ ఆయన బయటకొచ్చేయండటంతో.. పల్నాడు జిల్లా వైసీపీకి పెద్ద షాకే తగిలింది.

వైసీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. పలువురు సిట్టింగుల నియోజకవర్గాల మార్పులు.. ఇంకొందరి సీట్లు గల్లంతు చేస్తుండటంతో అధికారపక్షంలో రాజీనామాల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా నరసరావుపేట ఎంపీ, విజ్ఞాన్ స్కూల్స్ అధిపతి లావు రత్తయ్య కుమారుడు లావు కృష్ణదేవరాయలు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు .. తనను ఈ సారి నరసరావుపేట నుంచి కాకుండా గుంటూరు నుంచి పోటీ చేయమని జగన్ చెప్పారని.. అయితే తనకు గుంటూరు నుంచి పోటీ చేసే ఆలోచన లేదని స్పష్టం చేసి ఎంపి పదవితో పాటు వైసీపీకి రిజైన్ చేశారు.. ఈ సందర్భంగా ఈ విషయంలో .. అధిష్టానం లెక్కలు వేరు, తన లెక్కలు వేరని ఆయన వ్యాఖ్యానించారు .

పోటీ చేస్తే నరసరావు పేట నుంచే చేస్తానంటున్న కృష్ణదేవరాయలు తన నిర్ణయం ప్రకటించేశారు.. గత ఎన్నికల్లో పల్నాడు ప్రజలు మంచి మెజార్టీతో తనను పార్లమెంటుకు పంపించారని.. తన వంతుగా పల్నాడు ప్రాంత అభివ‌ృద్దికి కృషి చేశానని .. నియోజకవర్గం ప్రజలను వీడి వెళ్ళే ఉద్దేశం లేదని అంటున్నారు. పల్నాడులో రాజకీయంగా కొంత అనిశ్చితి ఏర్పడిందని.. దానికి తాను బాధ్యుడ్ని కాదన్నారు.

కృష్ణదేవరాయల్ని నరసరావుపేట నుంచి మార్చవద్దని కొంత మంది వైసీపీ నేతలు పార్టీ పెద్దలను కోరినా.. అక్కడ బీసీ అభ్యర్ధిని బరిలోకి దించడానికి ఫిక్స్ అయిన జగన్ తన నిర్ణయం మార్చుకోలేదు.. ఆ క్రమంలో ఎంపీని కలిసి నచ్చజెప్పేందుకు మాచర్ల, పెదకూరుపాడు ఎమ్మెల్యేలు బయలుదేరారు కానీ .. ఆ లోపే కృష్ణదేవరాయలు రాజీనామా చేశారు. దాంతో వైసీపీ పెద్దల నిర్ణయంపై అక్కడి వైసీపీ నేతలు నేతలు భగ్గుమంటున్నారు. చిలకలూరిపేట నియోజకవర్గంలోని మూడు మండలాల జెడ్బీటీసీలు ఆగ్రహంతో రాజీనామాలకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఎంపీని కలసి తదుపరి కార్యచరణ ప్రకటిస్తామన్నారు.

వాస్తవానికి గుంటూరు ఎంపీ టికెట్‌ కేటాయిస్తామన్న హామీతోనే మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీలో చేరారు. అయితే గుంటూరు ఎంపీ టికెట్‌‌పై వైసీపీ అధ్యక్షుడి నిర్ణయం వేరేలా ఉండటంతో.. రాయుడు పార్టీలో చేరిన పదిరోజుల్లోనే రాజీనామా చేశారు. ఆడుదాం ఆంధ్రాలో అంటున్న జగన్‌ టీం ఆడలేనంటూ అంబటి రాయుడు గట్టి స్ట్రోకే ఇచ్చారు.

వైసీపీ మార్పులు చేర్పుల వ్యవహారంతో ఇప్పటికే వైసీపీకి చెందిన ఇద్దరు ఎంపీలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, కర్నూలు ఎంపీ సంజీవ్‌కుమార్‌ బయటికొచ్చేశారు. ఇప్పుడు తాజాగా నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు కూడా ఆ లిస్టులో చేరారు.. పోటీ చేస్తే నరసరావుపేట నుంచే పోటీ చేస్తానంటున్న దేవరాయులు అడుగులు ఎటు పడతాయో చూడాలి.

Related News

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

Big Stories

×