Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై పోలీస్ కేసు నమోదు అయిన విషయం తెల్సిందే. పుష్ప 2 ప్రీమియర్స్ లో విషాద సంఘటన చోటుచేసుకున్న విషయం విదితమే. ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్లో అల్లు అర్జున్ సినిమాను చూడడానికి రావడంతో, అభిమానులు భారీ సంఖ్యలో ఆయనను చూడడానికి ఎగబడ్డారు. దీంతో ఒక్కసారిగా తోపులాట జరగడంతో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు ఛార్జ్ చేశారు. ఈ నేపథ్యంలోనే రేవతి అనే మహిళ ఈ సంఘటనలో మృతి చెందగా, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే.
ఇక రేవతి మృతికి థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్ కూడా కారణమే అని వారిపై కేసు నమోదు చేశారు పోలీసులు. అల్లు అర్జున్‌ను నిందితుడిగా చేర్చి కేసు నమోదు చేశారు. ఇప్పటికే తొక్కిసలాటకు కారణమైన ముగ్గురిని అరెస్ట్ చేశారు. సంధ్య థియేటర్ ఓనర్, మేనేజర్, సెక్యూరిటీ మేనేజర్లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. అయితే అసలు ఆ ఘటనకు తమకు ఏ సంబంధం లేదని థియేటర్ యాజమాన్యం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
Kavya Kalyanram: ఎద అందాలను ఎరగావేసి కిక్కెక్కిస్తున్న బలగం బ్యూటీ
ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ అనుకుంటే.. అల్లు అర్జున్ సైతం తనపై పెట్టిన కేసును కొట్టివేయాలని హైకోర్టు ను ఆశ్రయించడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇందుకు సంబంధించిన పూర్తివివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి. బన్నీకి ఈ కోర్టులు కేసులు కొత్తేమి కాదు. గతంలో కూడా నంద్యాల ఘటనప్పుడు కూడా బన్నీపై కేసు నమోదు అయ్యింది. ఏపీ ఎన్నికల సమయంలో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ పోలీసులు బన్నీపై కేసు నమోదు చేశారు.
సెక్షన్ 144 అమల్లో ఉండగా పర్మిషన్ లేకుండా బన్నీ ప్రచారంలో పాల్గొన్నాడని పోలీసులు ఆరోపిస్తూ కేసు నమోదు చేశారు. అప్పుడు కూడా బన్నీ.. తనపై వేసిన కేసును కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించాడు. దాదాపు కొన్ని నెలల తరువాత ఈ కేసును విచారించి ఆయనపై నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని నంద్యాల పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఇక ఇప్పుడు కూడా ఈ కేసును కొట్టివేయాలని బన్నీ పిటిషన్ దాఖలు చేశాడు.
Manchu Family Issue: గొడవలపై మంచు లక్ష్మి ఇన్‌డైరెక్ట్ పోస్ట్.. లైక్ కొట్టిన మనోజ్ భార్య
అయితే.. చాలామంది ఈ విషయంలో బన్నీపై మండిపడుతున్నారు. నీకోసం, నీ సినిమా చూడడానికి వచ్చినవారు ప్రాణాలు కోల్పోయారు. కనీసం వారింటికి వెళ్లి ఇప్పటివరకు పలకరించలేదు. డబ్బు ఉంది కదా అని రూ. 25 లక్షలు ఇస్తానని చెప్పి చేతులు దులుపుకున్నావ్. ఇప్పుడు కేసు కూడా నీ మీద ఉండకూడదని హైకోర్టుకు మళ్లీ పిటిషన్ పెట్టావు.. ఇది అన్యాయం అని కామెంట్స్ పెడుతున్నారు. ఇంకోపక్క .. మహిళలు ప్రీమియర్ షోలకు రావడం తప్పు. హీరోలు వస్తారు అని తెలిసినప్పుడు తొక్కిసలాటలు జరుగుతాయి. అలాంటి ప్లేస్ లకు కుటుంబాలను తీసుకురాకూడదు అని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇక ఈ కేసుపై విచారణ త్వరలోనే జరగనుంది. మరి ఈసారి అల్లు అర్జున్ విషయంలో హైకోర్టు ఎలాంటి తీర్పును ఇస్తుందో చూడాలి.