BigTV English

APSRTC: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నారా.. ఇదైతే తప్పక తెలుసుకోండి!

APSRTC: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నారా.. ఇదైతే తప్పక తెలుసుకోండి!

APSRTC: ఆర్టీసీ బస్ ఎక్కాడు ఓ ప్రయాణికుడు. రూ. 35 ల టికెట్ కి ఏకంగా కండక్టర్ కు రూ. 500 నోటు అందించాడు. అలా అందించాడో లేదో కండక్టర్ కూడ, టికెట్ వెనుక అక్షరాలా రూ. 465 అని రాశారు. ఆ ప్రయాణికుడు తన స్టేజీ రాగానే హడావుడిగా దిగాడు. ఇంటికెళ్లాడు. అప్పుడు గుర్తొచ్చింది ఆ ప్రయాణికుడికి.. తన చిల్లర డబ్బులు కండక్టర్ వద్ద ఉన్నాయని గ్రహించాడు. ఇంకేముంది బస్ వెళ్లి గంటల సమయం దాటింది. ఇంకేమి చేసేది అంటూ ఆ ప్రయాణికుడు సైలెంట్ అయిపోయాడు. అయితే ఇటువంటి కష్టాలకు ఓ సులభతర పద్ధతి ఉంది. అదేమిటో తెలుసుకోండి.. మీ చిల్లర మీరు రాబట్టుకోండి.


ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తోంది. ప్రయాణికుల సేవలో ఎందరో ఆర్టీసీ డ్రైవరన్నలు, కండక్టర్లు ఉత్తమ సేవలు అందిస్తూ తమ విధి నిర్వహణలో లీనమవుతున్నారు. అయితే సాధారణంగా మనం ఆర్టీసీ బస్ లో ప్రయాణించే సమయంలో తగిన చిల్లర తీసుకొని సహకరించవలెను అనే బోర్డు మనకు కనిపిస్తుంటుంది. చాలా వరకు ప్రయాణికులు ప్రయాణం సాగించాలన్న తొందరలో తగిన చిల్లర తీసుకోకుండా, ఆర్టీసీ బస్ ఎక్కడం సర్వసాధారణం. ఇటువంటి సమయంలో కండక్టర్లు తమ వద్ద చిల్లర అందుబాటులో ఉంటే అందించడం, లేకుంటే టికెట్ వెనుక భాగాన రాసి ఇవ్వడం జరుగుతుంది.

ప్రస్తుతం చాలా బస్సులకు డ్రైవర్ ఒక్కరే కండక్టర్ విధి నిర్వహణ సాగిస్తున్న పరిస్థితి. వారు టికెట్స్ త్వరగా అందించాలన్న ఉద్దేశంతో టికెట్ కు సరిపడ చిల్లర ఇవ్వని పక్షంలో టికెట్ వెనుక భాగాన ఇవ్వాల్సిన నగదును రాస్తారు. అయితే దిగాల్సిన స్టేజీ రాగానే, ప్రయాణికుడు హడావుడిగా దిగి వెళ్లే సందర్భాలు చాలా ఉంటాయి.


అప్పుడు చిల్లర మరచిపోయామన్న ఆవేదన ప్రయాణికులకు ఉండక మానదు. అలాగే ఆ ప్రయాణికుడు చిల్లర తీసుకోలేదన్న మనోవేదన కండక్టర్ మదిలో కూడ ఉండక మానదు. ఇటువంటి వాటికి చెక్ పెట్టేందుకు ఆర్టీసీ ఓ సౌకర్యాన్ని కల్పిస్తున్న విషయం మీకు తెలుసా.. తెలియకుంటే, మీకోసమే ఈ సమాచారం!

ఇప్పుడు అన్ని ఆర్టీసీ బస్సుల్లో టిమ్ మిషిన్ ద్వార టికెట్స్ అందిస్తున్నారు. అందులో ఎవరైతే కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారో, వారి ఐడి కూడ అందులో ఉంటుంది. సాధారణంగా మనకు టికెట్ వెనుక చిల్లర రాసి మరచిపోయిన క్రమంలో.. ముందుగా మనం మన టికెట్ పై గల ఐడి నెంబర్ రాసుకోవాలి. ఆ తర్వాత 0866 2570005 నెంబర్ కు కాల్ చేయాలి.

Also Read: Ponnam Prabhakar: చిత్తశుద్ది ఉంటే కేసీఆర్ సభకు రావాలి.. మంత్రి పొన్నం డిమాండ్

అలా కాల్ చేసి తమకు రావాల్సిన చిల్లర వివరాలు, అలాగే కండక్టర్ ఐడి నెంబర్ వివరించాలి. అప్పుడు సదరు కస్టమర్ సర్వీస్ అధికారి ఆ కండక్టర్ వివరాలు తెలియజేయడంతో పాటు, మీరు ఎక్కడ నగదు తీసుకోవాలో వివరిస్తారు. అప్పుడు నిశ్చింతగా మీకు రావాల్సిన నగదును మీరు పొందవచ్చు. ఈ సౌకర్యం ఉందని తెలియని వారు ఎందరో ఉన్నారు. వారందరికీ ఈ విషయం చేరవేయండి.. అలాగే ఈ ఇబ్బందులకు స్వస్తి పలకాలంటే.. ముందుగా సరిపడ చిల్లర తీసుకొని ఆర్టీసీ బస్ ఎక్కడం మంచిదని చెప్పవచ్చు.

Related News

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Big Stories

×