Adani Power Plant: కడపలో ఓ ఎమ్మెల్యే అనుచరులు రెచ్చిపోయారు. కంపెనీకి సంబంధించిన పనులు అప్పగించలేదని, ఏకంగా కంపెనీ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఎక్కడ? అన్న డీటేల్స్‌లోకి వెళ్దాం.
కడప జిల్లా కొండాపురం మండలంలోని రాగి కుంట ప్రాంతంలో 470 ఎకరాల విస్తీర్ణంలో 1000 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులు చేపట్టింది అదానీ సంస్థ. క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసుకుని స్థలాన్ని చదును చేస్తున్నాయి అదానీ-రిత్విక్ సంస్థలు.
వాటి పనులు తమకే ఇవ్వాలని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు సిబ్బందిపై రాళ్ల దాడి చేశారు. అదానీ సంస్థ క్యాంపు కార్యాలయం, జెసీబీ అద్దాలు పగలగొట్టారు. తమ మాట వినకపోవడంతో ఆదానీ కంపెనీ వాహనాలను ధ్వంసం చేశారు.
ఎమ్మెల్యే బంధువులు శివ నారాయణ రెడ్డి, రాజేష్ రెడ్డిలు కంపెనీ ప్రతినిధులతో వాగ్వాదానికి దిగారు. కంపెనీ ప్రతినిధులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి పోలీసులు దిగారు. కంపెనీ ప్రతినిధులపై దాడికి పాల్పడిన ఎమ్మెల్యే అనుచరులపై కేసు నమోదు చేశారు పొద్దుటూరు పోలీసులు.