BigTV English

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టు మరోసారి గుర్తు చేశారు మంత్రి నారా లోకేష్. ఆ మాటకు కట్టుబడి ఉన్నామని, దాన్ని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. సీఎం చంద్రబాబు కూడా 20 లక్షల ఉద్యోగాల కల్పనపై చాలా పట్టుదలతో ఉన్నారని చెప్పారు. ఉపాధి కల్పనకోసం ప్రైవేటు సెక్టార్ తో కలిసి పనిచేస్తామన్నారు. ఓంక్యాప్ ద్వారా యువతకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అన్నారు. విజయవాడలో జరిగిన గ్రీన్ ఎనర్జీ కాన్ఫరెన్స్ లో ఉపాధికల్పన రంగంపై లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. నైపుణ్యం మెరుగుపరచుకోవడం ద్వారా భవిష్యత్ లో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్పష్టం చేశారు. గ్రీన్ ఎనర్జీ రంగం ద్వారా గ్రామీణ యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. మహిళలకు కూడా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.


నైపుణ్యం పోర్టల్..
సెప్టెంబర్ 1వ తేదీన నైపుణ్యం పోర్టల్ ను ప్రారంభిస్తామని చెప్పారు మంత్రి లోకేష్. మారుతున్న కాలానికి అనుగుణంగా యువత తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. “సోలార్, విండ్ ఎనర్జీ టాలెంట్ హబ్ గా ఆంధ్రప్రదేశ్” అనే అంశంపై ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్, స్వనీతి ఇనీషియేటివ్ సంయుక్తంగా గ్రీన్ ఎనర్జీ కాన్ఫరెన్స్ నిర్వహించాయి. యువగళం పాదయాత్రలో తన అనుభవాలను ఈ సందర్భంగా వివరించారు నారా లోకేష్. సాధారణ గృహిణిగా ఉన్న మహిళలు అనంతపురంలో కియా యాన్సిలరీ యూనిట్స్ వల్ల ఉద్యోగులుగా మారారని, కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచారన్నారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో ఇలాంటి ఉపాధి అవకాశాలు మరింత మెండుగా ఉన్నాయన్నారు. విండ్, సోలార్, రెన్యువబుల్, పంప్డ్ స్టోరేజీ, సీబీజీ ప్రాజెక్టులపై ప్రధానంగా దృష్టిసారించామని.. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచేందుకు కృషి చేస్తూ, మరోవైపు ఈ రంగాన్ని ఉపాధికి అనుకూలంగా మలచుకుంటున్నామని వివరించారు మంత్రి లోకేష్.

ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని
ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ.. అనేది తమ నినాదం అని చెప్పారు మంత్రి లోకేష్. క్లస్టర్ విధానంలో పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని, దీనికి కావాల్సిన ఎకో సిస్టమ్ ను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. అనంతపురాన్ని ఆటోమొబైల్ హబ్ గా, కర్నూలు జిల్లాను రెన్యువబుల్ ఎనర్జీ హబ్ గా, కడప, చిత్తూరు జిల్లాలను ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా చేయబోతున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ప్రతి 100 కిలోమీటర్లకు ఒక క్లస్టర్ ఏర్పాటుచేసి ఆయా రంగాల్లో టాప్ 20 కంపెనీలను తీసుకువచ్చేందుకు కృషిచేస్తున్నామని వివరించారు.

యువతకు శిక్షణ..
రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో రాష్ట్రానికి అనేక పరిశ్రమలు వస్తున్నాయని, ప్రైవేటు సెక్టార్ తో నైపుణ్యం గల యువతను అనుసంధానించాల్సిన అవసరం ఉందని చెప్పారు మంత్రి లోకేష్. స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్, సీడాప్ ద్వారా యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తామన్నారు. ప్రపంచ అవసరాలకు అనుగుణంగా అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. తన ఛాలెంజ్ ను స్వీకరించి సుజ్లాన్ సంస్థ ఇప్పటికే 2 నైపుణ్య శిక్షణా కేంద్రాలను నిర్మించిందని, అవి ఇప్పటికే పనిచేస్తున్నాయని గుర్తు చేశారు. మరిన్ని నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం శిక్షణ కేంద్రాలకు పూర్తి సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు.

Related News

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

AP Students: ఏపీ విద్యార్థులకు ఎంజాయ్.. వరుసగా మూడు రోజులు సెలవులు

AP Rain Alert: బిగ్ అలర్ట్.. రెండు రోజులు భారీ వర్షసూచన.. ఆ జిల్లాలలో ఎఫెక్ట్ ఎక్కువే!

AP new bar policy: ఏపీలో కొత్త బార్ పాలసీ.. ఇకపై మందుబాబులకు అక్కడ కూడా కిక్కే!

AP Cabinet: గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ కేబినెట్.. ఒకటి కాదు సుమా.. అవేమిటంటే?

Big Stories

×