E-Paper
Advertisement

Peddireddy Vs Chandrababu: రాళ్ల దాడి చేస్తే సింపథీ వస్తుందా బాబు..? టీడీపీకి పెద్దిరెడ్డి కౌంటర్!

Peddireddy Vs Chandrababu: రాళ్ల దాడి చేస్తే సింపథీ వస్తుందా బాబు..? టీడీపీకి పెద్దిరెడ్డి కౌంటర్!
Advertisement

Peddireddy Counter to Chandrababu on Stone Attack: ఎన్నికల వేళ వైసీపీ అధినేత జగన్ వేసిన ప్లాన్స్ బూమరాంగ్ అవుతున్నాయా? అవుననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. బస్సుయాత్రలో భాగంగా కొద్దిరోజులుగా సాయంత్రం ఏడులోపే తన ప్రచారాన్ని జగన్ ముగించారు. కానీ, శనివారం రాత్రి కొనసాగించారు. ఏ భయంతోనైతే రాత్రి వేళ ప్రచారం చేశారో.. అదే భయం ఆయనను వెంటాడింది. చివరకు రాయి దాడి జరిగింది. ఈ విషయంలో అధికార-విపక్షాల మధ్య మాటలను పక్కనబెడితే అసలు విషయానికొద్దాం.

ముఖ్యమంత్రి పర్యటన అంటే అధికారులు చాలా జాగ్రత్తంగా ఉంటారు. ఏమైనా జరిగితే పోలీసులే బాధ్యతలవుతారు. అందుకే ఎప్పటికప్పుడు భద్రతను పర్యవేక్షిస్తారు. అయితే విజయవాడలో జగన్ రాయి దాడిన ఘటన జరిగిన వేళ విద్యుత్ పోవడంపై అందరికీ అనుమానాలు మొదలయ్యాయి. ముఖ్యంగా జగన్ ప్రచారానికి ప్రజలు ఎవరూ రాకపోవడంతో విద్యుత్ కాసేపు ఆపితే ప్రజలు బయటకు వస్తారని భావించి ఈ పని చేసినట్లు సోషల్‌మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.

Advertisement

జగన్ ప్రచారం సమయంలో ఓవైపు వైఎస్ షర్మిల, మరోవైపు చంద్రబాబు చేస్తున్న ప్రచారానికి విద్యుత్ ఎక్కడా పోలేదు. కేవలం జగన్ ప్రచారం సమయంలో మాత్రమే విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీన్ని బట్టి ఆ పని వైసీపీ కేడర్ చేసి ఉండచ్చని భావిస్తున్నారు. ఈ ఘటన జరిగి సెకన్ల వ్యవధిలో వైసీపీ సోషల్ మీడియాలో చేరిందనేది టీడీపీ వాదన. అంతేకాదు నాలుగు రోజుల్లో రాష్ట్రంలో సంచలన ఘటన జరుగు తుందని వైసీపీ సోషల్ మీడియా విభాగానికి చెందిన ఓ వ్యక్తి చేసిన పోస్టు ఇక్కడ కీలకంగా మారింది. ఈ విషయాన్ని ఆధారాలతో సైతం టీడీపీ నేత పయ్యావుల కేశవ్ బయటపెట్టారు. ఇదంతా వైసీపీ ప్రణాళికలో భాగమేనన్నది టీడీపీ ఆర్యుమెంట్.

Also Read: Siromundanam Case Verdict : తోట త్రిమూర్తులుకు షాక్.. శిరోముండనం కేసులో జైలు శిక్ష

Advertisement

సీన్ కట్ చేస్తే.. అసలు విషయానికొద్దాం. ఆదివారం గాజువాక రోడ్ షోలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతుండగా గుర్తు తెలియని వ్య‌క్తులు ఆయనపైకి రాయి విరిరారు. ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్ర బాబు, బాంబులకే బయపడలేదని, రాళ్లకు భయపడతానా అంటూ ప్రశ్నించారు. సీఎం జగన్‌పై రాయి దాడి ఘటనను ఖండించానని, కానీ అరగంటలోపే నా ప్లకార్డులు చూపించి తాను రాయి వేయించానని జగన్ ప్రచారం చేశారని దుయ్యబట్టారు. ఈ విషయమై పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి రియాక్ట్ అయ్యారు. చంద్రబాబు వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తంచేసిన ఆయన రాళ్లు వేయించుకుంటే సింపథీ వస్తుందా అని ప్రశ్నించారు. వయసుకు తగినట్టు ఆయన మాట్లాడడం లేదన్నారు. అలిపిరి ఘటన తర్వాత చంద్రబాబు ముందస్తు ఎన్నికలకు వెళ్లారని.. అప్పుడు ఆయనకు సింపథీ వర్కవుటయ్యిందా అని ప్రశ్నించారు.

Also Read: Glass for Janasena : బిగ్ రిలీఫ్.. గాజుగ్లాసు జనసేనకే

మొత్తానికి రాయి ఎటాక్ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఆరు బ‌ృందాలను రంగంలోకి దిగాయి. ఘటన జరిగి దాదాపు 48 గంటలు కావస్తోంది. అయినా ఎవరినీ పట్టుకున్న సందర్భాలు లేవు. ఈ క్రమంలో ఈసీ దృష్టి పోలీసుల బాస్‌పై పడినట్టు సమాచారం. వరుసగా అధికార, విపక్షాల నేతలపై రాళ్ల దాడి జరగడం, పోలీసులు సరైన చర్యలు చేపట్టకపోవడమే దీనికి కారణమని అనుమానిస్తున్నారట. పోలీసు బాస్‌ని మారిస్తే ఈ సమస్యకు పుల్‌స్టాప్ పడవచ్చని, నేతల ప్రచారం తాపీగా జరగవచ్చని అధికారుల్లో ఓ వర్గం చెబుతోంది.

Related News

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

Big Stories

Advertisement
×