BigTV English

Nara Bhuvaneswari: కుప్పంలో భువనేశ్వరి.. టీడీపీ నయా రాజకీయం..

Nara Bhuvaneswari: కుప్పంలో భువనేశ్వరి.. టీడీపీ నయా రాజకీయం..

చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చిన కొత్తల్లో ఆ తర్వాత కూడా కుటుంబ సభ్యుల్ని పెద్దగా తెరపైకి తెచ్చేవారు కాదు. బాబు భార్య నారా భువనేశ్వరి టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత నేత ఎన్టీఆర్ కుమార్తె అయినా కూడా ఆమె పెద్దగా బయటకు వచ్చేవారు కాదు. చంద్రబాబు, ఆ తర్వాత లోకేష్ మాత్రమే జనంలోకి వచ్చారు. ఇప్పుడిప్పుడు భువనేశ్వరి, లోకేష్ సతీమణి బ్రాహ్మణి కూడా ప్రజల మధ్యకు వస్తున్నారు. రాజకీయ యాత్రలు చేస్తున్నారు. ముఖ్యంగా భువనేశ్వరి ఎప్పుడూ లేనంత చురుగ్గా జనం మధ్యలో ఉంటున్నారు. తాజాగా ఆమె కుప్పంలో 4 రోజుల పర్యటన చేపట్టారు.


కుప్పం నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఆమె పర్యటించారు. మహిళా సంఘాలతో సమావేశమయ్యారు. ఎక్కడికక్కడ స్థానిక ప్రజలతో కూడా సమావేశాలు నిర్వహించి ప్రసంగించారు. కుప్పంలో అగస్త్య ఇంటర్నేషనల్ స్కూల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రబాబు గొప్పతనం గురించి ప్రజలకు గుర్తు చేశారు. చంద్రబాబుకి ప్రజల తర్వాతే కుటుంబం అని, ఆయన తొలి ప్రాధాన్యత ఎప్పుడూ ప్రజలేనన్నారు. ప్రజలకు ఇబ్బందులు ఉంటే తనకు తెలియజేయాలని, అర్జీలు ఇవ్వాలని కోరారు. పనులు కావట్లేదని ఎవరూ అసంతృప్తికి లోనుకావొద్దని, ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని ముందు, కొన్ని వెనక అవుతుంటాయని చెప్పారు భువనేశ్వరి. రాజకీయ ప్రసంగాల్లో కూడా ఆమె రాటుదేలుతున్నారు.

రాజకీయ యాత్ర


2024 ఎన్నికల సమయంలో కూడా భువనేశ్వరి రాజకీయ యాత్రలు చేపట్టారు. కొడుకు లోకేష్ యువగళంలో ఆమె పలుమార్లు పాల్గొన్నారు. యాత్ర మొదలు పెట్టే సమయంలో 100 రోజులులైనప్పుడు ఇలా.. అప్పుడప్పుడు ఆమె యువగళంకు హాజరయ్యారు. కుప్పంలో కూడా ఆమె పలుమార్లు పర్యటించారు. గతంలో లేనిది, ఇప్పుడు కొత్తగా భువనేశ్వరి తెరపైకి రావడం ఇక్కడ ఆసక్తికరంగా మారింది.

జగన్ కి చంద్రబాబుకి తేడా అదే..

గత అసెంబ్లీ సమయంలో భువనేశ్వరిని టార్గెట్ చేస్తూ వైసీపీ నేతలు కామెంట్లు చేశారనే ప్రచారం జరిగింది. చంద్రబాబు కూడా ప్రెస్ మీట్లో కంటతడి పెట్టుకున్నారు. ఆ తర్వాత భువనేశ్వరికి మద్దతుగా నందమూరి కుటుంబం అంతా కలసి మీడియా ముందుకొచ్చింది. అప్పట్నుంచి భువనేశ్వరి కూడా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఓవైపు జగన్ తన తల్లిని, చెల్లిని కూడా దూరం చేసుకున్నారంటూ టీడీపీ ప్రచారం చేస్తోంది. అదే సమయంలో చంద్రబాబు మాత్రం కుటుంబ సభ్యులకు ఎక్కడలేని ప్రాధాన్యత ఇస్తారని వారు అంటున్నారు. ఈ క్రమంలోనే వైసీపీలో జగన్ కుటుంబ సభ్యులెవరూ తెరపై కనపడ్డంలేదు. ఇటు చంద్రబాబు కుటుంబ సభ్యులు మాత్రం అవసరాన్ని బట్టి జనంలోకి వస్తున్నారు, వారితో మమేకం అవుతున్నారు.

భువనేశ్వరి భరోసా..

2024 ఎన్నికలు మినహా.. గతంలో కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు మెజార్టీ క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది. ఓ దశలో చంద్రబాబుకి కుప్పం సేఫ్ కాదనే ప్రచారం జరిగింది. అప్పట్లో కుప్పం మండల పరిషత్, మున్సిపాల్టీని కూడా వైసీపీ కైవసం చేసుకుంది. దీంతో టీడీపీలో అయోమయం మొదలైంది. ఆ తర్వాత క్రమక్రమంగా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ పుంజుకోవడంతో కుప్పంలో చంద్రబాబు గెలుపు సులభం అయింది. అయితే ఈసారి చంద్రబాబు సీఎంగా బిజీగా ఉంటూ కుప్పంకి దూరంగా ఉన్నా.. అక్కడ కార్యక్రమాలేవీ ఆగిపోకుండా చూసే బాధ్యత భువనేశ్వరి తీసుకున్నట్టు తెలుస్తోంది. తరచూ కుప్పం నియోజకవర్గాన్ని సందర్శిస్తూ ఆమె ఆయా అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. చంద్రబాబు నియోజకవర్గానికి దూరంగా ఉన్న లోటు తెలియకుండా చూస్తున్నారామె.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×