E-Paper
Advertisement

Nara Bhuvaneshwari: ఉచిత బస్సులో ప్రయాణించిన నారా భువనేశ్వరి.. సదుపాయాన్ని వినియోగించుకోవాలన్న సీఎం భార్య

Nara Bhuvaneshwari: ఉచిత బస్సులో ప్రయాణించిన నారా భువనేశ్వరి.. సదుపాయాన్ని వినియోగించుకోవాలన్న సీఎం భార్య
Advertisement

Nara Bhuvaneshwari: తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో మూడో రోజు పర్యటించారు. ఈ పర్యటనలో ఆమె మహిళా సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించారు. శాంతిపురంలో ఏర్పాటు చేసిన తన నివాసంలో భువనేశ్వరి గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వారి నుంచి భువనేశ్వరి అర్జీలు స్వీకరించారు. ప్రజల సమస్యలు తెలుసుకున్న ఆమె వాటి పరిష్కారానికి తప్పక కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా వితంతువులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడంలో ఇబ్బందులు లేకుండా చూడాలని ఆమె స్థానిక నాయకులకు సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రయోజనాలు అందేలా పర్యవేక్షించాలని ఆదేశించారు.

అనంతరం నారా భువనేశ్వరి ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆమె శాంతిపురం నుంచి తిమ్మిసి వరకు స్త్రీ శక్తి ఉచిత బస్సులో ప్రయాణించారు. ఈ ప్రయాణంలో ఆమె తోటి మహిళా ప్రయాణికులతో ముచ్చటించారు. ఉచిత బస్సు సౌకర్యం గురించి దాని ఉపయోగం గురించి ఆరా తీశారు. మహిళలందరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరారు.

Advertisement

బస్సులో ప్రయాణం తర్వాత తిమ్మిసి చేరుకున్న భువనేశ్వరి అక్కడ పెద్ద చెరువును సందర్శించారు. తిమ్మిసి పెద్ద చెరువు దగ్గర ఆమె జలహారతి కార్యక్రమం నిర్వహించారు. నీటి వనరుల సంరక్షణ ప్రాముఖ్యతను తెలియజేసేందుకు ఆమె ఈ హారతి ఇచ్చారు. పర్యటనలో నారా భువనేశ్వరి చూపిన చొరవ మహిళా లోకానికి భరోసా ఇచ్చింది. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో తెలుగుదేశం పార్టీ నిబద్ధతను తెలియజేసింది.

ALSO READ: Dubai Air Show: దుబాయ్ ఎయిర్‌ షోలో ప్రమాదం.. కుప్పకూలిన యుద్ధ విమానం, పైలట్ మృతి

Related News

కాంగ్రెస్ అభ్యర్థులపై దాడులు.. చంద్రబాబు సర్కారుపై షర్మిల సంచలన ఆరోపణలు

టైం మీది కొడుతున్నారు.. రేపు మా టైం వస్తుంది: జగన్ సంచలన వ్యాఖ్యలు!

వైసీపీకి బిగ్ షాక్.. నామినేషన్ల గడువు పెంపు పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు!

ఇచ్చాపురం మున్సిపాలిటీలో తోటికోడళ్ల కుర్చీ పోరు.. వైసీపీ పార్టీకి బిగ్ షాక్..?

దర్శిలో హైటెన్షన్.. వైసీపీ దాడిలో SI కి తీవ్ర గాయాలు

మా ప్రభుత్వం వస్తే నేనే హోంమంత్రిని: అంబటి రాంబాబు

సీఈసీ నియామకానికి మద్దతిచ్చి తప్పు చేశాం.. విజయవాడలో జగన్ సంచలన వ్యాఖ్యలు!

సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్రమైన ఆరోపణలు.. గొడ్డళ్లు సప్లై చేశారంటూ మండిపాటు

Big Stories

Advertisement
×