BigTV English

Lokesh US Visit: శాన్ ఫ్రాన్సిస్కో.. పారిశ్రామికవేత్తలతో మంత్రి లోకేష్, ఆయా రంగాలకు

Lokesh US Visit: శాన్ ఫ్రాన్సిస్కో.. పారిశ్రామికవేత్తలతో మంత్రి లోకేష్, ఆయా రంగాలకు

Lokesh US Visit: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు అనుకూలతలు, ప్రభుత్వం అమలు చేస్తున్న ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలను పారిశ్రామిక వేత్తలకు వివరించారు మంత్రి నారా లోకేష్. శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన బిజినెస్ మేన్ల సమావేశానికి హాజరైన ఆయన, ప్రజలకు వేగవంతమైన, మెరుగైన సేవలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.


పరిపాలనలో ఏఐ వినియోగం తీసుకురావాలని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఏయే రంగాల్లో అనుకూలంగా ఉన్నాయో వాటిని మంత్రి వివరించారు. ముఖ్యంగా మ్యాన్యుఫ్యాక్చరింగ్, రెన్యువబుల్ ఎనర్జీ, బయో ఎనర్జీ, ఆక్వా, పెట్రో కెమికల్ రంగాలకు అవకాశాలున్నాయని గుర్తు చేశారు.

ఏపీ సమగ్రాభివృద్ధికి ప్రతి 100 రోజులకు లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకు సాగుతున్నట్లు వివరించారు మంత్రి నారా లోకేష్. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా నైపుణ్యతతో కూడిన మానవ వనరులను అందించడం, యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడం ముఖ్యమన్నారు.


అలాగే విద్యా రంగంలోనూ సంస్కరణలకు శ్రీకారం చుట్టిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి ద్వారా పేదరిక నిర్మూలనకు సీఎం చంద్రబాబు పి-4 విధానాన్ని వివరించారు.

ALSO READ: మద్యం ప్రియులకు సూపర్ ఛాన్స్.. అలా చేస్తే ప్రశ్నించండి.. లేదా ఫిర్యాదు చేయండి: సీఎం చంద్రబాబు

పారిశ్రామివేత్త ప్రవీణ్ అక్కిరాజు నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ఎన్ విడియా వైస్ ప్రెసిడెంట్, విప్రో ప్రెసిడెంట్ నాగేంద్ర బండారు, న్యూటానిక్స్ ప్రెసిడెంట్ రాజీవ్ రామస్వామి, దేవ్‌రేవ్ సీఈఓ ధీరజ్ పాండే, గ్లీన్ సంస్థ సీఈఓ అరవింద్ జైన్, నెక్సస్ వెంచర్స్ ఎండి జిష్ణు భట్టాచార్య, సిస్కో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రవిచంద్ర, స్పాన్ ఐఓ సీఈఓ ఆర్చ్ రావు, మిహిరా ఎఐ సీఈఓ రాజా కోడూరి, హిటాచీ వంటారా సిఓఓ ఆశిష్ భరత్, వెస్ట్రన్ డిజిటల్ సీఈఓ శేషు తిరుమల, ఈక్వెనిక్స్ గ్లోబల్ ఎండి కెజె జోషి, త్రీడి గ్లాస్ సొల్యూషన్ సీఈఓ బాబు మండవ వంటి పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.

Related News

Yellow Shirt: అసలైన పసుపు సైనికుడు.. కూతురు పెళ్లిలో కూడా పసుపు చొక్కానే

Roja Hot Comments: శుక్రవారం వస్తే జంప్.. జగన్‌పై రోజా సెటైర్లు?

Digital Book: డిజిటల్ బుక్‌తో వైసీపీ వార్నింగ్.. రెడ్ బుక్ విజృంభించే టైమ్ వచ్చిందా?

Mother Killed Son: కళ్లలో కారం, చీరతో ఉరి.. ఎకరం భూమి కోసం కొడుకును చంపిన తల్లి

Jagan: ప్రతిపక్ష హోదా వల్ల లాభం ఏంటి? ఎమ్మెల్యేలకు ప్రశ్నించే హక్కు ఉండదా? జగన్ లాజిక్ ఏంటి?

Tirumala News: భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం, సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు

Amaravati News: హెచ్ 1 బీ వీసా ఎఫెక్ట్.. ఏపీకి టెక్ కంపెనీ యాక్సెంచర్, విశాఖలో కొత్త క్యాంపస్‌

Nellore News: రెచ్చిపోయిన హిజ్రాలు.. న‌ర్సుపై మూకుమ్మడిగా దాడి, అడిగినంత ఇవ్వలేదని

Big Stories

×