Weather Updates: దక్షిణాది రాష్ట్రాలపై ఎల్ నినో ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. దీని కారణంగా నైరుతి రుతుపవనాలు జోరందుకున్నా, ఎల్ నినో కారణంగా కనీసం చినుకులు పడడం లేదు. దీంతో చినుకుల కోసం సామాన్యులతో రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో ఒడిశాపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కాస్త అల్పపీడనంగా మారినట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది.
దీని ప్రభావం ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీనికారణంగా ఆదివారం వివిధ ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడే అవకాశముంది. ఆదివారం నుంచి ఈనెల 28 వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవచ్చని తెలిపింది. కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, తెలంగాణ ప్రాంతాలలో అక్కడక్కడా లేదా కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర, దక్షిణ కర్ణాటకలో ఆగస్టు 22 నుంచి 28 వరకు భారీ వర్షాలు పడే అవకాశ ఉందని పేర్కొంది.
హైదరాబాద్ సిటీ పరిసర ప్రాంతాల్లో అర్ధరాత్రి 12 గంటల నుంచి వివిధ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. ముఖ్యంగా మల్కాజ్‌గిరి, కాప్రా, నాచారం, మల్లాపూర్, ఉప్పల్, నాగోల్, సికింద్రాబాద్, ఈసీఐఎల్, దమ్మాయిగూడ, చర్లపల్లి, బోడుప్పల్, పీర్జాదిగూడ, మేడిపల్లి, రామంతపూర్, సరూర్‌నగర్ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. ఆ తర్వాత తగ్గుముఖం పట్టింది. రాత్రంతా ఇదే పరిస్థితి నెలకొంది. ఆదివారం కూడా వాతావరణం దాదాపు ఇదే పరిస్థితి నెలకొని ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఇక తెలంగాణలోని మిగతా జిల్లాల విషయానికి వద్దాం. ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, నిజామాబాద్, జగిత్యాల, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి.
ఏపీ వాతావరణానికి వద్దాం. ఏపీ వ్యాప్తంగా విచిత్రమైన వాతావరణం కొనసాగుతోంది. భారత వాతావరణం సూచన మేరకు.. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని వివిధ ప్రాంతాల్లో ఆగస్టు 23 నుంచి 26 వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాల సమయంలో భారీ ఈదురు గాలులతోపాటు ఉరుములు, మెరుపులు ఉంటాయని తెలిపింది. గాలుల వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు ఉండవచ్చని అంచనా వేసింది. తీరప్రాంతాలు ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతోపాటు రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు పడే అవకాశముంది.
ALSO READ: అనకాపల్లి కి నయా లుక్.. మన ఊరు-మన బాధ్యత సీఎం చంద్రబాబు పిలుపు!