GGH Superintendent Prabhavathi: రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఈ కేసుకు సంబంధించి గుంటూరు GGH మాజీ సూపరింటెండెంట్ ప్రభావతికి.. లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్మిస్ కావడంతో నోటీసులు ఇష్యూ చేశారు. ఇప్పటికే ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. నిన్ననే ప్రభావతి విచారణకు హాజరుకావాల్సి ఉండగా డుమ్మా కొట్టారు. దాంతో మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.
రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఈ కేసుకు సంబంధించి గుంటూరు GGH మాజీ సూపరింటెండెంట్ ప్రభావతికి లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్మిస్ కావడంతో నోటీసులు ఇష్యూ చేశారు. ఇప్పటికే ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. నిన్ననే ప్రభావతి విచారణకు హాజరుకావాల్సి ఉండగా డుమ్మా కొట్టారు. దాంతో మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.
గతంలో వైసీపీ ఎంపీగీ ఉన్న రఘరామకృష్ణరాజును సీఐడీ కస్టడీలో చిత్రహింసలు పెట్టి, తీవ్రంగా గాయపరచరారు. అయితే ఆయన శరీరంపై ఎలాంటి గాయాలు లేవని తప్పుడు ధ్రువీకరణ పత్రం జారీ చేశారన్నది అభియోగం. జీజీహెచ్‌లో రఘరామకు వైద్యపరీక్షలు నిర్వహించగా.. ఆయన రెండు పాదాలు కమిలిపోయి ఉన్నట్లు పేర్కొంది. ఆ వాస్తవాలన్నింటిని హాస్పిటల్ యాజమాన్యం కప్పిపుచ్చుతూ.. అతని ఆరోగ్యం బాగానే ఉందని, శరీరంపై బయటకు కనిపించే గాయాలు ఏమి లేవని, మోసపూరిత నివేదిక సమర్పించింది. ఈ నేపథ్యంలో రఘరామ తనపై తప్పుడు నివేదిక ఇచ్చారంటూ.. జీజీహెచ్ సూపరింటెండెంట్‌పై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయింది.
రఘురామను కోర్టులో హాజరుపరిచే ముందు.. వైద్య పరీక్షలు నిమిత్తం జీజీహెచ్ కార్డీయాలజీ విభాగం అసిస్టెంట్.. బేతం రాజేందర్‌ను సీఐడీ ఆఫీస్‌కు పిలిపించారు. ఆయనపై సూపరింటెండెంట్ ప్రభావతి, నాటి ఏఎస్పీ విజయ్‌పాల్ కలిసి ఒత్తిడి తెచ్చి, మెడికల్ ఫిట్‌నెస్‌ఫామ్ మీద సంతకం చేపించుకున్నారు. ఇలా న్యాయస్థానాన్నే మోసం చేయాలనుకున్నారు. పోలీసులు విచారణ చేపట్టగా ఇందులో ప్రభావతి పాత్ర కీలకంగా ఉందని గుర్తించారు.
Also Read: జగన్ జైలుకెళ్లడం ఖాయం.. ఏ ఒక్కరినీ వదిలేది లేదన్న రఘురామ కృష్ణరాజు..
దీంతో ఆమెపై కేసు నమోదు చేసి ఏ5గా పేర్కొన్నారు. ఈ తరుణంలో ఆమె ఇటీవల ఆమె ధాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసింది. దీంతో ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉండటంతో ఇప్పటికే.. అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. శనివారం నాడు ప్రభావతి విచారణకు హాజరుకావాల్సి ఉండగా గైర్హాజరయ్యారు. దీంతో మరోసారి లుక్ అవుట్ నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.