E-Paper
Advertisement

తెలంగాణ పట్టణాలకు మహర్దశ.. రూ.20 వేల కోట్లతో సీఎం రేవంత్ భారీ ప్లాన్!

తెలంగాణ పట్టణాలకు మహర్దశ.. రూ.20 వేల కోట్లతో సీఎం రేవంత్ భారీ ప్లాన్!
Advertisement

Telangana Urban Development: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణలోని పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి పురపాలక శాఖ రూపొందించిన ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. వాతావరణ మార్పులను తట్టుకునేలా, పర్యావరణ పరిరక్షణకు దోహదపడేలా పట్టణాలను అభివృద్ధి చేసే ప్రణాళికలపై చర్చించారు.

రూ.20 వేల కోట్లతో భారీ ప్రణాళిక

Advertisement

ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ), ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడుల బ్యాంకు (ఏఐఐబీ), జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ బ్యాంకుతో పాటు దేశీయ ఆర్థిక సంస్థల సహకారంతో దాదాపు రూ.20 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను చేపట్టేందుకు పురపాలక శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వరంగల్‌లో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, వర్షపు నీటి పారుదల వ్యవస్థ, వరంగల్ కోట కందకం పునరుద్ధరణ, హనుమకొండలో సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ అభివృద్ధి ప్రతిపాదనలపై సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలో మురుగునీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించేందుకు ప్రత్యేక విధానాన్ని రూపొందిస్తున్నారు. శుద్ధి చేసిన నీటిని పరిశ్రమలకు, ప్రధానంగా టెక్స్‌టైల్ పార్కులకు వినియోగించడం ద్వారా మంచినీటి వనరులపై ఒత్తిడి తగ్గించేందుకు అవకాశముంది.

వరంగల్‌కు వరాలు..

Advertisement

పట్టణాల్లో తాగునీటి సరఫరా, నీటి శుద్ధి, పంపిణీ వ్యవస్థల్లో విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం, పునరుత్పాదక ఇంధన వనరులను వినియోగించే అంశాలపై చర్చించారు. వరంగల్ మెగా సిటీ ఎకనామిక్ రీజియన్ పరిధిలో వ్యర్థాల నుంచి 10 నుంచి 12 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ ఏర్పాటు ప్రతిపాదనను సమీక్షించారు. బయో సీఎన్‌జీ ఉత్పత్తి, ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్ల ఏర్పాటుపై చర్చించారు.ఈ ప్రాజెక్టుల ద్వారా పట్టణాల్లో కర్బన ఉద్గారాలను తగ్గించడం, నీటి వనరులను సంరక్షించడం, వరద ముప్పును నివారించడం, పురపాలక సంస్థల నిర్వహణ వ్యయాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.ఈ సమావేశంలో ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, పురపాలక శాఖ కార్యదర్శి టి.కె. శ్రీదేవి, సీఎంవో కార్యదర్శి మాణిక్ రాజ్ పాల్గొన్నారు.

 Also read: సీఎం చంద్రబాబుతో భేటీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, జెడ్సీ పదవిపై చర్చ, నెక్ట్స్ అడుగులు ఎటువైపు?

Tags

Related News

హైదరాబాద్‌ సిటీలో ఆ ప్రాంతాలకు బిగ్ అలర్ట్.. రాత్రి నుండి 24 గంటలు నీటి సరఫరా బంద్

హెచ్‌సీయూలో ఫుడ్ పాయిజన్.. 30 మందికి పైగా విద్యార్థులకు అస్వస్థత

ప్రగతినగర్ వాసులకు గుడ్ న్యూస్.. అంబీర్ చెరువు పనులు షురూ!

సాగర్‌ వివాదంలో అసలు దోషులెవరు? అధికారులదా.. ప్రభుత్వానిదా?

‘విదేశీ గడ్డపై భారత్ పరువు తీస్తున్నారు’.. రాహుల్‌ గాంధీపై కిషన్ రెడ్డి ధ్వజం!

మూడేళ్లలో రూ.4.5 లక్షల కోట్ల అప్పు.. ఆ డబ్బు ఏమైంది? రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ నిప్పులు!

మంత్రులు, సీఎం తీరుపై ఎమ్మెల్యేల అసంతృప్తి నిజమేనా? 27న సందీప్ ముందు తేలనున్న లెక్క!

Big Stories

Advertisement
×