BigTV English

Mudragada Padmanabham : పేరు మార్చుకుంటా.. ముద్రగడ పద్మనాభం సంచలన ప్రకటన

Mudragada Padmanabham : పేరు మార్చుకుంటా.. ముద్రగడ పద్మనాభం సంచలన ప్రకటన

Mudragada Padmanabham Ready to Change his Name : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేసి.. భారీ మెజార్టీతో అఖండ విజయాన్ని అందుకున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఎన్నికలకు ముందు.. పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసి గెలిస్తే.. తన పేరు మార్చుకుంటానని కాపు ఉద్యమ నేత, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం ఛాలెంజ్ చేశారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ ఊహించని రీతిలో మెజార్టీ సాధించి.. విజయాన్ని అందుకోవడంతో తన పేరును మార్చుకునేందుకు ముద్రగడ పద్మనాభం సిద్ధమయ్యారు.


పిఠాపురంలో పవన్ ను ఓడిస్తానని సవాల్ చేసి ఓడి పోయానని, త్వరలోనే తన పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు గెజిట్ పబ్లికేషన్ కోసం అంతా సిద్ధం చేసుకున్నట్లు వివరించారు. పవన్ ను ఓడించకపోతే తన పేరును మార్చుకుంటానని శపథం చేసిన ముద్రగడ పద్మనాభం తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

Also Read : ఏపీలో రికార్డు మెజార్టీ, బాబు, జగన్, పవన్‌ను మించి..


పవన్ కల్యాణ్ ను పిఠాపురంలో ఓడించేందుకు ప్రత్యర్థిగా వంగా గీతను నిలబెట్టిన వైసీపీ.. ఆమెను గెలిపించే బాధ్యతను ముద్రగడ పద్మనాభంకు అప్పగించింది. ఈ క్రమంలోనే ముద్రగడ పవన్ ను ఓడిస్తానని సవాల్ చేశారు. ఇక్కడ ఆయనొక విషయం మరిచారు. కాపు సామాజిక వర్గమంతా పవన్ కు అండగా ఉందన్న విషయాన్ని మరచి.. సవాల్ చేసిన ముద్రగడ ఆ సవాల్ లో ఓడిపోయారు. ఛాలెంజ్ మేరకు.. తన పేరును మార్చుకోవడానికి సిద్ధమయ్యారు.

Tags

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×