BigTV English

Rangaraya Medical College Issue: రంగరాయ మెడికల్ కాలేజీ ఘటన.. దిగొచ్చిన ఎమ్మెల్యే.. డాక్టర్ కు క్షమాపణ

Rangaraya Medical College Issue: రంగరాయ మెడికల్ కాలేజీ ఘటన.. దిగొచ్చిన ఎమ్మెల్యే.. డాక్టర్ కు క్షమాపణ

Rangaraya Medical College Issue: డాక్టర్ విషయంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ క్షమాపణ చెప్పారు. రంగరాయ మెడికల్ కాలేజీలో వాలీబాల్ ఆడుకునేందుకు పర్మిషన్ విషయంలో ఎమ్మెల్యే రంగరాయ మెడికల్ కాలేజ్ స్పోర్ట్స్ వైస్ చైర్మన్ డాక్టర్ ఉమామహేశ్వరరావుపై దాడికి పాల్పడ్డారు. ఉమామహేశ్వరరావు చేయి చేసుకున్నారు నానాజీ. పక్కనే ఉన్న ఎమ్మెల్యే అనుచరులు కూడా డాక్టర్ ఉమామహేశ్వరరావు పై దాడి చేశారు.


మరోవైపు ఎమ్మెల్యే దాడిని ఖండిస్తూ రంగరాయ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్, దళిత సంఘాలు ఆందోళనకు సిద్దమవుతున్నాయి. గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు బహిరంగ లేఖ రాసింది. ఎమ్మెల్యే అనుచరుల మీద పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయాలని కోరారు.

Also Read: ఒంగోలులో ఉద్రిక్తత.. జనసేన ఫ్లెక్సీని తొలగించిన టీడీపీ శ్రేణులు


వ్యవహారం ముదరడంతో కలెక్టర్, ఎస్పీల ఆధ్వర్యంలో పంతం నానాజీ రంగనాయ మెడికల్ కాలేజ్‌కు వెళ్లి క్షమాపణ చెప్పారు. ఉమామహేశ్వర రావు తన స్నేహితుడని.. చీకటిలో గుర్తించలేక పోయానని, ఆవేశంలో చేశానే తప్ప ఉద్దేశపూర్వకంగా కాదని నానాజీ వివరణ ఇచ్చారు.

తనతోపాటు దెబ్బలు తిన్న స్టూడెంట్స్ కు సానూభూతి తెలిపారు బాధితుడు ఉమామహేశ్వరరావు. నలుగురిలో ఎమ్మెల్యే నానాజీ ప్రవర్తించిన తీరు సరైనది పద్ధతిలో లేకపోవడంతో బాధపడ్డానన్నారు. రోగుల్ని దృష్టిలో పెట్టుకుని ధర్నాకి పిలుపునివ్వద్దని కోరారు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తానని అప్పటికి న్యాయం జరగకపోతే అప్పుడు ధర్నాకి వెళ్దామని డాక్టర్ ఉమామహేశ్వరరావు స్టూడెంట్స్‌కి చెప్పారు. దళిత సంఘాల నాయకులు మాత్రం ఎమ్మెల్యే పంతం నానాజీని ఏ1 గా చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు.

Related News

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

Big Stories

×