BigTV English

AP Intermediate Exams Schedule: ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల..

AP Intermediate Exams Schedule: ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల..

AP Intermediate Exams Schedule: ఏపీ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన కొంత సమయానికే ఇంటర్మీడియట్ పరీక్షలు షెడ్యూల్ సైతం నారా లోకేష్ విడుదల చేశారు. వచ్చే ఏడాది మార్చి ఒకటో తేదీ నుండి 19వ తేదీ వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని విద్యాశాఖ ప్రకటించింది. అలాగే మార్చి 3వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలు నిర్వహించనున్నారు.


ఇంటర్ ఫస్టియర్..
మార్చి 1న ఇంటర్‌ ఫస్టియర్ విద్యార్థులకు పేపర్‌-1 సెకండ్ లాంగ్వేజ్‌ పరీక్ష జరుగుతుంది. మార్చి 4వ తేదీన పేపర్‌-1 ఇంగ్లీష్‌ పేపర్‌-1 పరీక్ష జరుగతుుంది. మార్చి 6వ తేదీన పార్ట్‌ 3లో మ్యాథ్స్‌ పేపర్-1ఏ, బోటనీ పేపర్-1, సివిక్స్‌ పేపర్-1 పరీక్షలు నిర్వహిస్తారు. మార్చి 8వ తేదీన మ్యాథ్స్‌ పేపర్-1బి, జువాలజీ పేపర్‌-1, హిస్టరీ పేపర్-1 పరీక్షను నిర్వహిస్తారు. మార్చి 11న ఫిజిక్స్‌ పేపర్-1, ఎకనామిక్స్‌ పేపర్-1 పరీక్ష సాగుతుంది. మార్చి 13న కెమిస్ట్రీ పేపర్-1, కామర్స్‌ పేపర్-1, సోషియాలజీ పేపర్‌-1, ఫైన్ ఆర్ట్స్‌, మ్యూజిక్ పేపర్-1 పరీక్షలు నిర్వహిస్తారు. మార్చి 17న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌ పేపర్-1, లాజిక్ పేపర్-1, బ్రిడ్జి కోర్స్‌ మ్యాథ్స్‌ పేపర్‌ ను బైపీసీ వారి కోసం పరీక్ష జరుగుతుంది. మార్చి 19న మోడరన్ లాంగ్వేజ్‌ పేపర్-1, జాగ్రఫీ పేపర్-1 పరీక్షను నిర్వహిస్తారు.

ఇంటర్ సెకండియర్..
ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థులకు మార్చి 3వ తేదీ సోమవారం పేపర్‌-2 సెకండ్ లాంగ్వేజ్‌ పేపర్‌-2 పరీక్ష, మార్చి 5వ తేదీన పార్ట్‌-1లో ఇంగ్లీష్‌ పేపర్‌-2 పరీక్ష, మార్చి 7వ తేదీన పార్ట్‌ 3లో మ్యాథ్స్‌ పేపర్ – 2ఏ, బోటనీ పేపర్-2, సివిక్స్‌ పేపర్-2, మార్చి 10వ తేదీన మ్యాథ్స్‌ పేపర్-2బి, జువాలజీ పేపర్‌-2, హిస్టరీ పేపర్-2, మార్చి 12న ఫిజిక్స్‌ పేపర్-2, ఎకనామిక్స్‌ పేపర్-2, మార్చి 15న కెమిస్ట్రీ పేపర్-2, కామర్స్‌ పేపర్-2, సోషియాలజీ పేపర్‌-2, ఫైన్ ఆర్ట్స్‌, మ్యూజిక్ పేపర్-2 పరీక్షలు నిర్వహిస్తారు. మార్చి 18న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌ పేపర్-2, లాజిక్ పేపర్-2, బ్రిడ్జి కోర్స్‌ మ్యాథ్స్‌ పేపర్‌-2 పరీక్ష నిర్వహిస్తారు. మార్చి 20 న మోడరన్ లాంగ్వేజ్‌ పేపర్-2, జాగ్రఫీ పేపర్-2 పరీక్షలు జరుగుతాయి.


Also Read: AP 10th Exams Schedule 2025: ఏపీలో పది ‘పబ్లిక్’ పరీక్షల షెడ్యూల్ విడుదల..

మిగిలిన అదనపు సబ్జెక్టులలో ఎథిక్స్‌ అండ్ హ్యుమన్ వాల్యూస్ పరీక్షను ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 10నుంచి ఒంటి గంట వరకు నిర్వహిస్తారు. ఎన్విరాన్‌మెంటల్ సైన్స్‌ పరీక్షను ఫిబ్రవరి 3న నిర్వహిస్తారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఒకేషనల్‌ విద్యార్థులకు ఫిబ్రవరి 10 నుంచి 20వ తేదీ వరకు 2 సెషన్లలో ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయి. సమగ్ర శిక్ష ఒకేషనల్ ట్రేడ్ పరీక్షలను ఫిబ్రవరి 22న ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తారు.

ఆల్ ది బెస్ట్.. మంత్రి నారా లోకేష్

ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదల అనంతరం మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. విద్యార్థులు పరీక్షలకు పూర్తి స్థాయిలో సన్నద్దం కావాలన్నారు. ప్రతి విద్యార్థి ఇష్టపూర్వకంగా చదివి ఉన్నత మార్కులు సాధించాలని లోకేష్ కోరారు. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తమ పిల్లల చదువులపై ప్రత్యేక దృష్టి సారించి, వారిలో మానసిక స్థైర్యం పెంపొందించేలా చూడాలన్నారు. విద్యార్థులు కూడా ఎట్టి పరిస్థితుల్లో సమయాన్ని వృథా చేయకుండా.. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని లోకేష్ కోరారు. విద్యార్థులందరికీ లోకేష్ ఆల్ ది బెస్ట్ చెప్పారు.

ఏపీ ఇంటర్ షెడ్యూల్ ఇదే..

AP Inter Exams 2025
AP Inter Exams 2025

 

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×