BigTV English

CM Chandrababu: మద్యం ప్రియులకు సూపర్ ఛాన్స్.. అలా చేస్తే ప్రశ్నించండి.. లేదా ఫిర్యాదు చేయండి: సీఎం చంద్రబాబు

CM Chandrababu: మద్యం ప్రియులకు సూపర్ ఛాన్స్.. అలా చేస్తే ప్రశ్నించండి.. లేదా ఫిర్యాదు చేయండి: సీఎం చంద్రబాబు

CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శనివారం మందుబాబులకు ఓ ముఖ్య విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో అవినీతికి ఆస్కారం లేకుండా మద్యం, ఇసుక విధానానికి శ్రీకారం చుట్టామన్నారు. ఏ గ్రామంలో ఇసుక అందుబాటులో ఉంటుందో, గ్రామస్తులు ఉచితంగా ట్రాక్టర్లు, ఎద్దుల బండ్ల ద్వారా ఇసుకను రవాణా చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. ఇందులో ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేకుండా, స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు చూడాలన్నారు. ఇసుక విధానంలో వైసీపీ నేతలు చొరబడి అక్రమాలకు పాల్పడే అవకాశం ఉంటుందని, ఈ విషయంపై కార్యకర్తలు ఎప్పటికప్పుడు గమనించాలన్నారు.


అలాగే మద్యం విధానంపై సీఎం మాట్లాడుతూ.. గత ప్రభుత్వం మద్యం ద్వారా అవినీతికి పాల్పడిందన్నారు. తాను ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మందుబాబుల కోసం రాష్ట్రవ్యాప్తంగా రూ. 99 లకే మద్యం బాటిళ్లు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. ఎక్కడైనా మద్యం అమ్మకాలలో ఒక్క రూపాయి అధికంగా వసూలు చేసినా, మందుబాబులు ప్రశ్నించాలని సీఎం సూచించారు. తనకు మద్యం అలవాటు లేదని, అయితే కొందరు సాయంత్రం కాగానే మద్యానికి బానిసలుగా మారారని, అటువంటి వారికి కూడా కల్తీ లేని మద్యాన్ని అందించాలన్న ఉద్దేశంతో పకడ్బందీగా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. మద్యం మానేస్తే తాను కూడా సంతోషిస్తానని, అయితే మందుబాబుల వద్ద ఎక్కడైనా లైసెన్స్ దారులు ఎక్కువ డబ్బులు వసూలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదన్నారు.

Also Read: Diwali 2024: దీపావళి రోజు 3 దీపాలతో ఈ పరిహారం చేస్తే.. మీ ఇంట్లో కనక వర్షమే !


రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడి ఉన్నప్పటికీ పింఛన్ నగదును ఏకకాలంలో పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని సీఎం అన్నారు. ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలలో, ఎక్కడైనా అవినీతి దృష్టికి వస్తే వెంటనే అధికారులకు తెలియజేయాలని చంద్రబాబు సూచించారు. ఎన్నికల్లో నామినేషన్ వేయనీయకుండా అడ్డుకున్న వైసీపీ రౌడీలను ప్రాణాలకు తెగించి ఎదిరించి నిలిచిన అంజిరెడ్డి, కార్యకర్తల మనోధైర్యాన్ని పెంచారని కొనియాడారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువును కొనసాగించలేకపోతున్న కార్యకర్తల కుమార్తెలకు ఎంతవరకు చదివితే అంతవరకూ పార్టీ తరపున చదివిస్తామని సీఎం చంద్రబాబు భరోసా కల్పించారు.

అయితే మందుబాబులను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగిస్తూ.. నవ్వులు విరౠయించారు. మద్యం ప్రియులూ.. మీ జేబులకు చిల్లు పడనివ్వవద్దు. ఎక్కడైనా ఇబ్బందులు కలిగిస్తే మీరే ప్రశ్నించండి అంటూ బాబు అనగానే, సమావేశానికి హాజరైన కార్యకర్తలు చిరునవ్వులు చిందించారు.

Related News

Tidco Houses: వ‌చ్చే జూన్ నాటికి టిడ్కో ఇళ్లు పూర్తి.. ప్రతి శనివారం లబ్దిదారులకు అందజేత- మంత్రి నారాయణ

Aadhaar Camps: ఆధార్ నమోదు, అప్డేట్ చేసుకోవాలా?.. ఇప్పుడు మీ గ్రామంలోనే.. ఎప్పుడంటే?

Jagan – Modi: మోదీ భజనలో తగ్గేదేలేదు.. కారణం అదేనా?

Pawan – Lokesh: పవన్ తో లోకేష్ భేటీ.. అసలు విషయం ఏంటంటే?

CM Progress Report: విదేశీ ప్రతినిధులతో సీఎం భారీ పెట్టుబడులే లక్ష్యం!

AP Rains: రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP Elections: నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు.. జనవరిలో నోటిఫికేషన్.. నీలం సాహ్ని ప్రకటన!

Toll Plaza Crowd: అమ‌లులోకి కొత్త రూల్స్‌.. టోల్ ప్లాజాల వద్ద భారీగా రద్దీ!

Big Stories

×