Illu Illalu Pillalu Today Episode june 16th: నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రేమ చాలా అద్భుతంగా పిల్లలకి క్లాసికల్ డాన్స్ నేర్పిస్తుంది. పక్కనే ఉన్న నర్మదా ప్రేమ డాన్స్ ని చూసి మురిసిపోతూ అద్భుతంగా ఉంది అంటూ కామెంట్ చేస్తుంది. అయితే ప్రేమ కోసం ఆ పిల్లల తల్లి ఫుడ్ ఆర్డర్ చేస్తుంది. ధీరజ్ రావడం చూసి నర్మదా ప్రేమ ఇద్దరు పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోతారు. ధీరజ్ ఫుడ్ ఆర్డర్ చేశారు కానీ ఎవరు కనిపించలేదు ఇంతకీ మీ టీచర్ అమ్మ ఎక్కడ అని అడుగుతాడు. పిల్లలు ఇప్పుడే టీచర్ లోపలికి వెళ్లిందని చెప్తారు. ధీరజ్ లోపలికి వెళ్తుంటే ప్రేమ గొంతు మార్చి ఆగండి అని అరుస్తుంది. అక్కడున్న అద్దంలో ప్రేమను ధీరజ్ చూసేస్తాడు. కానీ ప్రేమ మాత్రం ధీరజ్ ని ఎలాగైనా పంపించాలని అనుకుంటుంది. ధీరజ్ ప్రేమను చూసేస్తాడు. ఇంట్లో తెలిస్తే బాగోదు అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ధీరజ్ ను చూస్తున్న నర్మదా ప్రేమకు ఈ విషయాన్ని చెప్తుంది.. దానికి ప్రేమ మేనేజ్ చేస్తే ధీరజ్ పంపిస్తుంది. ధీరజ్ వెళ్ళిపోగానే నర్మదా మెల్లగా ప్రేమ దగ్గరికి వస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. పుట్టింటి నుంచి వెళ్తున్న శ్రీవల్లి నర్మదా ప్రేమలను చూసి ఆగుతుంది. వీరిద్దరూ ఏంటి ఒకచోట ముచ్చట పెట్టారు అది కూడా ఇక్కడ ఉన్నారేంటి అని ఆలోచిస్తుంది. అయితే ఇంట్లో ట్యూషన్ చెప్పొద్దని మామయ్య అన్న కూడా ఈ ప్రేమ ఇక్కడికి వచ్చి డ్యాన్సింగ్ క్లాసులు నేర్పిస్తుందా? ఈ ప్రేమ విషయాని కచ్చితంగా మావయ్య ముందు చెప్పాల్సిందే.. మా హనీమూన్ ని వీళ్లిద్దరు చెడగొట్టారుగా.. ఇప్పుడు వీరిద్దరిని మావయ్య ముందర ఎలా ఇరికిస్తాను అని శ్రీవల్లి మనసులో అనుకుని ఇంటికి వెళ్తుంది.
ఇంట్లోకి రాగానే నర్మద ప్రేమ రామరాజును చూసి డాన్స్ క్లాసుల గురించి చెప్పబోతారు. మీరేం చెప్పాలనుకున్నారో నాకు తెలుసు అని రామరాజు షాక్ ఇస్తాడు.. ఈ అమ్మాయి ఇప్పుడు ఎక్కడ నుంచి వస్తుందో తెలుసా అని రామరాజు వేదవతితో అంటాడు. డాన్స్ క్లాసులకి వెళ్లి వస్తుందని అనగానే ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. విషయం చెప్పద్దు అన్నందుకు ఇప్పుడు ఇంటికి వెళ్లి ఏకంగా డాన్సులు చెప్తుంది మీ కోడలు అని వేదవతిపై సీరియస్ అవుతాడు రామరాజు. అది కాదు మావయ్య చెప్పేది వినండి అని ప్రేమ ఎంత వాదిస్తున్నా సరే.. రామరాజు వినకుండా కొంచమైనా బుద్ధి లేదా ఇంటి పరువు పోతుందని ఎంత చెప్పినా మీరు మారరా అని అరుస్తాడు.
అయితే, ప్రేమ చెప్పబోతుంటే రామరాజు వినకపోవడంతో నర్మదా ఈ రోజుల్లో కాలేజీలు జాబులు అంటూ అమ్మాయిలు ముందుకు వెళ్తున్నారు మామయ్య అని నర్మద అంటుంది. ఈ ప్రేమ ఇలా డాన్స్ క్లాసులకు వెళ్లి డాన్సులు చెప్పడానికి కారణం ఈ నర్మదనే. ప్రేమకి అంత ధైర్యం లేదు మొత్తం ఈ నర్మదనే చేసింది అంటూ రామరాజు సీరియస్ అవుతాడు.. ఈ అమ్మాయి పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చినప్పటి నుంచి ఏదో ఒక గొడవ మొదలవుతుంది. ఈ అమ్మాయి వల్లే ఇంట్లో ప్రతి ఒక్క గొడవలు అనర్ధాలు జరుగుతున్నాయి. మీ సొంత నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఆడవాళ్ళు ఎప్పుడు ఎదిగారు అంటూ చులకనగా మాట్లాడుతాడు రామరాజు. శ్రీవల్లి వాళ్ళిద్దరిని రామరాజు తిడుతుంటే సంతోషంగా నవ్వుకుంటూ ఉంటుంది.. నర్మద ఎంత చెప్పినా కూడా రామరాజు వినకపోవడంతో నర్మదా కన్నీళ్లు పెట్టుకుంటుంది..
గదిలోకి వెళ్ళిన వేదవతి రామరాజుతో గొడవ పెట్టుకుంటుంది. మీరన్నది ఏమైనా బాగుందా అని వేదవతి రామరాజు పై సీరియస్ అవుతుంది. నేను అన్న దాంట్లో తప్పేముంది అని రామరాజు అంటాడు. నర్మద వల్లే గొడవలు జరుగుతున్నాయంటే బాధపడదా అని అన్న కూడా రామరాజు వినకుండా నేను చేసింది కరెక్టే అని వెళ్ళిపోతాడు. అటు ప్రేమ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ధీరజ్ చెప్పిన వినకుండా బాధపడుతుంది. నువ్వేం బాధ పడాల్సిన అవసరం లేదు అని ధీరజ్ సపోర్ట్ చేస్తాడు. నర్మదా ఫీలవుతూ ఉంటుంది. శ్రీవల్లి మాత్రం నర్మదని ఇరికించాను ప్రేమను ఇరికించెను ఈ ఆనందాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను అంటూ డాన్స్ చేస్తూ ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..