BigTV English

Gold Loans: గోల్డ్ లోన్ తీసుకున్న‌వారికి ఆర్బీఐ గుడ్ న్యూస్.. త్వ‌ర‌లో ఇలా చెల్లించే ఆప్ష‌న్?

Gold Loans: గోల్డ్ లోన్ తీసుకున్న‌వారికి ఆర్బీఐ గుడ్ న్యూస్.. త్వ‌ర‌లో ఇలా చెల్లించే ఆప్ష‌న్?

Gold Loans: ఆర్థికంగా ఏదైనా అత్య‌వ‌స‌రం ప‌డిందంటే చాలా మంది ప్ర‌స్తుతం గోల్డ్ లోన్ వైపే చూస్తున్నారు. క్ష‌ణాల్లో డ‌బ్బులు రావ‌డం, వ‌డ్డీలు కూడా త‌క్కువ‌గా ఉండ‌టంతో గోల్డ్ లోన్ తీసుకునేందుకే ఆస‌క్తి చూపిస్తున్నారు. బ్యాంకులు కూడా ఎలాంటి కండిష‌న్స్ లేకుండా లోన్లు ఇస్తున్నాయి. కేవ‌లం బ్యాంకులు మాత్ర‌మే కాకుండా కొన్ని ప్రైవేటు సంస్థ‌లు కూడా గోల్డ్ లోన్ ఇస్తాయి. అయితే ఆ సంస్థ‌ల్లో ఈఎంఐ ప‌ద్ద‌తిలో అస‌లును సైతం క‌ట్టుకునే వెసులుబాటు ఉంటుంది.


Also read: ఆశలు ఆవిరి.. మళ్లీ పెరిగిన గోల్డ్ రేట్స్.. తులం ఎంత ఉందంటే..

కానీ బ్యాంకుల్లో ఆ ఆప్ష‌న్ ఉండ‌దు. ప్ర‌తినెలా వ‌డ్డీ చెల్లిస్తూ అస‌లును ఒకేసారి చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఒకేసారి మొత్తాన్ని క‌ట్ట‌లేక ప్రైవేటు రుణ సంస్థ‌ల్లో గోల్డ్ లోన్ ఎక్కువ‌గా తీసుకుంటున్నారు. అలాంటి వారికోసం ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. తాక‌ట్టు రుణాల‌ను ఈవీఎం నెల‌వారీ కిస్తీ ప‌ద్ధ‌తిలో చెల్లించే స‌దుపాయాన్ని త్వ‌రలోనే అందుబాటులోకి తీసుకురావాల‌ని ఆలోచిస్తున్న‌ట్టు స‌మాచారం. ఈ రుణ మంజూరులో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఆర్బీఐ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది.


ఇదిలా ఉండ‌గా ప్ర‌స్తుత ఆర్థిక సంవత్స‌రం సెప్టెంబ‌ర్ 20 నాటికి దేశంలోని బ్యాంకులు దాదాపు రూ.1.14 ల‌క్ష‌ల కోట్ల విలువైన బంగారం తాక‌ట్టు రుణాల‌ను మంజూరు చేసిన‌ట్టు ఆర్బీఐ గ‌ణాకాంలు చెబుతున్నాయి. ఇక గ‌తేడాదితో పోలిస్తే ఈ ఏడాది 14.6 శాతం ఎక్కువ తీసుకున్న‌ట్టు స‌మాచారం. ఆర్బీఐ ఇలా చేస్తే బ్యాంకుల్లో బంగారు రుణాల సంఖ్య మ‌రింత పెర‌గ‌నుంది. క‌స్ట‌మ‌ర్ల‌కు సైతం ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో మేలు చేకూర‌నుంది.

Related News

D-Mart: కొనేది తక్కువ, దొంగతనాలు ఎక్కువ.. డి-మార్ట్ యాజమాన్యానికి కొత్త తలనొప్పి!

JIO Super Plans: జియో నుంచి సూపర్ ఆఫర్లు.. ఏది ఫ్రీ, ఏది బెస్ట్ అంటే?

SEBI – Foreign Funds: భారతీయ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. విదేశీ ఫండ్స్‌కి SEBI గ్రీన్ సిగ్నల్

ICICI Bank New Rules: కస్టమర్లకు ICICI బిక్ షాక్.. కనీస బ్యాలెన్స్ రూ.10 వేలు కాదు.. అంతకుమించి.. పేదోళ్ల సంగతి ఏంటో?

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Big Stories

×