BigTV English

OTT Movie : ఏలియన్ హంటర్స్ దగ్గరకు వెళ్లే ఏలియన్ అమ్మాయి… ఇది మామూలు కథ కాదు

OTT Movie : ఏలియన్ హంటర్స్ దగ్గరకు వెళ్లే ఏలియన్ అమ్మాయి… ఇది మామూలు కథ కాదు

OTT Movie : సైన్స్ ఫిక్షన్ సినిమాలకు సపరేట్ గా ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇక ఎప్పటికప్పుడు ఓటిటిలోకి వచ్చే ఇలాంటి సినిమాలను వదలకుండా చూస్తారు మూవీ లవర్స్. అందులోను సైన్స్ ఫిక్షన్ సినిమాలకు మలయాళ భాష తోడైతే ఆ మూవీ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా కూడా ఈ కేటగిరీకి చెందిందే. మరి ఈ  మూవీ ఏ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది? స్టోరీ ఏంటి? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video)

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా రీసెంట్ గా ఓటీటీలోకి అడుగు పెట్టింది. ఈ సినిమా పేరు “గగనాచారి” (Gaganachari). ముందస్తుగా ఎలాంటి సమాచారం లేకుండా సడన్ గా ఓటీటీలోకి వచ్చేసింది ఈ సినిమా. ప్రస్తుతం మలయాళంలో అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో అందుబాటులో ఉంది. దీనికి ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అక్టోబర్ 26న ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా ఇతర భాషల్లో  డబ్బింగ్ వర్షన్ లపై ఇంకా క్లారిటీ లేదు. అయితే గగనాచారి మూవీ థియేటర్లలో రిలీజ్ అయిన నాలుగు నెలల తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చింది. ఈ ఏడాది జూన్ లో థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. డైరెక్టర్ అరుణ్ చందు దిస్టోపియన్ సైన్స్ ఫిక్షన్ కామెడీ అంశాలను కలగలిపి ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో గోకుల్ గణేష్ అంజు తోపాటు, అనార్కలి మరికర్ కూడా ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు శంకర్ శర్మ సంగీతం అందించారు. గగనాచారి మూవీ ని అజిత్ వినాయక ఫిలిమ్స్ కృష్ణథ్ ఫిలిమ్స్ బ్యానర్లపై వినాయక అజిత్ నిర్మించారు.


కథలోకి వెళ్తే

సినిమా అంతా కేరళలో 2040 ఏడాదిలో నడుస్తుంది. ఈ ఫ్యూచర్ టైం లైన్లో నడిచే సినిమాలో అప్పటికే యుద్ధం ముగుస్తుంది. ఆ తరువాత పరిపాలన మొత్తాన్ని ప్రభుత్వం తన కంట్రోల్లోకి తీసుకుంటుంది. అలాగే ప్రజలను కూడా కట్టడి చేస్తూ నియంత్రణలో ఉండేలా చేస్తుంది. మరోవైపు ఒక ఖాళీ అపార్ట్మెంట్ బంకర్ లో అలన్, విక్టర్, వైభవ్ అనే ఏలియన్ హంటర్స్ నివసిస్తారు. అయితే ఈ ఏలియన్ హంటర్స్ దగ్గరికి ఓ మహిళా ఏలియన్ వస్తుంది. దీంతో అప్పటినుంచి ఆ ముగ్గురికి సమస్యలు ఎదురవుతాయి. అసలు ఆ ఏలియన్ వీళ్ల దగ్గరికి ఎందుకు వచ్చింది? ఆ తర్వాత వాళ్లకు ఎదురైన సమస్యలేంటి? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే “గగనాచారి” (Gaganachari) అనే ఈ సినిమాను తప్పకుండా చూడాల్సిందే. ఇందులో ప్రేమ మూఢనమ్మకాలు వంటి అంశాలు కూడా ఉంటాయి. సైన్స్ ఫిక్షన్ సినిమాలను ఇస్టపడే మూవీ లవర్స్ ఈ మూవీని తప్పకుండా చూడండి. ఇదివరకే ఇటువంటి మూవీస్ చాలానే వచ్చాయి. అయితే ఈ మూవీ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. మరెందుకు ఆలశ్యం ఈ మూవీ పై ఓ లుక్ వేయండి.

Related News

OTT Movie : అమ్మాయిల్ని చంపి చేపలకు ఆహారంగా వేసే సైకో… గ్రిప్పింగ్ స్టోరీ, థ్రిల్లింగ్ ట్విస్టులు

OTT Movie : ప్రైవేట్ వీడియోలతో బ్లాక్మెయిల్… పోలీసులకు అంతుచిక్కని వరుస మర్డర్స్ కేసు… కేక పెట్టించే మిస్టరీ థ్రిల్లర్

OTT Movie : అర్దరాత్రి కార్లో ఏకాంతంగా లవర్స్… పోలీస్ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్… గుండె జారిపోయే రియల్ స్టోరీ

OTT Movie : నలుగురు అబ్బాయిలు ఒకే అమ్మాయితో… ఈ ఆడపులి రివేంజ్ కాటేరమ్మ జాతర మావా

OTT Movie : పెళ్ళైన మహిళ మరో వ్యక్తితో… మర్డర్స్ తో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్… ఐఎండీబీలో అదిరిపోయే రేటింగ్

OTT Movie : ట్రాన్స్ జెండర్ల బ్రూటల్ రివేంజ్… ఒక్కో ట్విస్టుకు గూస్ బంప్స్… పెద్దలకు మాత్రమే ఈ మూవీ

OTT Movie : షార్ట్ ఫిలిం పేరుతో బీచ్ కి తీసుకెళ్లి… టీనేజ్ అమ్మాయితో ఆ పని… మస్ట్ వాచ్ మలయాళ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie :సిటీ జనాల్ని చితగ్గొట్టే డిమాన్స్… సూపర్ హీరోలనూ వదలకుండా దబిడి దిబిడే

Big Stories

×