Shraddha Srinath: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హీరోయిన్ గా నిలబడడం అనేది మామూలు విషయం కాదు. కొన్నిసార్లు నటించిన మొదటి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన కూడా సరైన అవకాశాలు రావు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చిరుత సినిమాలో రామ్ చరణ్ సరసన కనిపించింది నేహా శర్మ. ఆ సినిమా పెద్ద హిట్ అయినా కూడా తర్వాత అవకాశాలు లేకుండా పోయాయి. అలానే ఉప్పెన సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది కానీ తర్వాత కృతి చేసిన సినిమాలు అన్నీ కూడా ఊహించినంత సక్సెస్ తీసుకురాలేకపోయాయి. ఆ విధంగా కృతి క్రేజ్ కూడా కొంతమేరకు తగ్గిపోయింది. పెళ్లి సందడి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది శ్రీ లీలా. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. కానీ ప్రస్తుతం శ్రీ లీలాకు మాత్రం వరుసగా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. స్టార్ హీరోలు సరసన కూడా నటిస్తుంది శ్రీ లీలా.
వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవడంలో తప్పులేదు. కానీ అవకాశం మన కెరియర్ కు ఎంత వరకు ప్లస్ అవుతుంది అనేది మాత్రం ఆలోచించాలి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్ లో శ్రద్ధ శ్రీనాథ్ ఒకరు. శ్రద్ధ ఎన్ని సినిమాలు చేసినా కూడా నాని సరసన చేసిన జెర్సీ సినిమా ప్రత్యేకమైన గుర్తింపుని తీసుకొచ్చింది. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయింది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా తర్వాతే నాని ఎంచుకునే కథలు కూడా మంచి మార్పు వచ్చింది. ఇక ఈ సినిమాకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఈ సినిమా తర్వాత గౌతమ్ కి రామ్ చరణ్ తో సినిమా చేసే అవకాశం వచ్చింది. కానీ ఎందుకు ఆ సినిమా పట్టాలెక్కలేదు. ఇక చాలా ఏళ్ల క్రితం శ్రద్ధ శ్రీనాథ్ కి ఫలక్నామా దాస్ సినిమాలో అవకాశం వచ్చింది. అప్పుడు ఆ సినిమా చేయను అని ఆమె రిజెక్ట్ చేశారు. ఇక రీసెంట్ గా ఎందుకు రిజెక్ట్ చేశారు అని అడిగినప్పుడు కూడా నాకు అంత ఎక్సైట్మెంట్గా ఏమీ అనిపించలేదు అంటూ చెప్పుకొచ్చింది.
Also Read : Viswak Sen : అప్పుడు వీపులు పగులాయి… ఇప్పుడు మందు బాటిల్స్ ఉన్నాయి..
ఇక ప్రస్తుతం విశ్వక్ సరసన మెకానిక్ రాకి అనే సినిమాలో చేస్తుంది. ఈ సినిమా నవంబర్ 22న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో పలు రకాల ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొంటుంది శ్రద్ధ. ఇక రీసెంట్ గా బాలకృష్ణ సినిమాలో కూడా శ్రద్ధాకు అవకాశం వచ్చింది. బాలకృష్ణ సినిమాలో అవకాశం రావడం లక్కీగా భావిస్తున్నారా అని అడిగినప్పుడు… బాలకృష్ణ గారి సినిమాలో నటించడం నా లక్ కాదు. నా టాలెంట్ చూసి ఆ అవకాశం వచ్చింది. అంటూ పాజిటివ్ వేలో సమాధానం ఇచ్చింది. ఏదేమైనా శ్రద్ధ చేసిన ఈ కామెంట్స్ ను చాలామంది ప్రశంసిస్తున్నారు. అందరిలా ఇది నా అదృష్టమని చెప్పకుండా, టాలెంటు గురించి చెప్పడం అనేది గ్రేట్ థింగ్.