BigTV English

America : డ్రిప్ వాటర్ ఇంజెక్ట్ చేసిన నర్సు.. ఆసుపత్రిలో 10 మంది మృతి..

America : డ్రిప్ వాటర్ ఇంజెక్ట్ చేసిన నర్సు.. ఆసుపత్రిలో 10 మంది మృతి..

America : ఓ నర్స్ చేసిన పని వల్ల పది మంది అమాయక రోగులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ విషాద ఘటన అమెరికాలో జరిగింది. యూఎస్ ఒరెగాన్‌లోని ఓ ఆసుపత్రిలో నర్సు రోగులకు ఇచ్చిన మందులను దొంగిలించి వాటికి బదులుగా డ్రిప్ వాటర్ ను ఇంజెక్ట్ చేసింది. దీంతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు.


ఆసుపత్రిలో ఇచ్చే మందులు చోరీకి గురి కావడంతో ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. డిసెంబర్ ప్రారంభంలో ఓ మాజీ ఉద్యోగి మందులను దొంగిలించారని పోలీసులు అధికారులను అలర్ట్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

హాస్పటల్ లో పేషెంట్స్ కు ఇచ్చే పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ నర్సు దొంగతనం చేసి దాన్ని కప్పి పుచ్చేందుకు రోగులకు డ్రిప్ వాటర్ ని ఇంజెక్ట్ చేసిందని తెలుస్తోంది. ఈ ఆసుపత్రిలో మృతి చెందిన వ్యక్తుల మరణాలు ఇన్‌ఫెక్షన్ కారణంగానే జరిగాయని ఆస్పత్రి అధికారులు తమతో చెప్పారని మృతుల కుటుంబ సభ్యులు అంటున్నారు.ఈ మరణాలు మెడిసిన్ చోరీ వల్ల జరిగిందా లేక ట్యాంపరింగ్ వల్ల జరిగిందా అనే విషయాన్ని నిర్ధారించేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×