BigTV English

Sajjana Vs Lokesh: సజ్జల ఇది మరిచిపోయారా? ఆయన చుట్టూ బిగిసిన ఉచ్చు

Sajjana Vs Lokesh: సజ్జల ఇది మరిచిపోయారా? ఆయన చుట్టూ బిగిసిన ఉచ్చు

Sajjana Vs Lokesh: అమరావతిపై ఘాటు వ్యాఖ్యలు చేసినవారి చుట్టూ ఉచ్చు బిగిస్తోందా? కొమ్మినేని తర్వాత తర్వాత అరెస్టు ఎవరిది? సజ్జలకు గండం పొంచివుందా? రేపో మాపో ఆయనకు అరెస్టు తప్పదా? మంత్రి లోకేష్ రంగంలోకి దిగారా? ఆయన వార్నింగ్ వెనుక అసలు కథ అదేనా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.


సీనియర్ జర్నలిస్టు, వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణరెడ్డికి కష్టాలు రెట్టింపు అయ్యాయి. కావాలనే ఆయన మీడియాకు మసాలా ఇచ్చినట్టు కనిపిస్తోంది. ఎప్పుడు ప్రశాంతంగా కనిపించే సజ్జల ఆవేశంలో  ఎందుకు నోరుజారారు. ఫలితంగా వైసీపీ ఇమేజ్ మరింత డ్యామేజ్ అయ్యింది. రాజధాని అమరావతిపై చేసిన వ్యాఖ్యల పరిణామాలు ఇప్పటికే కొమ్మినేనిని చుట్టేశాయి. ఈ జాబితాలోకి సజ్జల కూడా చేరిపోనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

సాక్షి సీనియర్ జర్నలిస్టు, విశ్లేషకుడు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు తర్వాత వేగంగా పరిణామాలు మారిపోతున్నాయి. ఆయనకు మద్దతుగా రంగంలోకి దిగిన వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కూడా  ఇరుక్కుపోయారు. రాజధాని మహిళలను తీవ్రంగా దూషించారాయన. కొమ్మినేని మాటలను సమర్థిస్తూనే..  అమరావతిపై నిరసనలు చేస్తున్న మహిళలను పిశాచులు, రాక్షసులు అంటూ సంబోధించారు.


అక్కడితో ఆగకుండా కాస్త నోటి దురుసు ప్రదర్శించారు. రాజధాని మహళలను సంకర తెగ అటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. నిరసనలు చేస్తున్న తెగ ఆర్గ‌నైజ్డ్ సంకర తెగ అంటూ ఆయన ప్రస్తావించడం అగ్నికి ఆజ్యం పోసినట్టు తయారైంది.  సజ్జల వ్యాఖ్యలపై  అమరావతి మహిళలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కచ్చితంగా ఆయన్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ALSO READ: వయసు డ్రామా.. అడ్డంగా దొరికిపోయిన కొమ్మినేని

ఈ వ్యవహారంపై మంత్రి నారా లోకేష్ రంగంలోకి దిగేశారు. నిరసన చేస్తున్న మహిళలు సంకరజాతా?మహిళల జోలికి వస్తే చర్యలు తప్పవని ఘాటుగా హెచ్చరించారు. మహిళలు అంటే ఎందుకు అంత చిన్నచూపు! మహిళల జోలికి వస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పనిసరిగా తీసుకుంటామన్నారు. తల్లి, చెల్లిని తరిమేసిన జగన్ అమానవీయ ప్రవర్తనను వైసీపీ నేతలు ఆదర్శంగా తీసుకున్నట్టు ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.

సజ్జల వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు అమరావతి మహిళలు. ఆయన్ని అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే నిరసనలు తీవ్రతరం చేస్తామని అంటున్నారు. ఈ నేపథ్యంలో కూటమి పెద్దలు ఆలోచనలో పడ్డారు.

జగన్ తర్వాత ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్టు కాదని అంటున్నారు.  ఇప్పుడు చర్యలు తీసుకోకుంటే మిగతా నేతలు ఇదే పంథాను అనుసరించే అవకాశముందని అంటున్నారు.  కచ్చితంగా సజ్జలపై చర్యలు తీసుకోవాలని అంటున్నారు. ఈ లెక్కన రేపో మాపో సజ్జల సైతం అరెస్టు కావచ్చనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. మొత్తానికి అమరావతి వ్యవహారం వైసీపీ కొంప కొల్లేరు చేసినట్టు కనిపిస్తోంది.

 

Related News

Tidco Houses: వ‌చ్చే జూన్ నాటికి టిడ్కో ఇళ్లు పూర్తి.. ప్రతి శనివారం లబ్దిదారులకు అందజేత- మంత్రి నారాయణ

Aadhaar Camps: ఆధార్ నమోదు, అప్డేట్ చేసుకోవాలా?.. ఇప్పుడు మీ గ్రామంలోనే.. ఎప్పుడంటే?

Jagan – Modi: మోదీ భజనలో తగ్గేదేలేదు.. కారణం అదేనా?

Pawan – Lokesh: పవన్ తో లోకేష్ భేటీ.. అసలు విషయం ఏంటంటే?

CM Progress Report: విదేశీ ప్రతినిధులతో సీఎం భారీ పెట్టుబడులే లక్ష్యం!

AP Rains: రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP Elections: నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు.. జనవరిలో నోటిఫికేషన్.. నీలం సాహ్ని ప్రకటన!

Toll Plaza Crowd: అమ‌లులోకి కొత్త రూల్స్‌.. టోల్ ప్లాజాల వద్ద భారీగా రద్దీ!

Big Stories

×