Harish Rao: ఎస్ఎల్‌బీసీ టన్నెల్ వద్దకు రావడానికి సీఎం రేవంత్ రెడ్డికి సమయం దొరకడం లేదా అని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. దోమలపెంట చెక్ పోస్ట్ వద్ద హరీష్ రావు మీడియాతో మాట్లాడారు.
‘గడిచిన ఆరు రోజులు ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలు శూన్యం. బాధితుల బాధలను దృష్టిలో ఉంచుకుని చర్యలు చేపట్టాలి. ఇప్పటికైనా శిథిలాల తొలగింపు పనుల్లో వేగవంతం చేయాలి. నిపుణుల సలహాలు తీసుకుని ముందుకెళ్లాలి. ప్రతిపక్షం ప్రశ్నిస్తే తప్ప ప్రభుత్వం స్పందించడం లేదు.సీఎం రేవంత్ రెడ్డికి ఇక్కడకు రావడానికి టైం దొరకడం లేదు. కానీ ఎన్నికల ప్రచారానికి మాత్రం వెళ్లారు. మంత్రులు రోజూ వస్తున్నారు.. పోతున్నారు. ఇదేమైనా టూరిస్ట్ ప్రాంతమా..? ఆరు రోజుల తర్వాత తట్టెడు మట్టి మాత్రమే బయటకు తెచ్చారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే టన్నెల్ కూలిపోయిందని ఆరోపిస్తున్నారు. ఇలా మాట్లాడడం ఏమాత్రం సరికాదు. మమ్మల్ని ఇక్కడకు రాకుండా చేసే ప్రయత్నం చేశారు. మేం వస్తున్నామని తెలిసి బాధిత కుటుంబ సభ్యుల్ని దాచిపెట్టారు’ అని హరీష్ రావు చెప్పుకొచ్చారు.
ALSO READ: BEL Recruitment: బెల్‌లో ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.50,000.. ఈ అర్హత ఉంటే చాలు భయ్యా..
‘సరైన సూచనలు చేయడానికి మేము వస్తే ఎందుకంత భయపడుతున్నారు. ఆపరేషన్ లో స్పష్టమైన డైరెక్షన్ లేదు. నిర్ణయం తీసుకోవడానికి ఆరు రోజులు పడుతుంది. ఇంత పెద్ద ఘటన కన్నా ముఖ్యమైన పని ముఖ్యమంత్రికి ఏముంటుంది. ఇప్పటికి కన్వేయర్ బెల్టు పనిచేయడం లేదు. టీబీఎం మిషన్ భాగాలను కట్ చేయడానికి ప్రభుత్వం నాలుగు రోజుల టైం తీసుకుంది. 8 మంది ప్రాణాలు కాపాడండి. ప్రభుత్వం చిత్తశుద్ధితో లేదు. ఈ ఆపరేషన్ లో ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రెండు రోజుల్లో ఆపరేషన్ కంప్లీట్ అవుతుంది అని చెప్పడం విడ్డూరంగా ఉంది’ అని అన్నారు.
‘టన్నెల్‌లోకి వెళ్లడానికి మేము ప్రయత్నం చేస్తే మమ్మల్ని అడ్డుకున్నారు. గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం నాకుంది. ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది. 15 నెలల్లో 15 మీటర్ల దూరమైనా టన్నెల్ తవ్వారా..? ప్రమాదం జరిగిన నీటికి దగ్గరలో నీటికి సంబంధించిన ఒక వాగు ఉంది. దీనిపై క్లారిటీ లేకుండానే ముందుకు వెళ్లారు. కాంగ్రెస్ హయాంలో రూ.3300 కోట్లు ఈ ప్రాజెక్టుకి ఖర్చు పెడితే.. మా పార్టీ హాయంలో రూ.3900 కోట్ల రూపాయలు అంటే దాదాపు 600 కోట్లు ఎక్కువగా ఖర్చు పెట్టాం. ఆటంకాలు వచ్చిన దాదాపు 12 కిలోమీటర్లు పూర్తి చేశాం’ అని హరీష్ రావు తెలిపారు.
‘దివానాకూరి దిగజారుడు రాజకీయాలు కాంగ్రెస్ చేయకూడదు. సమన్వయంతో పనిచేసి చిక్కుకున్నవారి ప్రాణాలు కాపాడాలి. కాంగ్రెస్ నాయకులకు ప్రచారం ముఖ్యమా..? ప్రాణాలు ముఖ్యమా..? చిక్కుకున్నవారు కుటుంబాలను పరామర్శించాల్సిన బాధ్యత సీఎంకు లేదా..? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన పదిహేను నెలల్లోనే నాలుగు ప్రాజెక్టులు కూలిపోయాయి. సుంకిశాల ప్రాజెక్టు కుప్ప కూలిపోయింది. వట్టెం పంప్ హౌస్ జలమయం అయ్యింది. శ్రీశైలం ఖాళీ అయిపోతుంటే ప్రభుత్వం నిద్రపోతుందా..?’ అని ఆయన ప్రశ్నించారు.
ALSO READ: Assam Rifles Recruitment: టెన్త్, ఐటీఐ, పాలిటెక్నిక్ అర్హతలతో భారీగా ఉద్యోగాలు.. లాస్ట్ డేట్ ఇదే..
రాయలసీమకు పోతిరెడ్డి నుండి నీళ్లు తీసుకుపోతుంటే చూస్తూ ప్రభుత్వం చూస్తూ ఊరుకుంది. చంద్రబాబు నాయుడు గోదావరి నీళ్లను రాయలసీమకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. గోదావరికి బంకచర్ల లింకుపెట్టి 150 టీఎంసీ నీటిని ఆంధ్రకు తరలిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో కుర్చీల కొట్లాట మొదలైంది. ముందుగా టన్నెల్ లో కూలిపోయిన బురద మట్టిని త్వరత గతిన బయటకి తీయాలి’ అని హరీష్ రావు వ్యాఖ్యానించారు.