Big Stories

Darsi Politics in AP: దర్శి యూటర్న్.. మార్పులతో సతమతం

Darsi Politics in AP: ప్రకాశం జిల్లా దర్శితో అధికార వైసీపీ అభ్యర్ధిని మార్చింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ని పక్కనపెట్టి ఆయనకు ముందు ఎమ్మెల్యేగా గెలిచిన బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డిని ఈ సారి పోటీలో దింపింది. ఇద్దరూ బలమైన అభ్యర్ధులే కావడంతో దర్శిలో వైసీసీ హ్యాట్రిక్ విజయం ఖాయమని భావించారు. అయితే టీడీపీ అనూహ్యంగా గొట్టిపాటి ఆడపడుచు లక్ష్మిని బరిలోకి దింపడంతో దర్శి ఈక్వేషన్లు చకచకా మారిపోతున్నాయి. లక్ష్మి స్వయంగా వెళ్లి మద్దిపాటిని కలిసి మద్దతుకోరడం.. ఆయన సానుకూలంగా స్పందించారన్న ప్రచారంతో దర్శి రాజకీయ సమీకరణలు మారిపోయే పరిస్థితి కనిపిస్తుంది.

- Advertisement -

ప్రకాశం జిల్లా దర్శి రాజకీయాలు కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. ఉహించని పరిణామాలు దర్శి నియోజకవర్గంలో చోటుచేసుకుంటున్నాయి. దర్శిలో టీడీపీ అభ్యర్ధిని ప్రకటించక ముందు పొలిటికల్ సీన్ వైసీపీకి వన్ సైడ్‌గా కనిపించింది. అనూహ్యంగా పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మిని టీడీపీ అభ్యర్ధిగా ప్రకటించడంతో దర్శిలో రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. జిల్లాలో బలమైన రాజకీయ నేపధ్యం ఉన్న గొట్టిపాటి ఇంటి ఆడపడుచు కావడం.. అద్దంకిలో వరుస విజయాలు సాధిస్తున్న గొట్టిపాటి రవి స్వయంగా లక్ష్మికి బాబాయ్ అవ్వడం దర్శిలో ఆమెకు ప్లస్ అవుతోంది.

- Advertisement -

ఆ క్రమంలో వైసీపీ లోకల్ నేతలు టీడీపీలోకి జంప్ అవుతుండటం అధికారపక్షానికి కొత్త టెన్షన్ పుట్టిస్తుందంట. తాజాగా గొట్టిపాటి లక్ష్మి వైసీపీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ఇంటికి వెళ్లి కలిసి.. తనకు మద్దుతు ఇవ్వాలని కోరారు. మద్దిశెట్టి సానుకులంగా స్పందించారంట. టీడీపీ అభ్యర్ధి గొట్టిపాటి లక్ష్మికి , ఆమెతో పాటు వచ్చిన టీడీపీ నేతలకు టీ పార్టీ కూడా ఇవ్వడంతో వైసీపీలో మద్దిశెట్టి సెగలు రాజుకుంటున్నాయంటున్నారు.

Also Read: Stone Politics In AP: రాయి పడుద్ది!.. ఏపీలో కాకరేపుతున్న రాయి రాజకీయం

వైసీపీ అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మద్దిశెట్టికి ఈ సారి టికెట్ ఇవ్వలేదు. 2014లో దర్శి వైసీపీ ఎంపీగా గెలిచిన డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డికి ఈ సారి అవకాశం ఇచ్చింది. దాంతో మద్దిశెట్టి తీవ్ర అసంతృప్తితో కనిపిస్తున్నారు. మద్దిశెట్టిని పర్చూరు వెళ్లమని వైసీసీ అధిష్టానం సూచించినా ఆయన అంగీకరించలేదు. టీడీపీ గొట్టిపాటి లక్ష్మి అభ్యర్ధిత్వాన్ని ప్రకటించకముందు మద్దిశెట్టి జనసేన , టీడీపీ టికెట్ కొసం తీవ్ర స్థాయిలో ప్రయత్నించారు. మచిలిపట్నం ఎంపి బాలసౌరితో కలసి పవన్ కల్యాణ్‌ని కలిసి వచ్చారు.

చిత్తూరు జిల్లా పర్యటన సమయంలో చంద్రబాబును మద్దిశెట్టి వెళ్లి కలిశారు. ఆ క్రమంలో మద్దిశెట్టిపై టీడీపీ ఐవీఆర్ఎస్ సర్వే కూడా చేయించింది. టీడీపీ ఆ సర్వే రిపోర్టులు మద్దిశెట్టికి నెగిటివ్‌గా వచ్చాయంట. అదే టైంలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్కికి అనుకూలత వ్యక్తం అవ్వడంతో టిడిపి ఆమె పేరు ప్రకటించింది. గొట్టిపాటి ఇంటి నేతగా క్లీన్ ఇమేజ్ ఉన్న డాక్టర్ లక్ష్మికి దర్శిలో సానుకూలంశాలు కనిపిస్తున్నాయి. దర్శి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మద్దిశెట్టి తనకు టికెట్ దక్కక పొవటంతో తన మద్దతును టీడీపీ ప్రకటించారు.

Also Read: KCR Silent Over Kavitha Arrest : కేసీఆర్.. కవిత.. ఓ లిక్కర్ స్కామ్..

ఇప్పుడు మద్దిశెట్టి వైసీపీపై కంటే.. ప్రస్తుత వైసీపీ అభ్యర్ధిగా ప్రకటించిన బూచేపల్లి శివ ప్రాసాద్‌రెడ్డి అంటేనే ఎక్కువ ఆగ్రహంతో ఉన్నారంట. మద్దిశెట్టి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచే ఇద్దరు మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చి.. అది పూడ్చలేని అగాధంలా మారిందంటున్నారు. అందుకే ఈ సారి ఎట్టి పరిస్థితుల్లో బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఓడించాలని మద్దిశెట్టి పట్టుదలతో ఉన్నారు. అందుకే తన ఇంటికి ఇన్వైట్ చేసి మరీ టీడీపీ వాళ్ళకి విందు ఇచ్చారంట. మద్దిశెట్టిని కలిసి వచ్చిన టీడీపీ నేతలు, త్వరలోనే ఆయన నిర్ణయాన్ని ప్రకటించి తమకు మద్దతిస్తారని చెప్తున్నారు

మద్దిశెట్టి టీడీపీ మద్దతు ప్రకటించడంతో మంత్రి బొత్స సత్యనారాయణ రంగంలోకి దిగారు. ఆయన మద్దిశెట్టి తో మంతనాలు జరిపినా.. మద్దిశెట్టి మాత్రం బూచేపల్లికి సహకరించే పరిస్థితి లేదని తెగేసి చెప్పారంట. బొత్స, మద్దిశెట్టిల మధ్య వ్యాపార సంబంధాలున్నాయి. అందుకే వైసీపీ పెద్దలు బొత్సను రంగంలోకి దింపారంట. అయినా ఫలితం లేకపోవటంతో మద్దిశెట్టి సంగతి ఎన్నికల తర్వాత చూద్దాం అంటోందంట వైసీపీ అధిష్టానం.

మద్దిశెట్టి దర్శిలో కీలకంగా ఉన్న ఆయన సొంత సామాజికవర్గం కాపుల్లో మంచి పలుకుబడి ఉండటం. గొట్టిపాటి లక్ష్మి కమ్మ నాయకురాలు అవ్వడం.. స్థానిక జనసేన నేతల నుంచి పూర్తి సహకారం లభిస్తుండటంతో కమ్మ, కాపు ఈక్వేషన్ తమకు అడిషనల్ అడ్వాంటేజ్ అవుతుందని లెక్కలు వేసుకుంటున్నారు తెలుగు తమ్ముళ్లు. దానికి తగ్గట్లే ఇప్పుడు వార్ వన్ సైడ్ కాదని బూచేపల్లి శివప్రాసాద్ వర్గీయులు ఒప్పుకుంటున్నారు. మద్దిశెట్టి గత 2019 సార్వత్రిక ఎన్నికలలో పొటీ చేసినప్పుడు అప్పటి పరిస్థితుల్లో.. పోటీకి తనకి తానే దూరమయ్యారు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి. అప్పట్లో ఆయన వర్గం మద్దిశెట్టికి సపోర్ట్ చేసింది.

Also Read: కుటుంబం.. అన్నగారి కుటుంబం!

తర్వాత దర్శి మున్సిపల్ ఎన్నికలలో మద్దిశెట్టికి మాజీ ఎమ్మెల్యే వర్గం సపోర్ట్ చేయలేదు. ఫలితం దర్శి మున్సిపాలిటి ని టీడీపీ కైవసం చేసుకుంది. దర్శిలో మున్సిపాలిటి లో వైసీపీ ఓడిపోవటానికి కారణం బూచేపల్లేనని మద్దిశెట్టి చాలాసార్లు ఓపన్‌గానే ఆరోపించారు. అప్పటి నుంచి ఇద్దర మధ్య పొలిటికల్ వార్ స్టార్ట్ అయింది. అదలా ఉంటే ఇప్పుడు దర్శిలో లోకల్ నాన్ లోకల్ ఫిలింగ్ ను వైసిపి గట్టిగానే లేవనెత్తుతుంది. గెలిచిన ఓడినా తాను మాత్రం దర్శిలో ఉంటానని, ఇక్కడకి రాజకియ అవసారాల కోసం వచ్చిన వాళ్లు తమ అవసరాలు తీరాక మూట ముళ్లె సర్దుకొని దర్శి నుంచి పొతారని బూచేపల్లి శివప్రాసాద్‌రెడ్డి ప్రచారంలో ఊదరగొడుతున్నారు. నరసరావుపేటలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రాక్టీసు చేస్తుంటారని పదేపదే ఎత్తి చూపిస్తున్నారు.

ఇటు టీడీపీ అబ్యర్ధి గొట్టిపాటి లక్ష్మి మీ ఆడపిల్లను .. మీ ఊరికి వచ్చాను.. ఆశ్వీర్వదించడి అంటూ ప్రచారంలో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. దర్శి నియోజకవర్గం టీడీపీ హయంలోనే అభివృద్ది చెందిందని గుర్తు చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాను గట్టిగా వాడుకుంటున్న లక్ష్మి బూచేపల్లిపై గొట్టిగా కౌంటర్స్ వేస్తున్నారు. శివ ప్రాసాద్ రెడ్డి అవినితి పరుడని , దోపిడీ దారుడని తన ఫేస్‌బుక్ పేజి ద్వారా తీవ్ర స్ధాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. మెుత్తమ్మిద దర్శిలో పొలికల్ హిట్ పీక్ స్టేజ్‌కి చేరుతోంది. శత్రువుకి శత్రువు .. మిత్రుడవుతాడన్నట్లు.. బూచేపల్లిపై కోపంతో మద్దిశెట్టి వచ్చి.. గొట్టిపాటి లక్ష్మికి మద్దతు ప్రకటించడం. దర్శి రాజకీ ముఖచిత్రాన్నే మర్చేస్తోంది. మరి మున్ముందు మద్ధిశెట్టి పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News