Irumudi Movie : టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ చిత్రం ఇరుముడి. డిఫరెంట్ స్టోరీతో వచ్చిన ఈ చిత్రం భారీ అంచనాలతో రీసెంట్గా థియేటర్లలో ప్రేక్షకులను పలకరించింది. ఎప్పుడు మాస్ యాక్షన్ ఎలివేషన్స్ తో ప్రేక్షకులను పలకరిస్తున్నారు రవితేజ ఈసారి రూట్ మార్చి డిఫరెంట్ స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేసాడు.. అయ్యప్ప స్వామి స్పెషల్ గా వచ్చిన ఈ సినిమా జనాలని విపరీతంగా ఆకట్టుకుంది అని చెప్పాలి. థియేటర్లలో రిలీజ్ అయిన మొదటి షో నుంచి ఇప్పటివరకు పాజిటివ్ టాక్ ను అందుకుంటూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. ఈటీవీలో థియేటర్లో కొంచెం ఈ మూవీకి మంచి రెస్పాన్స్ రావడంతో రవితేజ ఫ్యాన్స్ తో పాటు జనాలు కూడా దీన్ని చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. మరి ఈ సినిమాని థియేటర్లలో మాత్రమే కాకుండా ఓటీటీ లవర్స్ కూడా దీన్ని చూసేందుకు ఆత్రుత కనబరుస్తున్నారు. మరి ఈ మూవీ ఇందులో స్ట్రీమింగ్ అవుతుంది? ఎప్పుడు రాబోతుంది అని ఒకసారి మనం ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..
టాలీవుడ్ మాస్ హీరో రవితేజ, యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రియ భవాని శంకర్ నటించిన చిత్రం ఇరుముడి. దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘ఇరుముడి’ చిత్రంపై టాలీవుడ్‌లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్‌కు ముందే ఓటీటీ హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయని వార్తలు వస్తున్నాయి.. ఈ సినిమాకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగిన విషయం తెలిసిందే. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. రవితేజ సినిమాకు మంచి ధరకు సొంతం చేసుకుందని తెలుస్తుంది. వరుస ఫ్లాఫులు పలకరించిన సరే వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్తుంది. సక్సెస్ ఫుల్ టాక్ తో దూసుకు వెళ్తుంది. దాంతో ఒక నెల తర్వాత ఈ మూవీ స్ట్రీమింగ్ కు వస్తుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. త్వరలోనే ఈ మూవీ ఓటీటీ అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.
గతంలో ఎన్నడూ కనిపించని విధంగా ఇరుముడి సినిమాలో కనిపిస్తుంది. ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే.. సీలేరు పరిసరాల్లోని ఓ ప్రశాంతమైన పల్లెటూరి నేపథ్యంలో కథ మొదలవుతుంది. హీరో అరటిపండ్ల వ్యాపారం చేసుకుంటూ భార్య కావేరి, కూతురు మణికంఠతో సంతోషంగా జీవించే వ్యక్తి త్రినాథ్. అయ్యప్ప భక్తుడిగా క్రమశిక్షణతో ఉండే అతనికి కుటుంబమే సర్వస్వం. అయితే ఆ ప్రాంతంలో స్కూల్‌కి వెళ్లే కొందరు బాలికలు అనుమానాస్పద పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోతుండటం కలకలం రేపుతుంది. ఈ ఘటనలకు సంబంధించిన ఓ కీలక విషయం త్రినాథ్ కూతురికి తెలియడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయి. ఆ తర్వాత తన బిడ్డతో పాటు గ్రామంలోని ఆడపిల్లలకు అండగా నిలిచేందుకు త్రినాథ్ చేసే పోరాటమే సినిమా ప్రధాన కథ. సినిమా స్టోరీ చాలా బాగుందనే టాక్ వినిపిస్తుంది.
Also Read :ఆదివారం టీవీ సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్..