Nara Lokesh: ఏపీ మంత్రి నారా లోకేష్ ఇక నుండి ఆ భాద్యతల నుండి తప్పుకోనున్నారు. ఔను మీరు చదివింది నిజమే.. ఇకపై ఆ భాధ్యతల నుండి తప్పుకొనేందుకు లోకేష్ ఇప్పటినుండే ప్లాన్ రెడీ చేసుకున్నారు. అంతేకాదు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడ లోకేష్ దారిలో నడుస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఏపీ కేబినెట్ లో గల నారా లోకేష్ ఆ భాద్యతల నుండి తప్పుకొని, ఏ భాద్యత తీసుకుంటారో మున్ముందు తెలియనుంది.
మంత్రిగా నారా లోకేష్ తన శాఖపరంగా నూతన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజాదరణ పొందుతున్నారు. ఇటీవల అన్ని పాఠశాలల్లో పెద్ద పండుగ నిర్వహించారు. అలాగే ఇంటర్ విద్యార్థులకు మద్యాహ్న భోజన పథకం అమలుకు శ్రీకారం చుట్టారు. అలాగే రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం ప్రత్యేక చొరవ చూపుతున్నారు. ఇలా మంత్రిగా తనకంటూ గుర్తింపు పొందిన లోకేష్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం నారా లోకేష్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగిస్తున్నారు. పార్టీ వ్యవహారాలను చక్కబెట్టడంలో లోకేష్ పాత్ర కీలకంగా చెప్పుకోవచ్చు.
మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజాదర్బార్ ద్వార ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు. అది కూడ రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల ప్రజలు ప్రజా దర్బార్ కు తరలివచ్చి లోకేష్ కు వినతులు సమర్పిస్తున్నారు. ఓ వైపు పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న లోకేష్ ఆ పదవికి ఇక ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్నట్లు సాక్షాత్తు లోకేష్ ప్రకటించారు.
యువతను రాజకీయాల్లో ప్రాధాన్యత పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు లోకేష్. పార్టీలో చురుకుగా ఉంటున్న వారికి ఈ భాద్యతలు అప్పజెప్పాలన్నది లోకేష్ మాట. ఓ వైపు రాష్ట్ర మంత్రిగా భాద్యతలు నిర్వహిస్తున్న లోకేష్, పార్టీ భాద్యతల నుండి తప్పుకోవాలని ఆలోచించడంతో పార్టీ క్యాడర్ ఆలోచనలో పడింది. తన మాదిరిగానే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడ తన దారిలో నడిచేందుకు సిద్దంగా ఉన్నట్లు లోకేష్ అన్నారు.
Also Read: Maha Kumbh Mela: పుణ్యం కోసం వచ్చాడు.. పోలీసులకు చిక్కాడు!
దీనిని బట్టి పార్టీ కోసం కృషి చేసిన వారికి సముచిత స్థానం కల్పించాలన్న ఉద్దేశంతో లోకేష్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పవచ్చు. అయితే నెక్స్ట్ పార్టీలో ఏ పదవి తీసుకోనున్నారని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు తాను కార్యకర్తగా పార్టీ కోసం పనిచేస్తానని లోకేష్ బదులిచ్చారు. విశాఖలో లోకేష్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.