BigTV English

HBD Balakrishna: బాగా పెరిగిన బాలయ్య ఆస్తులు.. డబ్బుతోపాటు బంగారం, వెండి ఎంతంటే?

HBD Balakrishna: బాగా పెరిగిన బాలయ్య ఆస్తులు.. డబ్బుతోపాటు బంగారం, వెండి ఎంతంటే?

HBD Balakrishna..నందమూరి బాలకృష్ణ.. తెలుగు సినిమా నటులు మాత్రమే కాదు నిర్మాత, శాసనసభ సభ్యులు, టీవీ షో హోస్ట్ కూడా.. అంతేకాదు పలు బ్రాండ్ ఉత్పత్తులకు అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. వైవిధ్యభరితమైన పాత్రలు పోషించడమే కాకుండా.. జానపద, పౌరాణిక, సాంఘిక చిత్రాలలో నటించి మంచి పేరు సొంతం చేసుకున్నారు. తన సినీ కెరియర్ లో ఎన్నో సినిమాలు చేసి తెలుగు వారి గుండెల్లో ఆరాధ్య దైవం గా నిలిచిన బాలకృష్ణ.. ఏడుపదుల వయసుకు చేరువలో ఉన్నా.. వరుస పెట్టి మాస్, యాక్షన్ చిత్రాలు చేస్తూ గాడ్ ఆఫ్ మాసెస్ గా పేరు సొంతం చేసుకున్నారు. నటుడుగానే కాకుండా రాజకీయ నాయకుడిగా కూడా కొనసాగుతున్నారు.. శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ తరఫున ఏకంగా మూడుసార్లు శాసనసభ సభ్యులుగా ఎన్నికయి రికార్డు సృష్టించారు. అంతేకాదు సినీ ఇండస్ట్రీలో ఇటీవలే 50 వసంతాలు పూర్తి చేసుకున్న ఈయన.. విశిష్ట సేవలను గుర్తించి భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘పద్మభూషణ్’ అవార్డుతో సత్కరించింది. ఇకపోతే ఈరోజు బాలకృష్ణ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన ఆస్తుల వివరాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.


బాలకృష్ణ బాల్యం, సినీ జీవితం..

1960 జూన్ 10వ తేదీన స్వర్గీయ నందమూరి తారక రామారావు (NT Rama Rao), బసవతారకం(Basavatarakam ) దంపతులకు ఆరవ కుమారుడిగా బాలకృష్ణ జన్మించారు. బాల్యం మొత్తం హైదరాబాదులోనే గడిచింది. ఇంటర్మీడియట్ చదువు పూర్తి అయిన వెంటనే నటుడు కావాలనుకున్న బాలకృష్ణతో కనీసం డిగ్రీ అయినా పూర్తి చేయాలని తండ్రి చెప్పడంతో తండ్రి కోరికను మన్నించి, నిజాం కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. 14 ఏళ్ల వయసులోనే తన తండ్రి ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన ‘తాతమ్మకల’ (1974)అనే చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘దానవీరశూరకర్ణ’, ‘శ్రీమద్విరాట పర్వం’, ‘శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం’, ‘అక్బర్ సలీం అనార్కలి’ వంటి చిత్రాలలో సహాయ నటుడిగా కనిపించి ఆకట్టుకున్నారు. 1984 లో వచ్చిన ‘సాహసమే జీవితం’ అనే సినిమాతో మొట్టమొదటిసారి హీరోగా కెరియర్ ఆరంభించారు.


బాలయ్య ఆస్తుల వివరాలు..

బాలకృష్ణ ఆస్తుల విషయానికి వస్తే.. బాలకృష్ణ ఆస్తుల వివరాల విషయానికి వస్తే.. ప్రస్తుత మొత్తం ఆస్తుల విలువ రూ.490 కోట్లు.. అందులో చర ఆస్తులు రూ.283 కోట్లు కాగా.. స్థిరాస్తులు రూ.207 కోట్లు స్థిర ఆస్తులు ఉన్నట్లు సమాచారం. గతంలో ఎన్నికల కమిషన్ కి చూపించిన లెక్కలతో పోల్చుకుంటే ఆయన స్థిర, చర ఆస్తులు ఇప్పుడు భారీగా పెరిగిపోయాయి.

బంగారం, వెండి , వజ్రాల విలువ ఎంతంటే?

బాలకృష్ణ ఫ్యామిలీకి ఉన్న ఆభరణాల వివరాల విషయానికి వస్తే.. సుమారుగా 5.9 కేజీల బంగారం, 156 కేజీల వెండి, 580 క్యారెట్స్ వజ్రాలు ఉన్నట్లు గత ఎన్నికల అఫిడవిట్లో బాలయ్య చూపించారు. వీటి విలువ మొత్తంగా 7 కోట్ల రూపాయలు ఉంటుందని కూడా ఆయన తెలిపారు.

బాలయ్య రెమ్యూనరేషన్..

పలు యాడ్స్ ద్వారా రూ.10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్న బాలయ్య.. ఒక్కో సినిమాకు 25 – 30 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ సంఖ్య ‘అఖండ 2’ కి బాగా పెరిగినట్లు తెలుస్తోంది. అంతే కాదు ఇటీవల ‘జైలర్ 2’ సినిమాలో 20 నిమిషాల పాత్ర కోసం ఏకంగా రూ.50 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు బాలయ్య.అలా బాలయ్య ఆస్తుల వివరాలు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.

బాలయ్య కార్ కలెక్షన్..

బాలయ్య దగ్గర సుమారుగా రూ.20 కోట్ల విలువ చేసే లగ్జరీ కార్లు ఉన్నట్లు సమాచారం. దీనికి తోడు ఆయన కూతురు బ్రాహ్మణి బెంట్లీ కాంటినెంటల్ కారును బహుమతిగా ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతోపాటు బీఎండబ్ల్యూ సిక్స్ సిరీస్ జీటీ, మెర్సిడేస్ బెంజ్ GLS 400d, టయోటా ఇన్నోవా క్రిస్టా వంటి కార్లు ఉన్నాయి.

ALSO READ:Ravi Mohan – Kenishaa: జయం రవితో ఎఫైర్ అండ్ ప్రెగ్నెన్సీ.. అసలు నిజం బయటపెట్టిన సింగర్ కెనీషా!

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×