Asaduddin Owaisi Constitution| వక్ఫ్ బోర్డు ఆస్తులను లాగేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని.. ప్రధాన మంత్రికి అసలు రాజ్యాంగం గురించి అవగాహన లేదని ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాజ్యంగం 75వ వార్షకోత్సవాల సందర్భంగా పార్లమెంటు లోక్ సభలో హైదరాబాద్ ఎంపీ అసదుదద్దీన్ ఒవైసీ 9 నిమిషాల పాటు ప్రసంగం చేశారు.
” 500 ఏళ్ల క్రితం మసీదులు ఉన్నాయా? అని ఈ రోజు నన్ను ప్రశ్నిస్తున్నారు. నేను కూడా ఈ పార్లమెంటు భవనాన్ని తొవ్వితే ఏదో ఒకటి లభిస్తుంది. అది నాకు చెందినదే అని నేను చెబుతాను. మరి అలాంటి పరిస్థితుల్లో ఈ పార్లమెంటు అంతా నా ఆస్తి అయిపోతుందా?. 75 ఏళ్ల క్రితం బాబా సాహెబ్ అంబేడ్కర్ ఏం చెప్పారో అది ఈ రోజుకీ నిజమని నిరూపితమవుతోంది. అన్ని రాజకీయ పార్టీలు మైనారిటీలతో అధికారం పంచుకునేందుకు సిద్దంగా లేదు. పార్లమెంటులో ప్రజాస్వామ్యం గురించి నేను ఒక విషయం చెప్పాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 26, 26, 29, 30, 25, 21 ప్రకారం.. పౌరుల సమాన హక్కుల గురించి ప్రస్తావన ఉంది. వీటిని విశ్లేషిస్తే.. సమాజంలో అణిగారిన, బలహీన వర్గాలకు న్యాయం జరగాలి. కానీ అలా జరగడం లేదు. ముఖ్యంగా ముస్లింలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ” అని ఓవసై ఆగ్రహంగా చెప్పారు.
Also Read: అవినీతిపై సహించేది లేదన్న మోడీ.. అదానీపై చర్చకు అంగీకరించాలని ప్రియాంక సవాల్
ఆ తరువాత వక్ఫ్ చట్టం సవరణ బిల్లు గురించి ప్రస్తావిస్తూ.. “అధికారంలో ఉన్న పార్టీకి బలపూర్వకంగా వక్ఫ్ ఆస్తులకు లాగేసుకోవాలని కుట్ర చేస్తోంది. అదే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. కానీ వక్ఫ్ సవరణ బిల్లుతో రాజ్యాంగానికి సంబంధం లేదని ప్రధాని మోడీ చెబుతున్నారు. ఆయనకు రాజ్యాంగం గురించి అవగాహన లేదు. ఆర్టికల్ 26 గురించి ప్రధాని తెలుసుకుంటే మంచిది. ఆర్టికల్ 26 ప్రకారం.. మతపరమైన , సమాజసేవ కోసం సంస్థలు ఏర్పాటు చేయడానికి అనుమతి ఉంది. రాజ్యంగా గురించి ప్రధాని ఎవరి వద్ద ట్యూషన్ తీసుకుంటున్నారో?” అని ఒవైసీ ఎద్దేవా చేశారు.
అంతకుముందు ప్రధాన మోడీ రాజ్యంగం గురించి ప్రసంగంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో రాజ్యాంగాన్ని ఎన్నోసార్లు నిర్లక్ష్యం చేసిందని.. ప్రజాస్వామ్యాన్ని హత్య చేసిందని ఆరోపణలు చేశారు. 1975లో ఎమర్జెన్సీ భారత రాజ్యంగంపై మాయని మచ్చగా అభివర్ణించారు. రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రాజ్యాంగంలో చాలా సవరణలు చేశారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలు పండిట్ నెహ్రూ నుంచి ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ వరకు అందరూ రాజ్యాంగంపై దాడి చేశారని అన్నారు. షా బానో కేసులో రాజకీయ ప్రయోజనాలు కోసం న్యాయ వ్యవస్థను అణచివేశారని చెప్పారు.