E-Paper
Advertisement

అనకాపల్లి కి నయా లుక్.. మన ఊరు-మన బాధ్యత సీఎం చంద్రబాబు పిలుపు!

అనకాపల్లి కి నయా లుక్.. మన ఊరు-మన బాధ్యత సీఎం చంద్రబాబు పిలుపు!
Advertisement

Anakapalli: అనకాపల్లి జిల్లా అలమండ కోడూరులో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. అనకాపల్లి జిల్లా ఎన్డీఏకి కంచుకోటని అన్నారు. అనకాపల్లి అంటే బెల్లం ఒకటే కాదు ఇప్పుడు ఆర్సెలార్ మిట్టల్, డేటా సెంటర్లు, పరిశ్రమలకు కేరాఫ్ అడ్రస్ అని అన్నారు. భవిష్యత్‌లో అనకాపల్లి నెంబర్ 1 జిల్లాగా తీర్చి దిద్దుతామని, ఉత్తరాంధ్ర కు మణిహారంగా ఏఎస్ఆర్ విమానాశ్రయం ఇటీవలే ప్రారంభించుకున్నామన్నారు.

దేశంలో మొదటి సారి..

ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర ఆశలకు, కలలకు రెక్కలు తొడుగుతుంది. ఏఐ, డేటా సెంటర్ల గురించి చిన్నారులు కూడా మాట్లాడటం సంతోషంగా ఉంది. దేశంలో మొదటి సారి క్వాంటం కంప్యూటింగ్ మన రాష్ట్రానికి తీసుకురావడం గర్వకారణం అని కొనియాడారు. వచ్చే నెల మొదటివారంలో అనకాపల్లి గోదావరి నీళ్లు తీసుకువస్తున్నామని, డేటా సెంటర్ లపై కొందరు లేని పోనీ దుష్ప్రచారం చేస్తున్నారు. వారికి డేటా సెంటర్ల వల్ల కలిగే లాభాలు తెలీదు. డేటా సెంటర్ నిర్మాణమే ఇంకా ప్రారంభమే కాలేదు. అప్పుడే నీళ్లు ఇంకి పోయాయని చెప్తున్నారని ఏద్వేవ వేశారు.

ఏఐ ప్రొఫెషనల్స్..

Advertisement

డేటా సెంటర్ ఒకటి ప్రారంబిస్తే 5 వచ్చాయి. 5గిగావాట్లు ఇక్కడికి వస్తే లక్షల మంది ఏఐ ప్రొఫెషనల్స్ తయారవుతారు. అన్ని డేటా సెంటర్లకు కలిపి 3.5 టీఎంసీల నీరు మాత్రమే అవసరం అవుతుంది. పోలవరం నుంచి వచ్చే నీళ్లు అనకాపల్లిలోని ప్రతి చెరువును నింపుతామన్నారు. అభివృద్ధి అంటే పరిశ్రమలు, పెట్టుబడులు, కంపెనీలే కాదు. స్వచ్ఛమైన ప్రాంతాలు, పర్యావరణ పరిరక్షణ కూడా అని అన్నారు. ప్రతి నెలా 3వ శనివారం స్వచ్ఛత గురించి, సమాజ హితం కోసం పని చేయాలని సీఎం పిలుపు ఇస్తున్నాను అన్నారు.

Also Read: ఆర్మీ సిబ్బందికి అదిరిపోయే ఆఫర్.. CSD ద్వారా ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు!

మనఊరు-మన బాధ్యత

Advertisement

ఇళ్లు, రోడ్లు, పరిసరాలు అన్ని మనవే అన్న భావనలో పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇక్కడి ధర్మ కోనేరును పునరుద్ధరించారు. పారిశుద్ధ్య కార్మికులను, ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్ఛంధ సంస్థలను అభినందిస్తున్నామన్నారు. మనఊరు-మన బాధ్యత సంకల్పం అందరూ తీసుకోవాలని, మన ఇల్లు, వీధి, కార్యాలయం, స్కూల్, మార్కెట్ వంటి అన్నీ పరిశుభ్రంగా తయారవ్వాలన్నారు. అప్పుడే స్వచ్ఛమైన పర్యావరణం ఉంటుందని, 2047 నాటికి దేశం అగ్రదేశంగా వికసిత్ భారత్ గా మారుతుంది. ఏపీ కూడా 2047 నాటికి తలసరి ఆదాయం పెరుగుతుందన్నారు.

మిట్టల్ స్టీల్ సిటీ..

అనకాపల్లికి పెట్టుబడులు గతంలో రాలేదు.. అనకాపల్లి వెనకబడుతుందని బాధపడ్డారు. విశాఖకు మించి అనకాపల్లికి పెట్టుబడులు వస్తున్నాయి. మిట్టల్ స్టీల్ సిటీని కడుతున్నారు. ఈ ప్రాంతానికి డేటా సెంటర్లు వస్తున్నాయి, ఫార్మా కంపెనీలు, అల్యూమినియం కంపెనీలు వస్తున్నాయి. అన్ని కంపెనీలకు కేంద్రంగా, నాలెడ్జ్ ఎకానమీగా అనకాపల్లి మారుతుందని సీఎం తెలిపారు.  .

Also Read: ఆర్మీ సిబ్బందికి అదిరిపోయే ఆఫర్.. CSD ద్వారా ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు!

Tags

Related News

ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌సిగ్నల్!

వైసిపి మాజీ మంత్రి జోగి రమేష్ కు భారీ ఊరట.. బెయిల్ మంజూరు చేసిన కోర్టు

పెద్దకాకాని ఆలయంలో ఘోరం.. అమ్మవారి రూ.15 లక్షల మంగళసూత్రం మాయం!

డేటా సెంటర్ ఇష్యూ.. సీఎం చంద్రబాబు క్లారిటీ, నిర్మాణం కాకుండానే నీళ్లు ఇంకిపోయాయంటూ..

విశాఖ సిటీలో విద్యార్థుల గ్యాంగ్‌వార్.. పట్టపగలు కర్రలు-రాడ్లతో దాడులు, పోలీసుల అదుపులో 17 మంది

జగన్‌కు జేసీ ప్రభాకర్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్.. తాడిపత్రిలో హైడ్రామా!

వెలిగొండ నిర్వాసితులకు రూ.250 కోట్ల చెక్కుల పంపిణీ.. ప్రారంభ తేదీ ప్రకటించిన సీఎం చంద్రబాబు!

Big Stories

Advertisement
×