Minister Parthasarathi: కూటమిలో చీలిక తెచ్చేందుకు వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోందా? తొలుత టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య ప్లాన్ చేసిందా? బూమరాంగ్ కావడంతో నేతల మధ్య చిచ్చుకు ప్రయత్నించిందా? దీనికి మాజీ మంత్రి జోగి రమేష్‌ను అస్త్రంగా ఉపయోగించుకుందా? టీడీపీలో రేగిన కార్యకర్తలకు తుపాన్‌కు స్వయంగా మంత్రి పార్థసారధి క్షమాపణలు చెప్పడానికి కారణమేంటి?
టీడీపీలో నేతలు, కార్యకర్తల మధ్య చిచ్చు పెట్టి సక్సెస్ అయ్యింది వైసీపీ. మాజీ మంత్రి జోగి రమేష్ ద్వారా అస్త్రాన్ని ప్రయోగించింది. దీంతో టీడీపీ నేతలు, కార్యకర్తల మధ్య తుపాన్ తీవ్రమైంది. ఈ వ్యవహారంపై టీడీపీ హైకమాండ్ సీరియస్ అయ్యింది. చివరకు మంత్రి పార్థసారధి మీడియా ముందుకొచ్చి పార్టీ కార్యకర్తలకు క్షమాపణలు చెప్పారు.
మూడు రోజుల కిందట ఉమ్మడి కృష్ణాజిల్లా నూజివీడు నియోజకవర్గంలో సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహా విష్కరణ జరిగింది. దీనికి గౌడ్ కమ్యూనిటీ కీలక నేతలతోపాటు పలాస టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష, మంత్రి పార్థసారధి హాజరయ్యారు. గౌతు లచ్చన్న విగ్రహం ప్రారంభానికి ముందు నేతలు వాహన శ్రేణిని ఏర్పాటు చేసింది.
గౌడ కమ్యూనిటీ సభ్యులతోపాటు కొనకళ్ల నారాయణ, ఎమ్మెల్యే గౌతు శిరీష, మంత్రి పార్థసారధి ఉన్నారు. అదే సమయంలో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ కూడా రోడ్ షోలో పాల్గొన్నారు. అయితే జోగి రమేష్ హాజరు కావడంపై రగిలిపోయారు పార్టీ కార్యకర్తలు. దీనిపై టీడీపీ హైకమాండ్ సీరియస్ అయ్యింది.
ALSO READ: సినిమాను తలపించేలా.. కూతురి కిడ్నాప్‌కు తల్లి ఎర
మంత్రి పార్థసారధి నేరుగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌కు కలిసి జరిగిన వ్యవహారంపై క్లారిటీ ఇచ్చారు. అయినా వ్యవహారం తీవ్రమవుతూనే ఉంది. చివరకు మంగళవారం ఉదయం మీడియా ముందుకొచ్చి క్షమాపణలు చెప్పారు మంత్రి పార్థసారధి. నేతలు, కార్యకర్తలు మనసు బాధపడిన ఘటనలు కొన్ని జరిగాయని తెలిపారు. పత్రికల్లో వచ్చిన వార్తల నేపథ్యంలో క్లారిఫికేషన్ ఇచ్చారు.
గౌతు లచ్చన్న విగ్రహం ప్రారంభోత్సవ కార్యక్రమానికి-పార్టీకి ఎలాంటి ప్రమేయం లేదన్నారు మంత్రి. గౌడ కమ్యూనిటీకి చెందినవారు మాత్రమే హాజరయ్యారని తెలిపారు. ఈవెంట్‌ను గౌడ కమ్యూనిటీ మాత్రమే డిజైన్ చేసిందన్నారు. కార్యక్రమానికి వచ్చిన ఇన్విటేషన్‌ను ఆయన మీడియా ముందు చూపించారు. వైసీపీకి చెందినవాళ్లు ఎవరైనా వస్తున్నారని అడిగానని వెల్లడించారు.
ఈవెంట్‌కు వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్‌ను చూసి తాను షాకయ్యానని తెలిపారు మంత్రి పార్థసారధి. ఆ తరహా చిల్లర చేష్టలు చేయడం వైసీపీకి వెన్నుతో పెట్టిన విద్యగా వర్ణించారు. గతంలో తాను అల్లరి పాలైన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అక్కడున్నవారంతా టీడీపీ విజయానికి కృషి చేసినవారన్నారు.
సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ నాయకత్వాన్ని బలంగా నమ్మి పార్టీలోకి వచ్చానన్నారు మంత్రి పార్థసారధి. తన గౌరవాన్ని టీడీపీ హైకమాండ్ పెంచిందన్నారు. మరొక్కసారి టీడీపీ కార్యకర్తలకు క్షమాపణలు చెప్పారు. ఎన్నికలకు ఐదు నెలలు ముందు టీడీపీలో తాను జాయిన్ అయ్యానని, అయినా కార్యకర్తలు తనను గెలిపించారన్నారు. అటు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష సైతం ఓ వీడియోను విడుదల చేసిన విషయం తెల్సిందే.