Anantapur News: తమ కొడుకు ఈ లోకంలోలేడని జీర్ణించుకోలేక పోతున్నారు జవాన్ మురళీనాయక్ తల్లిదండ్రులు. వారిని ఓదార్చడం ఎవరివల్ల కావడంలేదు. కొడుకు తలచుకుని కన్నీరు మున్నీరు అవుతున్నారు పేరెంట్స్. కనీసం మంచి నీళ్లు కూడా ముట్టడంలేదు. వారిని ఆ స్థితిలో చూసి చలించిపోయారు మంత్రి కవిత. ఓ వైపు ఆ తల్లికి ధైర్యం చెబుతూ అన్నంపెడుతూ కాసింత ఎమోషన్ అయ్యారు.
దేశ సరిహద్దును ఇల్లుగా భావించాడు జవాను మురళీ నాయక్. పౌరుల రక్షణను తన కర్తవ్యంగా మార్చుకున్నాడు. ఎత్తైన పర్వతాల్లో ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయలేదు. కంటిమీద కునుకు లేకుండా కాపలా కాస్తూ శత్రువును ఎదురొడ్డి వీరమరణం పొందాడు ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన జవాన్ మురళీ నాయక్.
జమ్మూకాశ్మీర్ బోర్డర్‌లో ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో తెలుగు జవాన్ మురళీనాయక్ వీర మరణం పొందాడు. సత్యసాయి జిల్లాకు చెందిన మురళీ చిన్నప్పటి నుంచి పడిన కష్టాలు అన్నీఇన్నీకావు. చివరకు అగ్నివీర్ ద్వారా సైన్యంలో అడుగుపెట్టాడు. చేతికి అందివచ్చిన కొడుకు ఈ లోకంలో లేడని తెలిసి శ్రీరాం నాయక్-జ్యోతీ బాయి దంపతులు విలవిల్లాడిపోతున్నారు.
ఎంతమంది వచ్చి ఓదార్చినా కన్న కొడుకు లేని లోటును ఎవరూ తీర్చలేకపోతున్నారు. గోరంట్ల మండలంలో కళ్లితండాలో అగ్నివీర్ మురళీనాయక్ తల్లిదండ్రుల బాధ. వారిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. చివరకు సోమవారం మంత్రి సవిత మురళీనాయక్ ఇంటికి వెళ్లింది. కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి దైర్యం చెప్పే ప్రయత్నం చేశారు.
ALSO READ: అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు, స్పాట్ లో 30 మంది శ్రీవారి భక్తులు
ఆథ్యాత్మికంగా చెప్పాల్సినవన్నీ ఆ దంపతులకు చెప్పారు. కానీ వారి మనసంతా కొడుకుపైనే ఉంది. చివరకు మురళీ తల్లి మంత్రి సవిత తన చేతులతో అన్నం పెట్టారు. ఆ స్థితిలో ఆమెని చూసి మంత్రి సవిత కంటతడి పెట్టారు. రాజకీయ నాయకులు, మాజీ సైనికులు, అధికారులు ఎంత దైర్యం చెప్పినా ఆ తల్లిని ఓదార్చడం ఎవరితరం కావడంలేదు.
కొడుకును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న వీర జవాన్ మురళి నాయక్ తల్లికి అన్నం తినిపించిన మంత్రి సవిత. #MuraliNayak #IndiaPakistanWar pic.twitter.com/3TdxUkhdJ0
— BIG TV Breaking News (@bigtvtelugu) May 12, 2025