E-Paper
Advertisement

10 కిలోలు త‌గ్గితేనే టీమిండియాలోకి తీసుకుంటామ‌ని గంభీర్ టార్చ‌ర్ పెట్టాడు!

10 కిలోలు త‌గ్గితేనే టీమిండియాలోకి తీసుకుంటామ‌ని గంభీర్ టార్చ‌ర్ పెట్టాడు!
Advertisement

Gambhir weight loss challenge to Sarfraz Khan: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir)పై సర్ఫరాజ్ ఖాన్ (Sarfaraz Khan) సంచలన వ్యాఖ్యలు చేశాడు. అందరూ అనుకున్నట్టుగా గౌతమ్ గంభీర్ విలన్ కాదని.. తనను టీమిండియాలోకి తీసుకువచ్చేందుకు చాలా కృషి చేశాడని గుర్తు చేశాడు. తాను బరువు ఎక్కువగా ఉన్నానని.. 10 కేజీలు తగ్గాల్సిందేనని చాలా టార్చర్ పెట్టినట్టు తెలిపాడు. ఈ క్రమంలో 10 కేజీలు కాదు, 20 కిలోలు తగ్గి చూపించి జట్టులోకి వచ్చినట్టు స్పష్టం చేశాడు. కానీ చాలా మంది గౌతమ్ గంభీర్ ను విలన్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నారని షాకింగ్ కామెంట్స్ చేశాడు.

10 కిలోలు, 20 కిలోలు తగ్గి చూపించాను..స‌ర్ఫ‌రాజ్ ఖాన్ సంచ‌ల‌నం

టీమిండియా మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా నిర్వహిస్తున్న బైఠ్ అండ్ బోల్ ఇంటర్వ్యూకు ఇచ్చిన యంగ్ కుర్రాడు స‌ర్ఫ‌రాజ్ ఖాన్ టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ విషయాలు గౌతమ్ గంభీర్ పనితీరుపై కీలక వ్యాఖ్యలు చేశాడు. 2025లో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే ముందు తనను 10 కిలోల బరువు తగ్గాలని గౌతమ్ గంభీర్ ఛాలెంజ్ విసిరాడని తెలిపాడు. 10 కేజీలు తగ్గితేనే ఇంగ్లాండ్ టూర్ తీసుకువెళ్తామని స్పష్టం చేసినట్టు గుర్తు చేశాడు.

Advertisement

Fatima Sana Ahead Of Babar Azam? Ex-Pakistan Selector’s Explosive Verdict Sparks Debate : ఫాతిమా ప్రవాహంలో స్మృతి, హర్మన్ కొట్టుకుపోతారు..WPL వేలంలో సనా రూ.10 కోట్లు పలకడం పక్కా!

ఈ క్రమంలో తనకు దాదాపు నాలుగు నెలల సమయం దొరికిందని చెప్పుకొచ్చాడు. ఆ నాలుగు నెలల పాటు కఠినంగా శ్రమించానని.. అనుకున్నట్టుగానే 10 కిలోల బరువు తగ్గినట్టు చెప్పుకొచ్చాడు. అయినప్పటికీ తాను వెనక్కి అడుగు వేయకుండా ఫిట్నెస్ పైన ఫోకస్ చేసినట్టు వివరించాడు. దీంతో మరో వారం రోజులలోనే 20 కిలోలు తగ్గినట్టు చెప్పుకొచ్చాడు. గతంలో 90 కిలోలు ఉన్న తాను గంభీర్ ఛాలెంజ్ తో 77 కిలోలకు చేరుకున్నట్టు వివరించాడు యంగ్ కుర్రాడు స‌ర్ఫ‌రాజ్ ఖాన్.

వివాదాల సమయాల్లోనూ గంభీర్ నాకు అండగా ఉన్నాడు

Advertisement

2024-2025 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత డ్రెస్సింగ్ రూమ్ విషయాలు లీక్ అయ్యాయని.. దానికి తానే కారణం అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగిందని యంగ్ కుర్రాడు స‌ర్ఫ‌రాజ్ ఖాన్ పేర్కొన్నాడు. ఈ క్రమంలో గంభీర్ తనను తిట్టినట్టు కొంత మంది ప్రచారం చేసినట్టు కూడా ఎమోషనల్ అయ్యాడు. ఆ సమయంలో గౌతమ్ గంభీర్ తనకు రెండుసార్లు ఫోన్ చేసి ధైర్యం చెప్పాడు కానీ.. ఏ రోజునా తిట్ట లేదని క్లారిటీ ఇచ్చాడు. ఇలాంటి రాజకీయాలను పట్టించుకోకుండా ఆటపై దృష్టి పెట్టాలని తనకు భరోసా కల్పించినట్టు పేర్కొన్నాడు. కిష్ట పరిస్థితుల్లో తాను ఎప్పుడున్నా…తన‌కు మొదట ఫోన్ చేసేది గౌతమ్ గంభీర్ మాత్రమేనని వెల్లడించాడు. కానీ అనవసరంగా కొంతమంది అతనిపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డాడు.

 

Months After Mustafizur Rahman Controversy, 7 Bangladesh Players Register For IPL 2027 Auctionఐపీఎల్‌లోకి బంగ్లాదేశ్ క్రికెటర్లు రీ-ఎంట్రీ…బీసీసీఐ పెద్దలను తరిమికొట్టాలంటూ ట్రోలింగ్ ? 

Related News

ఇండియాను ఎగ‌తాళి చేస్తూ పాకిస్తాన్ అంధుల క్రికెట‌ర్ల సెల‌బ్రేష‌న్స్‌..హరీస్ రౌఫ్ ను మించిపోయేలా

కంటిచూపు లేకపోయినా ఫైనల్‌లో టీమిండియాను ఓడించారు.. ఒక్కొక్కరికి కోటి రూపాయలు ఇవ్వాల్సిందే

బలహీన నేపాల్‌ను ఓడించి సంబర పడిపోకండి.. నవంబర్ 22న నరకం చూపిస్తాం

అంధుల ఆసియా కప్ ఫైనల్‌లో WBCC ఛీటింగ్…టైటిల్ విజేతగా పాకిస్తాన్, బాయ్‌కాట్ చేసిన టీమిండియా

జైస్వాల్ 20 ప‌రుగులు దాటితే..నా అకౌంట్ డిలీట్ చేస్తానంటూ బాబర్ ఆజం అభిమాని ట్వీట్!

న‌వంబ‌ర్ 22న పాకిస్తాన్ ఓడిపోతే.. టీమిండియా జెర్సీ వేసుకుని స‌లాం కొడ‌తా

గంభీర్ నీకు బుర్ర ఉందా? సిరాజ్‌, జ‌డేజాల‌ను ఎలా ప‌క్క‌కు పెడ‌తావ్

Big Stories

Advertisement
×