E-Paper
Advertisement

పెద్దకాకాని ఆలయంలో ఘోరం.. అమ్మవారి రూ.15 లక్షల మంగళసూత్రం మాయం!

పెద్దకాకాని ఆలయంలో ఘోరం.. అమ్మవారి రూ.15 లక్షల మంగళసూత్రం మాయం!
Advertisement

Temple Gold: అమరావతిలోని పెద్దకాకాని శివాలయంలో 15 లక్షల బంగారం మాయమైన ఘటన కలకలం రేపుతుంది. అమ్మవారి 80 గ్రాముల మంగళసూత్రం చోరీకి గురైంది. దీంతో 5 గురు అర్చకులపై అక్కడి అధికారులు అనుయానాలు వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపిన ఘటన.. ప్రముఖ పుణ్యక్షేత్రం పెద్దకాకాని శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానంలో అమ్మవారి నగలు మాయమయ్యాయి.

రెండు రోజుల క్రితం..

సుమారు 15 లక్షల విలువైన 80 గ్రాముల నల్లపూసల మంగళసూత్రం రెండు రోజుల క్రితం మాయమైనట్లు అర్చకులు గుర్తించారు. ఆలయ EO కి సమాచారం ఇవ్వడంతో అంతర్గత విచారణ చేపట్టారు. ఆచూకీ లభించకపోవడంతో MLA దూళిపాళ్ల నరేంద్ర దృష్టికి తీసుకెళ్లారు. ఆలయ ప్రతిష్టకు భంగం కలగకుండా చూడాలని MLA ఆదేశించినా, రెండు రోజులుగా నగలు దొరకలేదు. దీంతో విషయం పోలీసుల వరకు చేరింది.

గర్భగుడిలోకి వెళ్లే 17 మంది

Advertisement

రంగంలోకి దిగిన పెద్దకాకాని పోలీసులు గర్భగుడిలోకి వెళ్లే 17 మంది అర్చకులను ప్రశ్నించారు. అందులో 5 గురిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రణధీర్ అనే అర్చకుడే ఈ వ్యవహారానికి మూలకారణమని పోలీసులు భావిస్తున్నారు. పెద్దకాకాని PS లో కేసు నమోదైంది. విచారణ కొనసాగుతోంది.

Also Read: రూ.30వేలలోపే ల్యాప్‌టాప్..హెచ్‌పి 14q స్పెసిఫికేషన్స్ ఇవే!

MLA ధూళిపాళ్ల నరేంద్ర..

Advertisement

పెద్దకాకాని శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానంలో అమ్మవారి నగలు మాయం అయినట్లుగా దేవాలయ ఈఓ నా దృష్టికి తెచ్చారన్నారు. ఆభరణాల చోరీపై ఇప్పటికే పెద్దకాకాని పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని కోరారు. కావాలనే కొందరు దేవాలయాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తున్నారు వారందరికీ ఒక్కటే చెప్తున్నా సున్నిత తమైన అంశాన్ని రాజకీయం చేయొద్దు ఆలయ ప్రతిష్ట దిగజార్చవద్దుఅని ఆయన అన్నారు. నగల మాయంలో అర్చకుల పాత్ర ఉంటే వారిని ఉద్యోగం నుంచి తొలగించడం జరుగుతుందని తెలిపారు.

గత ప్రభుత్వంలో..

ఆలయ ప్రతిష్టను దెబ్బతీస్తే ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తే లేదు వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం ఆలయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే లక్ష్యంగా పనిచేస్తుంది ఇదే ఆలయంలో గత ప్రభుత్వంలో మాంసాహారం వండినప్పుడు నేనే వచ్చి పోరాడానని MLA ధూళిపాళ్ల నరేంద్ర తెలిపారు.

Also read: కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకి చిన్నారెడ్డి వివరణ.. ఏమన్నారంటే?

Tags

Related News

డేటా సెంటర్ ఇష్యూ.. సీఎం చంద్రబాబు క్లారిటీ, నిర్మాణం కాకుండానే నీళ్లు ఇంకిపోయాయంటూ..

విశాఖ సిటీలో విద్యార్థుల గ్యాంగ్‌వార్.. పట్టపగలు కర్రలు-రాడ్లతో దాడులు, పోలీసుల అదుపులో 17 మంది

జగన్‌కు జేసీ ప్రభాకర్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్.. తాడిపత్రిలో హైడ్రామా!

వెలిగొండ నిర్వాసితులకు రూ.250 కోట్ల చెక్కుల పంపిణీ.. ప్రారంభ తేదీ ప్రకటించిన సీఎం చంద్రబాబు!

నెల్లూరు జిల్లాలో విచిత్ర ఘటన.. తండ్రిని పట్టించిన ఐదేళ్ల బుడతడు, కార్డన్ సెర్చ్‌లో ట్విస్ట్

ఈడీ స్టేట్‌మెంట్.. లెక్కచూపని రూ. 24 లక్షలు సీజ్, ఎంపీ అవినాష్ ఇళ్లపై సోదాలు, అర్ధరాత్రి వరకు మంతనాలు?

ఆర్టీసీ ఉద్యోగులకు దిమ్మతిరిగే స్కాం చేసిన క్లర్క్.. 30 లక్షలతో ఉద్యోగి పరార్!

Big Stories

Advertisement
×