BigTV English

Namo Drone Didi Scheme: డ్రోన్ దిదీ పథకం.. మహిళలు ఇలా చేస్తే మీరూ లక్షాధికారులే, అర్హతలు ఇవే

Namo Drone Didi Scheme: డ్రోన్ దిదీ పథకం.. మహిళలు ఇలా చేస్తే మీరూ లక్షాధికారులే, అర్హతలు ఇవే

Namo Drone Didi Scheme: 10 లక్షల డ్రోన్.. ఇప్పుడు 2 లక్షలకే.. ఇది ఏ విధంగా సాధ్యం? ఏ రైతు ఉపయోగించినా వ్యవసాయంలో నూతన విప్లవం తేవడానికి ఉపయోగపడే డ్రోన్లు ఇప్పుడు తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టించిన నమో డ్రోన్ దీదీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అమలు చేస్తోంది. ఇది పూర్తిగా మహిళా రైతులకు ఉపయోగకరంగా ఉండనుందని చెబుతున్నారు నిపుణులు. ఎరువులు, పురుగుమందులు సమర్థవంతంగా పిచికారి చెయ్యడమే కాకుండా సమయం, శ్రమను కూడా ఆదా చెయ్యవచ్చు. ఏ విధంగా దరఖాస్తు చెయ్యాలి? ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు? పూర్తివివరాలతో ఇప్పుడు చూద్దాం.


వ్యవసాయంలో నూతన పద్దతులు ఆవిష్కరించడానికి, రైతులకు తోడుగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టించిన నమో డ్రోన్ దీదీ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగంగా అమలు చేస్తోంది. ఈ పథకంలో 80 శాతం రాయితీతో మహిళా రైతులకు అధునాతన డ్రోన్లు అందజేస్తున్నారు. సాధారణంగా ఒక్కో డ్రోన్‌ ధర రూ. 10 లక్షలు ఉండగా, ప్రభుత్వం రూ. 8 లక్షలు భరిస్తోంది. అంటే రైతులు కేవలం రూ. 2 లక్షలు చెల్లించినా ఒక్కో డ్రోన్‌ మనది అవుతుంది. ఇది వ్యవసాయ రంగంలో విప్లవాత్మకంగా మార్పు తెస్తుందని నిపుణులు చెబుతున్నారు.

డ్రోన్ల ఉపయోగం వల్ల ఎరువులు, పురుగుమందులు సమర్థవంతంగా పిచికారి చెయ్యవచ్చు. ఇది రైతులకు సమయం, శ్రమను ఆదా చెయ్యడమే కాకుండా అధిక దిగుబడికీ తోడ్పడుతుంది. ప్రతి ఎకరం వ్యవసాయంలో సమానంగా స్ప్రే అవ్వటం వల్ల పంట నాణ్యత మెరుగవుతుంది. ఆర్థికంగా రైతులకు ఇది ఉపయోగకరంగా ఉండనుందని వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


డ్రోన్లు ఉపయోగించడానికి తగిన శిక్షణ ఉండాలని నిబంధన. వ్యవసాయ శాఖ అధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. శిక్షణ పూర్తిచేసుకున్న తర్వాతే అర్హత కలిగిన రైతులకు డ్రోన్లు అందజేస్తున్నారు. ఇప్పటివరకు 875 యూనిట్లు మంజూరు చేసినట్లు వ్యవసాయ శాఖ ప్రకటించింది. ప్రతి జిల్లాలో కొందరు మహిళా రైతులను ఎంపిక చేసి, వారికి తగిన శిక్షణ ఇస్తున్నారు. డ్రోన్లు నడపటం, స్ప్రే చెయ్యటం, డేటాను ఉపయోగించి పంట ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం వంటివి పూర్తిగా నేర్పిస్తారు.

సమయం ఆదా.. మనుషుల శ్రమతో చేసే పనికంటే తక్కువ సమయం లో పూర్తవుతుంది. నీటి, ఎరువుల వినియోగంలో మితిమీరిదాన్ని నివారించవచ్చు. తగు పరిమితిలో ఉపయోగించడం వల్ల ఖర్చు తక్కువ అవుతుంది. పంట దిగుబడి పెరుగుతుంది. సమర్థవంతంగా ఎరువులు, పురుగుమందులు ఉపయోగించినప్పుడు తుది పంటపై మంచి ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎత్తున ఎగరెయ్యటం వలన మనుషులకు తాకిడి ఉండదు, ఇది ఆరోగ్య పరంగా ఉపయోగకరం.

Also Read: Garuda Varadhi Rules: తిరుమల భక్తులు గమనించండి.. గరుడ వారధి రూల్స్ మీకోసం

ఈ పథకంలో మహిళా రైతులకు ప్రత్యేకంగా ప్రాధాన్యం కల్పించటం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని ప్రభుత్వం నమ్ముతోంది. ఇది కొద్దిమందికే పరిమితం కాకుండా ప్రతి గ్రామంలోనూ ఉపయోగంలోకి వస్తుందని ఆశిస్తోంది.

డ్రోన్లు పొందాలని ఆశించిన మహిళా రైతులు తమ సమీప వ్యవసాయ అధికారి కార్యాలయాన్ని సంప్రదించి దరఖాస్తు సమర్పించుకోవచ్చు. దరఖాస్తు సమయంలో ఆధార్ కార్డు, వ్యవసాయభూమి పత్రాలతో పాటు కొద్దిమందికే అవకాశం ఉండటం వలన త్వరగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు.

నమో డ్రోన్ దీదీ పథకంలో తక్కువ ధరకే అధునాతన డ్రోన్లు రైతులకు అందించడం వల్ల వ్యవసాయంలో నూతన యుగం ఆరంభం అవుతోంది. ఇది రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపరిచడమే కాక, గ్రామీణ సమాజాన్ని అభివృద్ధి పరచడంలోనూ తోడ్పడుతుంది. మీరు ఏకంగా 10 లక్షల విలువ కలిగిన డ్రోన్లను 2 లక్షలకే పొందడానికి ఇది మంచి అవకాశం ఉపయోగించుకోండి!

Related News

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Big Stories

×