Pushpa 2: పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా.. ఇంటర్నేషనల్. ఈ డైలాగ్ ను అక్షరాలా నిరూపించాడు అల్లు అర్జున్. స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిత్రం పుష్ప 2. అత్యున్నత నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్ సుకుమార్ రైటింగ్ సంస్థతో కలిసి ఈ ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ సినిమాను నిర్మించింది. ఇక ఈ చిత్రంలో బన్నీ సరసన రష్మిక మందన్న నటించగా.. కిస్సిక్ సాంగ్ లో అందాల శ్రీలీల మెరిసింది.
మూడేళ్ళ క్రితం ఈ కాంబోలోనే వచ్చిన పుష్ప ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన పుష్ప 2 పై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక ఎన్నో అంచనాల మధ్య పుష్ప 2 డిసెంబర్ 5 న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. విడుదలకు ముందే ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం సినిమా విడుదల రోజు ప్రీమియర్‌స్ నుంచే సెన్సేషనల్ హిట్ అందుకుంది.
Allu Arjun: హైకోర్టును ఆశ్రయించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
ఇక మొదటి రోజు నుంచి ఇప్పటివరకు కోట్ల కలక్షన్స్ రాబడుతూ రికార్డులు సృష్టిస్తుంది. అల్లు అర్జున్ నట విశ్వరూపంకు, సుకుమార్ వరల్డ్ క్లాస్ టేకింగ్.. ప్రపంచ సినీ ప్రేమికులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా ఇండియాలో ఈ చిత్రం సృష్టించిన రికార్డుల పరంపరకు ఆకాశమే హద్దుగా మారింది.
కేవలం ఆరు రోజుల్లో పుష్ప 2 రూ. 1000 కోట్లు రాబట్టి రికార్డులను తిరగరాసింది. కేవలం ఆరు రోజుల్లోనే రూ.1002 కోట్లు వసూలు చేసిన తొలి భారతీయ చిత్రంగా పుష్ప 2 రికార్డ్ ను క్రియేట్ చేసింది. ఈ విషయాన్నీ మేకర్స్ అధికారికంగా పోస్టర్ ద్వారా తెలిపారు. అల్లు అర్జున్ క్లైమాక్స్ లో అగ్రెస్సివ్ గా ఉన్న లుక్ ను వెయ్యి కోట్ల పోస్టర్ లో చూపించారు.
Kavya Kalyanram: ఎద అందాలను ఎరగావేసి కిక్కెక్కిస్తున్న బలగం బ్యూటీ
కేవలం తెలుగులోనే కాకుండా ప్రతి భాషలో సునామీలా దూసుకుపోతుంది పుష్ప-2. ముఖ్యంగా బాలీవుడ్‌లో తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. బాలీవుడ్‌లో హిందీలో ఆరు రోజులకు రూ. 375 కోట్లు కలెక్ట్ చేసి అక్కడ కూడా కొత్త రికార్డును నెలకొల్పింది. బాలీవుడ్ చరిత్రలోనే ప్పటివరకు రూ.375 కోట్లు కలెక్ట్ చేసిన చిత్రం లేదు. ఇక అక్కడ కూడా రూ.375 కోట్లు కలెక్ట్ చేసిన ఫాస్టెస్ట్ హిందీ చిత్రంగా నిలిచింది.
దీంతో పాటు పలు రికార్డులు కూడా పుష్పరాజ్ కైవసం చేసుకున్నాడు. పుష్ప 2 లో బన్నీ నటనే హైలైట్ అని చెప్పాలి. కేవలం భార్యకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం పుష్ప ఎలాంటి సాహసం చేశాడు.. ? ఎంత రాజకీయం నడిపించాడు.. ? అనేది పుష్ప 2 లో చూపించారు.
Suriya 46: మలయాళ స్టార్ డైరెక్టర్ తో సూర్య.. ?
ఇంకోపక్క పార్ట్ 1 కి పార్ట్ 2 కి సంబంధం లేదు అని, అసలు పుష్ప 2 లో కథ లేదని వార్తలు కూడా వచ్చాయి. కానీ, ఆ మాటలను ఫ్యాన్స్ ఎవరు పట్టించుకోకుండా బన్నీ నటన కోసమే థియేటర్లకు క్యూ కడుతున్నారు. మరి ముందు ముందు ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు కొల్లగొడుతుందో చూడాలి.