BigTV English

Kota Student Missing: కోట విద్యార్థి అదృశ్యం.. 9రోజులకు మృతదేహం లభ్యం..!

Kota Student Missing: కోట విద్యార్థి అదృశ్యం.. 9రోజులకు మృతదేహం లభ్యం..!

Kota Student Missing Dead Body Found For 9 days : జేఈఈ పరీక్ష కోసం రాజస్థాన్‌లోని శిక్షణ పొందుతూ అదృశ్యమైన 16 ఏళ్ల విద్యార్థి మరణించాడు. అదృశ్యమైన 9 రోజుల అనంతరం రచిత్ సోంధియా మృతదేహాన్ని సమీపంలోని అటవీ ప్రాంతంలో గుర్తించారు. అతను ఓ కోచింగ్ సెంటర్‌లో జేఈఈ పరీక్షకు సిద్ధమవుతున్నాడు.


ఈ నేపథ్యంలో ఈ నెల 11న హాస్టల్ గది నుంచి వెళ్లి తిరిగి రాలేదు. గర్దియా మహదేవ్ మందిర్ సమీపంలోని అటవీప్రాంతంలోకి వెళ్లినట్టుగా సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలిసింది. అదే అతడిని చివరిసారిగా చూడటం. ఆలయ దర్శనానికి వెళ్తున్నట్టు రచిత్ హాస్టల్‌లో ఉంచి వెళ్లిన ఓ లేఖలో పేర్కొన్నాడు. ఆలయం వద్దే అతని బ్యాగ్, మొబైల్ ఫోన్, గది తాళాలు, ఇతర వస్తువులను వదిలివెళ్లడంపై పోలీసులకు అనుమానాలు పెరిగాయి.

Read More: జమ్మూ కశ్మీర్‌లో భూకంపం.. ఆస్తి, ప్రాణనష్టం జరిగిందా..?


ఆ మేరకు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను గమనించారు. దర్శనం అనంతరం సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్లు ఆ కెమోరాల్లో నమోదైంది. దాని ప్రకారం.. రాష్ట్రపోలీసులు, ఎస్డీఆర్‌ఎఫ్ అటవీ ప్రాంతంలో ముమ్మర గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు అతని మృతదేహంలభ్యమైంది. కోచింగ్ హబ్‌గాపేరొందిన కోటలో మధ్యప్రదేశ్‌కు చెందిన రచిత్ ఏడాది కాలంగా శిక్షణ పొందుతున్నాడు.

Tags

Related News

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

Big Stories

×