26 జిల్లాల కలెక్టర్లు, 40 శాఖల అధిపతులతో సమావేశాలు జరిగాయి. ఇందులో అధిపతులు, కలెక్టర్ల అభిప్రాయాలను తెలుసుకున్నారు. రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో హోం, పరిశ్రమలు, ఐటీ, ఇండస్ట్రీస్ అండ్ అన్వెస్ట్‌మెంట్స్, విద్యుత్, మానవవనరులు, ట్రాన్స్ పోర్టు, రోడ్లు-భవనాలు, హౌసింగ్, హెల్త్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా సంక్షేమం, రెవిన్యూ, ఎక్సైజ్, మైన్స్, డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ప్లాన్స్ వంటి వివిధ అంశాలపై అధికారులతో సీఎం చర్చించారు
సోషల్ మీడియాలో అనుచిత పోస్టులుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అనుచిత పోస్టుల నియంత్రణకు కమిటీని వేసింది ఏపీ ప్రభుత్వం. మంత్రి లోకేశ్ ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటిని ఏర్పాటు చేసింది. అలాగే ఫ్రీహోల్డ్ భూములపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్లలో జరిగిన అవకతవకలను సరి చేయాలన్నారు. అనర్హులకు కేటాయించిన ఇళ్ల స్థలాలపై విచారణ చేయాలని ఆదేశించారు చంద్రబాబు.
Also Read: నాగబాబు ఎఫెక్ట్.. బాబు స్కెచ్‌కు రూటు మార్చిన పవన్, రేపో మాపో…
రాష్ట్రంలో తల్లిదండ్రులను కోల్పోయిన ఒంటరి చిన్నారులకూ పింఛన్లు ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. వైసీపీ హయాంలో జారీ చేసిన నకిలీ పింఛన్లు తొలగించి… అక్రమార్కులపై కేసులు పెట్టాలని స్పష్టం చేశారు చంద్రబాబు. ఎన్నికల హామీ మేరకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కలెక్టర్లు, అధికారలు పనిచేయాలని సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు.
వచ్చే మూడు నెలల్లోపు రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తి అదుపులోకి రావాలని.. ఇందుకోసం జిల్లా ఎస్పీలు బాధ్యతగా పని చేస్తూ ప్రజలకు భరోసా కల్పించాలనీ. వారంలోపు పోలీసు శాఖకు సంబంధించి మరో కమిటీ కూడా నియమిస్తామని అన్నారు చంద్రబాబు.