Collagen Skin Hair| ఈ ప్రపంచంలో అందం కోసం తపించే వారుండరేమో. అందుకే అందమైన ముఖ్యం, మెరిసే జుట్టు పొందేందుకు ఆరాటపడుతుంటారు. కానీ కాంతివంతమైన చర్మం, మెరిసే జుట్టు కావాలంటే ఆరోగ్యకరమైన పోషణ అవసరం. నిపుణుల ప్రకారం.. చర్మ సౌందర్యం, ఆరోగ్యకరమైన జుట్టు కోసం కొల్లాజెన్ అనే ప్రొటీన్ అవసరం. ఈ ప్రొటీన్.. చర్మం, జుట్టు, గోళ్లు, ఎముకలు, కీళ్లు, రక్త కణాలలో ఉంటుంది. కొల్లాజెన్ చర్మాన్ని మృదువుగా, ఆకర్షణీయంగా ఉంచుతుంది. వయసు పెరిగే కొద్దీ శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గుతుంది. దీనివల్ల చర్మం సాగదీసినట్లు, ముడతలు, మచ్చలు వస్తాయి. అయితే, అమ్లా (ఉసిరికాయ) తినడం వల్ల కొల్లాజెన్‌ను సహజంగా పెంచుకోవచ్చు. అమ్లా ఒక సూపర్‌ఫుడ్, ఇందులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి, ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
కొల్లాజెన్ అంటే ఏమిటి?
కొల్లాజెన్ శరీరంలోని ప్రత్యేక ప్రోటీన్, చర్మం, జుట్టు, గోళ్లు, ఎముకలు, కీళ్లను బలంగా ఉంచుతుంది. ఇది చర్మాన్ని హైడ్రేటెడ్‌గా, సాగేలా చేస్తుంది. వయసు మీద పడే కొద్దీ కొల్లాజెన్ తగ్గడం వల్ల చర్మంలో ఎలాస్టిటీ (సాగదీసే గుణం) తగ్గుతూ వస్తుంది. అందువల్ల ముడతలు పడతాయి.
అమ్లా కొల్లాజెన్‌ను ఎలా పెంచుతుంది?
అమ్లాలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి కీలకం. విటమిన్ సి ఎంజైమ్‌లా పనిచేసి, కొల్లాజెన్ రూపొందడానికి సహాయపడుతుంది. అమ్లా తినడం వల్ల శరీరంలో విటమిన్ సి సరిపడా అందుతుంది, ఇది కొల్లాజెన్‌ను వేగంగా, మెరుగ్గా ఉత్పత్తి చేస్తుంది. అంతేకాక, అమ్లాలోని పాలీఫెనాల్స్, టానిన్స్, ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్‌ను తగ్గిస్తాయి. ఈ ఫ్రీ రాడికల్స్ చర్మంలో కొల్లాజెన్‌ను దెబ్బతీసి, వృద్ధాప్యాన్ని త్వరగా తెస్తాయి. అమ్లా చర్మ కణాలను పునరుత్పత్తి చేసి, చర్మాన్ని ఆరోగ్యంగా, మెరిసేలా చేస్తుంది.
అమ్లాను సరైన విధానంలో ఎలా తినాలి?
కొల్లాజెన్‌ను పెంచడానికి అమ్లాను రకరకాలుగా తీసుకోవచ్చు.
పచ్చి అమ్లా: ఉదయం ఖాళీ కడుపుతో ఒక అమ్లా తినండి.
అమ్లా రసం: ఉదయం భోజనం తర్వాత 10-15 ఎమ్మెల్ అమ్లా రసాన్ని గోరువెచ్చని నీటిలో కలిపి తాగండి.
అమ్లా పొడి: ఒక టీస్పూన్ అమ్లా పొడిని తేనె లేదా గోరువెచ్చని నీటితో తీసుకోండి.
త్రిఫల చూర్ణం: అమ్లా, హరితకి, బహేడాలను కలిపి తీసుకుంటే కొల్లాజెన్ వేగంగా పెరుగుతుంది.
Also Read: యువతలో ముసలితనం ఛాయలు.. చర్మం యవ్వనంగా ఉండాలంటే వీటికి దూరంగా ఉండాలి
అమ్లా – అదనపు ప్రయోజనాలు
అమ్లా కేవలం కొల్లాజెన్‌ను పెంచడమే కాదు, చర్మం మచ్చలు, ముడతలను తగ్గిస్తుంది. ఇది చర్మాన్ని తేమగా, మృదువుగా ఉంచుతుంది. అమ్లాను రోజూ తీసుకోవడం వల్ల చర్మం యవ్వనంగా, మెరుస్తూ ఉంటుంది. అమ్లాను చట్నీ, జ్యూస్, లేదా ఫేస్‌మాస్క్‌లా కూడా ఉపయోగించవచ్చు. ఇది సహజమైన, తక్కువ ఖర్చుతో కూడుకున్న పద్ధతి.. దీనివల్ల ఖరీదైన కాస్మొటిక్స్ కొనాల్సిన అవసరం ఉండదు. అంటే తక్కువ ఖర్చులోనే ఆరోగ్యం, అందం రెండూనూ.