Sunita Williams Health| అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం నాసాకు చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ గత కొన్ని నెలలుగా అంతరిక్షంలోనే చిక్కుకొని ఉంది. భారత మూలాలున్న సునీతా విలియమ్స్ ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (International Space Station)లో బుచ్ విల్‌మోర్ అనే మరో వ్యోమగామితో ఉంది. అయితే వారిద్దరూ జూలై 2024 నుంచి అక్కడే ఉన్నారు. వారు బయలుదేరిన స్టార్ లైనర్ అంతరిక్ష విమానంలో ఇంజన్ సమస్యలు రావడంతో తిరిగి రాలేని పరిస్థితి. కానీ ఇప్పుడు ఆహార కొరత వల్ల సునీతా విలియమ్స్ ఆరోగ్యం బాగా క్షీణించిందని అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది.
తాజాగా సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోలు అమెరికా వార్త పత్రిక ది న్యూయార్క్ పోస్ట్‌లో ప్రచురితమయ్యాయి. ఆ ఫొటోలలో సునీతా విలియమ్స్ శరీర బరువు బాగా తగ్గిపోయినట్లుగా కనిపిస్తోంది. ఆమె ముఖం చూస్తే.. బుగ్గలు కుచించుకుపోయాయి. కళ్లు, చర్మం పేలవంగా ఉన్నాయి. ఇదంతా ఆమెకు తగిన ఆహారం అందుబాటులోకి లేకపోవడం వల్లే నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: విమాన ప్రయాణంలో ప్రైవేట్ పార్ట్స్ కాలిపోయాయి.. ఎయిర్‌లైన్స్‌పై కేసు పెట్టిన ప్రయాణికుడు!
ఆగస్టు 2024లోనే సునీతా, బుచ్ విల్మోర్ భూగ్రహానికి తిరుగు ప్రయాణం చేయాల్సి ఉండగా.. స్టార్ లైనర్ లో ప్రయాణించడం సురక్షితం కాదని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. దీంతో ఆమె ప్రముఖ ఎలన్ మస్క్ కు చెందిన స్పేష్ ఎక్స్ క్రూ-9 విమానంలో ఫిబ్రవరి 2025లో తిరిగు ప్రయాణం చేయనుందని సమాచారం. కానీ అప్పటివరకు ఆమె అంతరిక్షంలోనే ఉండాల్సిన పరిస్థితి. గత కొన్ని నెలలుగా సునీతా విలియమ్స్ ప్రతిరోజు ఆహారంగా పిజ్జా, చికెన్ రోస్ట్, లాంటి ఆహారం తీసుకుంటోంది. అయితే అవన్నీ ప్యాకెడ్ ఫుడ్స్. తాజా ఆహారం ఎప్పుడూ అయిపోయిందని ది న్యూయార్క్ పోస్ట్ తెలిపింది.
కానీ అంతరికక్ష పరిశోధనా సంస్థ నాసా మాత్రం సునీతా విలియమ్స్ ప్రతిరోజు టూనా చేప, రోస్ట్ చికెన్, రొయ్యలు, పిజ్జా, పౌడర్ మిల్క్, టిఫిన్ లో సెరియల్స్, లాంటి హై కెలోరీ ఆహారం తీసుకుంటోందని.. ఆహార కొరత సమస్యలేమీ లేవని వెల్లడించింది. నాసా ప్రకారం.. ప్రతి అంతరిక్షంలో ఉన్న ప్రతి వ్యోమగామి నిత్యం 1.7 కిలోల ఆహారం తినేందుకు సరఫరా చేయడం జరుగుతోంది.
కానీ తాజా కూరగాయలు, పండ్లు ఆమెకు అందుబాటులో లేవు. ఎందుకంటే నాసా నుంచి ప్రతి మూడు నెలలకు ఒకసారి మాత్రమే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఆహారం సరఫరా చేయగలదు. పైగా కూరగాయలు, పండ్లు ఫ్రీజర్ డ్రై చేసి పంపాల్సి వస్తుంది. మిగతా ఆహారమంతా భూగ్రహంపైనే వండి.. అది అంతరిక్షం చేరాక.. తిరిగి వేడి చేయాల్సి ఉంటుంది. వీటికి తోడు ఎమర్జెన్సీలో ఆహార కొరత రాకుండా వ్యోమగాముల చెమట, మూత్రాన్ని తిరిగి నీరు లాగా రీసైకిల్ చేసే టెక్నాలజీ అంతరిక్షంలో ఉంది.
మరోవైపు అంతరిక్షంలో వాతావరణం కారణంగా ఎక్కువ రోజులు అక్కడ గడిపితే ఎముకల బలహీనత లాంటి ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదముందని వైద్యులు హెచ్చరించారు.