BigTV English

Red Book: రెడ్ బుక్ లో ఉన్నవారంతా వాళ్లే.. :మంత్రి లోకేష్

Red Book: రెడ్ బుక్ లో ఉన్నవారంతా వాళ్లే.. :మంత్రి లోకేష్

Red Book: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు.. ప్రతిపక్ష వైసీపీ నేతలు రెడ్ బుక్ పై ఆరోపణలు చేస్తున్నారు. రెడ్ బుక్ పేరు చెప్పి.. తమపార్టీ వాళ్లను భయపెడుతున్నారని ఆరోపించిన సందర్భాలున్నాయి. ఎన్నికల ప్రచార సమయంలో నారా లోకేశ్ ఈ రెడ్ బుక్ ప్రస్తావన తీసుకొచ్చారు. తాజాగా ఈ రెడ్ బుక్ పై మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు.


మంగళగిరి నరసింహస్వామి ఆలయానికి నూతనంగా నిర్మించిన ముఖద్వారాన్ని లోకేశ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెడ్ బుక్ లో రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టిన వాళ్లందరి పేర్లు ఉన్నాయని, చట్టానికి వ్యతిరేకంగా పనిచేసిన వారందరిపైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారులపై.. నివేదిక వచ్చిన వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Also Read: మంగళవారం విదేశాలకు.. జగన్‌కు గ్రీన్ సిగ్నల్.. కాకపోతే..


ఇటీవలే మాజీ సీఎం జగన్ కూడా రెడ్ బుక్ పై వ్యాఖ్యలు చేశారు. ఎవరిని తొక్కేయాలి.. ఎవరిపై కేసులు పెట్టాలి.. ఎవరి ఆస్తుల్ని ధ్వంసం చేయాలన్న విషయాలనే అందులో రాసుకున్నారని వ్యంగ్యంగా మాట్లాడారు. రెడ్ బుక్ ను ఎవరు పడితే వాళ్లు తెరవడం, దానిపేరుతో విధ్వంసాలు చేయడం పరిపాటిగా మారిందని దుయ్యబట్టారు. అధికారపార్టీ వాళ్లే అరాచకాలు చేసి.. వాటిని తమ నేతలపై రుద్దుతున్నారని వాపోయారు.

రెడ్ బుక్ పేరు చెప్పి.. అధికారులను, నేతలను అధికారపార్టీ భయపెడుతోందని వాపోతున్న వైసీపీ నేతలు.. తాజాగా మంత్రి లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారో చూడాలి.

Related News

Amaravati News: మొబైల్ పాస్‌పోర్టు సేవలు..భలే ఉంది కదూ, ఇంకెందుకు ఆలస్యం

Bapatla YSRCP: బాపట్లలో వైసీపీకి దిక్కెవరు?

Amaravati News: వైసీసీ గుట్టు బయటపెట్టిన మంత్రి లోకేష్, ఖర్చు మామూలుగా లేదు, రంగంలోకి సిట్

Tidco Houses: వ‌చ్చే జూన్ నాటికి టిడ్కో ఇళ్లు పూర్తి.. ప్రతి శనివారం లబ్దిదారులకు అందజేత- మంత్రి నారాయణ

Aadhaar Camps: ఆధార్ నమోదు, అప్డేట్ చేసుకోవాలా?.. ఇప్పుడు మీ గ్రామంలోనే.. ఎప్పుడంటే?

Jagan – Modi: మోదీ భజనలో తగ్గేదేలేదు.. కారణం అదేనా?

Pawan – Lokesh: పవన్ తో లోకేష్ భేటీ.. అసలు విషయం ఏంటంటే?

CM Progress Report: విదేశీ ప్రతినిధులతో సీఎం భారీ పెట్టుబడులే లక్ష్యం!

Big Stories

×