E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: రాజేంద్రప్రసాద్ కు పిండం.. కన్నీళ్లు పెట్టుకున్న భానుమతి.. పల్లవి ప్లాన్ రివర్స్..

Intinti Ramayanam Today Episode: రాజేంద్రప్రసాద్ కు పిండం.. కన్నీళ్లు పెట్టుకున్న భానుమతి.. పల్లవి ప్లాన్ రివర్స్..
Advertisement

Intinti Ramayanam Today Episode September 11th : శ్రియ నేను ఇంకా రెడీ అవ్వలేదు పల్లవి నువ్వు కాస్త బాబుని చూసుకుంటావా అని పార్వతి దగ్గర ఉన్న పల్లవికి బాబుని ఇస్తుంది. ఏంటి నువ్వు నువ్వు బాబుని ఇస్తున్నావా సరే ఇవ్వు నువ్వు వెళ్లి రెడీ అవ్వు నేను చూసుకుంటాను బాబును అని పల్లవి అంటుంది. అయితే పల్లవి హాస్పిటల్ లో బాబు గురించి చెప్పిన విషయాలను విని పార్వతి మరోసారి గుర్తు చేసుకుని భయపడిపోతుంది. బాబుని నాకివ్వు అని ఎంత చెప్తున్నా సరే పల్లవి తీసుకుని ఆడిస్తున్నట్లు నాటకాన్ని మొదలు పెడుతుంది పార్వతి మాత్రం పల్లవి బాబుని ఏం చేస్తుంది అనే భయపడిపోతూ ఉంటుంది.. పల్లవి నిజస్వరూ పని అందరికీ తెలియజేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటుంది పార్వతి.

పార్వతికి మరో టెన్షన్..

పార్వతి బాబుని చూసుకుంటూ ఉండగా… బయట రాజేందర్ ప్రసాద్ కి పిండ ప్రధాన కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఉంటారు. అక్షయ్ వెళ్లి రాజేంద్రప్రసాద్ చిట్టికలను తీసుకొని వస్తాడు ఇక అందరూ కలిసి ఆ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి అని అనుకుంటున్నప్పుడు పల్లవి మావయ్య గారి ఫోటో లేదేంటి అని అడుగుతుంది. ఇక పంతులుగారు కూడా రాజేంద్రప్రసాద్ ఫోటో కావాలని చెప్పడంతో… అవని నేను వెళ్లి తీసుకుని వస్తాను అని అంటుంది. కొడుకు ఫోటోని తీసుకురావడం భానుమతి చూస్తే ఇంట్లో పెద్ద రచ్చ చేస్తుంది అని పల్లవి అనుకుంటుంది కానీ భానుమతికి ఏదో ఒకటి చెప్పి లోపలికి పంపిస్తారు..

కొడుకు కోసం భానుమతి కన్నీళ్లు..

Advertisement

రాజేంద్రప్రసాద్ కి ఇంట్లో అందరూ కలిసి పిండ ప్రదానం చేస్తూ ఉంటారు. పల్లవి మాత్రం ఈ దృశ్యాన్ని భానుమతికి లేదా పార్వతి గనక చెప్తే ఇంట్లో నాన్న రచ్చ జరుగుతుంది మరొక శవం లేస్తుంది అని ప్లాన్ చేస్తుంది. శ్రేయ కి బాబుకి బాలు పెట్టవా అని చెప్పి లోపలికి వెళ్లి భానుమతి కోసం వెతుకుతూ ఉంటుంది. భానుమతి ఒక గదిలో కూర్చుని తన కొడుకు ఇంకా రాలేదు అని ఫోటో పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. పల్లవి నువ్వు ఇల్లంతా వెతికినా కనిపించలేదు ఇక్కడ ఏం చేస్తున్నావ్? ఎవరికోసం ఏడుస్తున్నావ్ అంటూ చాలా ఆవేశంగా వస్తుంది. నువ్వు ఇక్కడ నీ కొడుకు కోసం ఏడుస్తూ ఉంటే అక్కడ నీ మనవళ్లు మనవరాలు ఏం చేస్తున్నారో చూడాలి పదా అనేసి పల్లవి భానుమతిని రెచ్చగొడుతుంది.. అయితే భానుమతి కళ్ళజోడు లేకుండా బయటికి వస్తుంది అక్కడ వాళ్లంతా చేస్తున్న తాతగాని చూసి ఒక్కసారిగా సీరియస్ అవుతుంది.

పల్లవి ప్లాన్ ఫెయిల్..

భానుమతి సడన్గా ఎంట్రీ ఇవ్వడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏం చేస్తున్నారు రా మీరంతా ఇక్కడ మన ఇంట్లో ఎవరికో అనాధలకి పిండం పెట్టడం ఏంట్రా ఎందుకురా ఇలా చేస్తున్నారు అది ఇంటికి ఎంత ఇష్టమో తెలుసా అంటూ భానుమతి అనడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. నాకు కళ్ళజోడు లేదు కాబట్టి సరిపోయింది లేకపోతే ఆ దరిద్రాన్ని నేను కూడా చూసేదాన్ని అంటూ అక్కడ ఉన్న ఆ ఫోటోని విరిసి పడేస్తుంది భానుమతి.. అయితే భానుమతి అంత రచ్చ చేసిన కూడా ఆ ఫోటో తన కొడుకుదేనే కనిపెట్టలేక పోతుంది దాంతో పల్లవి నా ప్లాన్ ఫెయిల్ అయిపోయిందని చాలా ఫీల్ అయిపోతూ ఉంటుంది..

పార్వతి ఎంట్రీతో సీన్ రివర్స్..

Advertisement

భానుమతి చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇలాంటివి ఇంట్లో చేస్తే ఇంటికి ఎంత దరిద్రమో తెలుసా అంటూ అందరి పై సీరియస్ అయ్యి అరుస్తూ ఉంటుంది. అప్పుడే సడన్గా పార్వతి ఎంట్రీ ఇవ్వడంతో ఆమెకి ఎక్కడ నిజం తెలిసిపోతుందని అందరూ భయపడిపోతూ ఉంటారు. అప్పుడే అత్తయ్యకి ఎక్కడ నిజం తెలిసిపోతుంది అని పల్లవి వాళ్ళందరూ కూడా చాలా కంగారు పడిపోతూ ఉంటారు. పిండ ప్రధాన కార్యక్రమాన్ని నేనే చేశాను అని పార్వతి అంటుంది. అయితే పార్వతి చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు కానీ భానుమతి మాత్రం నీకు ఏమైనా పిచ్చి పట్టిందా? ఇక మొత్తానికి భానుమతికి పార్వతికి తెలియకుండా చేసిన పిండి ప్రధాన కార్యక్రమం పూర్తి అవుతుంది. పల్లవి మాత్రం ఎలాగైనా సరే ఈ విషయాన్ని అత్తయ్య వాళ్ళకి చెప్పాలి అని అనుకుంటుంది కానీ తన ప్లాన్ మాత్రం ఒక్కొక్కటిగా రివర్స్ అవుతూనే ఉంటాయి.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read : శుక్రవారం టీవీల్లోకి బోలెడు సినిమాలు..ఆ 4 డోంట్ మిస్..

Related News

Podarillu Today Episode : నారాయణ సీన్లోకి ఎంట్రీ.. మాధవ్ పై తాయారు సీరియస్.. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్..?

Ninnu kori Serial Today Episode September 11th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సర్జరీ తర్వాత గతం మర్చిపోయిన విరాట్ – షాక్ లో చంద్ర 

Nindu Noorella Saavasam Serial Today Episode September 11th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని అనుమానించిన అమర్‌   

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి బోలెడు సినిమాలు..ఆ 4 డోంట్ మిస్..

శ్రీసత్యకి లవ్ ప్రపోజ్ చేసిన హీరో.. అమ్మడి రియాక్షన్?

బిగ్ బాస్ 10లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్.. మొత్తం ఎంతమంది? ఎవరెవరంటే ?

అలీ హోస్ట్ గా మరో కొత్త షో..ఈసారి డబుల్ అల్లరి అంటూ!

Big Stories

Advertisement
×