E-Paper
Advertisement

విశాఖ సిటీలో విద్యార్థుల గ్యాంగ్‌వార్.. పట్టపగలు కర్రలు-రాడ్లతో దాడులు, పోలీసుల అదుపులో 17 మంది

విశాఖ సిటీలో విద్యార్థుల గ్యాంగ్‌వార్.. పట్టపగలు కర్రలు-రాడ్లతో దాడులు, పోలీసుల అదుపులో 17 మంది
Advertisement

Visakha City: విశాఖ సిటీలో విద్యార్థుల గ్యాంగ్ వార్ తీవ్రరూపం దాల్చింది. ఫలితంగా ఒకరిపై మరొకరు పిడి గుద్దులు, కర్రలతో దాడులు చేశారు. వెంటపడి కర్రలు-రాడ్లు పట్టుకుని వీధి రౌఢీల్లా ప్రవర్తించారు. దీంతో అక్కడ భయానక వాతావరణం ఏర్పడింది. ఏం జరుగుతుందో తెలియక చాలామంది బయటపడ్డారు. ఈ గ్యాంగ్‌వార్‌లో మైనర్ యువకులు కూడా ఉన్నారు. ఈ ఘటనలో పోలీసులు 17 మందిని అదుపులోకి తీసుకున్నారు.

 

విశాఖలో విద్యార్థుల మధ్య గ్యాంగ్‌వార్

Advertisement

విశాఖపట్నం శివారు ప్రాంతం మధురవాడ సమీపంలోని మారికావలస-తిమ్మాపురం రహదారిపై విద్యార్థుల మధ్య గ్యాంగ్‌వార్ జరిగింది. శివశక్తినగర్‌ ప్రాంతానికి చెందిన యువకులు రెండు వర్గాలుగా విడిపోయారు. ఆ తర్వాత ఒకరిపై మరొకరు పిడి గుద్దులు, ముష్టి ఘాతాలతో దాడులకు దిగారు. ఒక్కమాటలో చెప్పాలంటే కర్రలు-రాడ్లు పట్టుకుని వీధి రౌడీలా మాదిరిగా వ్యవహరించారు.

 

పట్టపగలు కర్రలు-రాడ్లతో దాడులు

Advertisement

ఘటన సమయంలో రోడ్డుపై చాలామంది వాహనాలు వెళ్తున్నాయి. ఆ సమయంలో వారిని ఆపేందుకు ప్రయత్నం చేశారు. దాదాపు అరగంటకు పైగానే ఘటన చోటు చేసుకుంది. ఈలోగా స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చిన తర్వాత యువకులు తమ వాహనాలతో అక్కడి నుంచి పరారయ్యారు.

 

పోలీసుల అదుపులో 17 మంది

చంద్రంపాలెం పాఠశాల సమీపంలో విద్యార్థుల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు కారణంగా తెలుస్తోంది. తొలుత యువకుల మధ్య మాటా మాటా తీవ్రరూపం దాల్చింది. చివరకు రెండు వర్గాలుగా విడిపోయి దాడులు చేసుకోవడంతో తీవ్రరూపం దాల్చింది. ఈ దాడుల్లో నలుగురి గాయపడినట్టు తెలుస్తోంది. మొత్తం 20 మంది యువకుల్లో 17 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఆరుగురిపై కేసులు నమోదు చేయగా, అందులో ముగ్గురు మేజర్లు-ముగ్గురు మైనర్లు ఉన్నారు. ఇరువర్గాల ఘర్షణ జరుగుతున్నప్పుడు అటుగా వెళ్తున్న బైక్ రైడర్‌తో గొడవకు దిగారు విద్యార్థులు. యువకులకు వాహనం  తగలడంతో వారితో ఘర్షణ దిగి చితకబాదినట్టు సమాచారం. ఘటనకు ముందు వారిలో కొందరు మద్యం సేవించి ఉంటారని అనుమానిస్తున్నారు పోలీసులు. దీని వెనుక మరొక కారణం కూడా వినిపిస్తోంది.

ALSO READ: జగన్‌కు జేసీ ప్రభాకర్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్.. తాడిపత్రిలో హైడ్రామా

అమ్మాయి ప్రేమ వ్యవహారం దీనివెనుక మరొక కారణంగా చెబుతున్నారు. జరిగిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో పాల్గొన్న వారిని గుర్తించడానికి సీసీటీవీ ఫుటేజ్, అందుబాటులో ఉన్న సాక్ష్యాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. హింసకు పాల్పడినా, ప్రజలకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పోలీసులు.

Related News

ద్వారకా తిరుమలలో మహిళా ఉద్యోగిపై.. సీఎం చంద్రబాబు ప్రశంసల జల్లు!

బీసీలపై ఎందుకంత కక్ష?.. ఢిల్లీ వేదికగా వైసీపీ తీరుపై మండిపడ్డ రామ్మోహన్ నాయుడు!

బీసీ రిజర్వేషన్ల వివాదంపై క్లారిటీ ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు.. ఎమన్నారంటే?

ఏపీ పింఛనుదారులకు బిగ్ అలర్ట్.. నవంబర్ 1 నుంచి మారిపోతున్న రూల్స్ ఇవే!

ఏపీలో పాకిస్థాన్ గూఢచారి నెట్‌‌వర్క్ కలకలం.. ఇద్దరిని అరెస్ట్ చేసిన అధికారులు!

ఆ విధంగా ముందు.. చంద్రబాబు-పవన్ రెండుగంటలపాటు భేటీ, మరోసారి కూర్చోవాలని నిర్ణయం

వైసీపీకి ఆ సత్తా లేదు.. అందుకే కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు! – మంత్రి రాంప్రసాద్‌రెడ్డి

హోంగార్డు ఉద్యోగాల పేరుతో రూ.6.95 లక్షలు స్వాహా.. కేటుగాడు అరెస్ట్!

Big Stories

Advertisement
×