E-Paper
Advertisement

Jogi Ramesh Comments : వాళ్లిద్దరి కలయిక వ్యాక్సిన్ కాదు.. వైరస్

Jogi Ramesh Comments : వాళ్లిద్దరి కలయిక వ్యాక్సిన్ కాదు.. వైరస్
Advertisement

Jogi Ramesh Comments : పెడన సభలో తనపై రాళ్లదాడికి కుట్ర చేశారంటూ అసత్య ఆరోపణలు చేసి.. పవన్ కల్యాణ్ అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకునే ప్రయత్నం చేశారని మంత్రి జోగి రమేష్ ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ అధికార పార్టీపై చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. గురువారం మీడియాతో మాట్లాడిన మంత్రి.. పెడనలో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు. టీడీపీ – జనసేన కలిసినా కూడా కనీసం 2 వేలమందిని కూడా తెచ్చుకోలేకపోయారని అన్నారు. పెడన ప్రజలను రౌడీలు అన్నందుకు పవన్ వారందరికీ క్షమాపణలు చెప్పాలని మంత్రి జోగి రమేష్ డిమాండ్ చేశారు.

టీడీపీ-జనసేనల కలయిక వ్యాధిని తగ్గించే వ్యాక్సిన్ కాదని, వాళ్లిద్దరూ కలిస్తే వైరస్ కన్నా ప్రమాదమని దుయ్యబట్టారు. ఇరుపార్టీలు పొత్తు ప్రకటించిన తర్వాత పవన్ మరింత దిగజారిపోయారని విమర్శించారు. గత ఎన్నికల్లో రెండు ప్రాంతాల నుంచి పోటీ చేసి.. రెండుచోట్ల ఓడిపోయినా పవన్ నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడన్నారు. పవన్ కు సిగ్గు, మనస్సాక్షి ఏమాత్రం లేవన్నారు. అత్తారింటికి దారేది సినిమా పైరసీ ఎక్కడో జరిగితే.. పెడన కలంకారీ తమ్ముళ్లను పవన్ కొట్టించారని ఆరోపించారు. సీఎం జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అదే కలంకారీ కళాకారులను గౌరవించి సత్కరించిందని గుర్తుచేశారు.

Advertisement

గతంలో పవన్.. చంద్రబాబు పాలన అవినీతి రాజ్యమని మాట్లాడారని, టీడీపీ ప్రజాద్రోహి పార్టీ అని అన్న మాటల్ని జోగి రమేష్ ప్రస్తావించారు. టీడీపీ వారు ఇప్పటికైనా తమ మైండ్ సెట్ ను మార్చుకోవాలని సూచించారు. చంద్రబాబు – పవన్ ల కలయిక ఒక విషబీజమని వారి వల్ల ప్రజలకు నష్టమే తప్ప లాభం ఉండదన్నారు. 2024 తర్వాత పవన్ తో తాను కూడా సినిమాలు తీస్తానంటూ వాటి టైటిల్స్ కూడా చెప్పారు. జానీ – కూలీ, గబ్బర్ సింగ్ – రబ్బర్ సింగ్ పేరుతో సినిమాలు తీస్తానని మంత్రి పేర్కొన్నారు.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×