BigTV English

AP Congress: ఏపీలో యాక్టివ్ అవుతోన్న కాంగ్రెస్.. ఐదుగురు వైసీపీ నేతలు జంప్ ?

AP Congress: ఏపీలో యాక్టివ్ అవుతోన్న కాంగ్రెస్.. ఐదుగురు వైసీపీ నేతలు జంప్ ?

AP Congress: అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏపీలో కాంగ్రెస్ యాక్టివ్ అవుతోంది. షర్మిల చేరికతో మాజీ కాంగ్రెస్ నేతలు.. మళ్లీ సొంతగూటికి చేరాలని చూస్తున్నారు. వైసీపీలో అసంతృప్త నేతలు, రాష్ట్ర విభజన తర్వాత స్తబ్ధుగా ఉన్న మరికొంత మంది నేతలను ఆకర్షించడానికి కాంగ్రెస్ భావిస్తోంది. ఇప్పటికే.. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కాంగ్రెస్‌లో చేరుతానని ఇప్పటికే ప్రకటించారు. ఇక మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ కూడా త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్నారు. గత కొంతకాలంగా కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు కొణతాలతో మంతనాలు జరుపుతున్నట్టు ప్రచారం జరిగింది.


షర్మిల కాంగ్రెస్ గూటికి చేరిత తర్వాత పార్టీ బలపడే అవకాశం ఉంటుందని భావించిన కొణతాల.. ఈరోజో.. రేపో చేరనున్నారు. వైఎస్ హయాంలో ఉత్తరాంధ్రలో ఓ వెలుగు వెలిగిన కొణతాల.. రాష్ట్ర విభజన తర్వాత సైలంట్ గా ఉన్నారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరుతారని ప్రచారం జరిగింది. లోటస్ పాండ్ కు వెళ్లి జగన్ ను కూడా కలిశారు. కానీ వైసీపీలో చేరలేదు. అయితే.. ఇప్పుడు కాంగ్రెస్ పుంజుకునే పరిణామాలు కనిపిస్తుండటంతో.. ఆయన సొంత గూటికి వెళ్లడానికి రంగం సిద్దం చేసుకున్నారు. ఆయనతో పాటు మరికొంత మంది మాజీ మంత్రులు హస్తం కండువా కప్పుకోవడానికి రెడీ అవుతున్నారు.

ఇక వైసీపీలో అసంతృప్త నేతలు ఇప్పటికే షర్మిలతో టచ్ లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. వైసీపీకి గుడ్ బై చెబుతున్న వారిలో మెజారిటీ నేతలు కాంగ్రెస్ వైపే చూస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. నేడో, రేపో పార్టీలో చేరడానికి వారు కూడా రంగం సిద్దం చేసుకుంటున్నాని తెలుస్తోంది.


.

.

Related News

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Big Stories

×