Priyanka Chopra: అమెరికాలో కార్చిచ్చు అనేది చాలా సహజం. చిన్న మంటగా మొదలయ్యే ఈ కార్చిచ్చు ఇప్పటికే అమెరికాలో ఎన్నో అడవులు దగ్ధం అయ్యేలా చేసింది. ఇక ఇటీవల ఆ కార్చిచ్చు అడవిలో కాకుండా ఏకంగా హాలీవుడ్ వరకు వచ్చేసింది. దీంతో అక్కడ పోలీసులు, ఇతర సిబ్బంది అంతా అలర్ట్ అయ్యారు. చాలామందిని ఆ ఏరియా నుండి ఖాళీ చేయించి సురక్షితమైన ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. కార్చిచ్చు వేగాన్ని తప్పించుకోవడం కోసం సిబ్బంది అంతా కష్టపడుతున్నారు. ఇక ఇదిలా ఉండగా.. హాలీవుడ్‌లోనే సెటిల్ అయిన బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఇంటి వరకు ఈ కార్చిచ్చు వచ్చేసిందని తాజా సమాచారం బయటికొచ్చింది.
మంటల్లో ఇల్లు
ప్రస్తుతం అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో పాలెసైడ్స్ ఫైర్ వేగంగా వ్యాపిస్తోంది. దీనివల్ల ఎన్నో ఇళ్లు దగ్ధమయ్యాయి. ముఖ్యమైన రోడ్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి. ఇక ప్రస్తుతం లాజ్ ఏంజెల్స్‌లోనే నివాసముంటున్న ప్రియాంక చోప్రా కూడా ఈ విషయంపై తాజాగా స్పందించింది. ఇలా జరగడం బాధాకరం అంటూ వాపోయింది. కానీ ఇంతలోనే ఆ కార్చిచ్చు తన ఇంటి వరకు కూడా వచ్చేసింది. ఇటీవల లాస్ ఏంజెల్స్‌లో తన ఇంటి వద్ద వేగంగా వ్యాపిస్తున్న మంటలను వీడియో తీసి.. దానిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. అక్కడి పరిస్థితి గురించి తన మాటల్లో చెప్పుకొచ్చింది ప్రియాంక. కానీ ఇంతలోనే తన ఇంటి వరకు కూడా మంటలు వ్యాపించాయి.
Also Read: మరోసారి బాధితురాలిగా మారిన హనీ రోజ్.. ఆ కేసు వల్ల భారీ ఎఫెక్ట్
సేఫ్‌గా ఉండాలని కోరుకుంటున్నా
‘‘నేను ఈ కార్చిచ్చు వల్ల ఎఫెక్ట్ అయినవారి గురించే ఆలోచిస్తున్నాను. మనమంతా ఈరోజు సేఫ్‌గా ఉండాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చింది ప్రియాంక చోప్రా (Priyanka Chopra). తను ఈ వీడియోను పోస్ట్ చేసి నాలుగు రోజులు అయ్యింది. ఈ నాలుగు రోజుల్లో లాస్ ఏంజెల్స్‌లో మంటలు మరింత వ్యాపించాయి. అవి ఇప్పుడు తన ఇంటి వరకు వచ్చేశాయి. ప్రస్తుతం 250 మంది అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నా పెద్దగా లాభం లేదని అక్కడి నుండి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు చూస్తుంటే తెలుస్తోంది. ప్రియాంక చోప్రా మాత్రమే కాదు.. ఇప్పటికీ లాస్ ఏంజెల్స్‌లో ఉండే చాలామంది సెలబ్రిటీల ఇళ్లు ఈ కార్చిచ్చుకు దగ్ధమయ్యాయి.
ఇళ్లు కోల్పోయారు
ప్రియాంక చోప్రాతో పాటు అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ కుమారుడు, బ్రిటన్ యువరాజు హ్యారీ, అమెరికన్ మాజీ ప్రెసిడెంట్ జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ కూడా ఈ కార్చిచ్చులో తమ ఇంటిని కోల్పోవాల్సి వచ్చింది. అమెరికాలో అత్యంత రిచ్ మనుషులు ఉండే ఏరియాగా చెప్పుకునే హాలీవుడ్, లాస్ ఏంజెల్స్ లాంటి ప్రాంతాల్లో ఇలాంటి ఒక ఘటన జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. ఇప్పటివరకు ఈ కార్చిచ్చు వల్ల రూ.12 లక్షల కోట్ల కంటే ఎక్కువగానే నష్టం కలిగినట్టు తెలుస్తోంది. ఇప్పటికీ ఈ మంటలు ఆరలేదు కాబట్టి నష్టం మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. ఇప్పటికీ ఈ మంటల్లో 20 వేలకు పైగా ఇళ్లు దగ్ధమయినట్టు సమాచారం.