TDP: ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్. మళ్లీ కాంట్రవర్సీ రాజేశారు. టీడీపీలో చిచ్చు ఎగదోశారు. ఈ తిరువూరు తలైవా తీరు పార్టీ అధిష్టానానికి మొదటినుంచీ తలనొప్పిగా మారింది. అమరావతి ఉద్యమ నేత, దళిత మాస్ లీడర్ కదానీ పార్టీలో చేర్చుకుని, టికెట్ ఇచ్చి, ఎమ్మెల్యేను చేస్తే.. పవర్‌లోకి వచ్చినప్పటి నుంచీ ఈయన చుట్టూ అన్నీ వివాదాలే. పాలనలో ఫుల్ బిజీగా ఉంటున్న సీఎం చంద్రబాబుకు.. పార్టీ నేత కొలికపూడి కొరకరాని కొయ్యగా మారారని అంటున్నారు. లేటెస్ట్‌గా 48 గంటల్లో రాజీనామా చేస్తానంటూ ఏకంగా హైకమాండ్‌కే అల్టిమేటం జారీ చేశారు ఎమ్మెల్యే కొలికపూడి.
కొలికపూడి రాజీనామా వార్నింగ్.. కారణం ఏంటంటే..
ఎన్టీఆర్ జిల్లా టీడీపీ నేత రమేశ్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే 48 గంటల్లో రాజీనామా చేస్తానన్నారు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్. తిరువూరులో రమేశ్‌రెడ్డికి వ్యతిరేకంగా గిరిజన మహిళలు నిరసన చేపట్టారు. వారికి మద్దతుగా ఎమ్మెల్యే కొలికపూడి రంగంలోకి దిగి.. సొంతపార్టీ నేతపై చర్యలకు పట్టుబడుతున్నారు.
ఇటీవల ఒక మహిళకు ఫోన్ చేసి లైంగికంగా వేధించినట్టు రమేశ్‌రెడ్డికి చెందిన ఆడియో ఒకటి వైరల్ అయింది. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది. టీడీపీలో అలజడి రేపింది. రమేశ్ రెడ్డికి వ్యతిరేకంగా బాధితురాలికి సపోర్ట్‌గా గిరజన మహిళలు ఆందోళన చేస్తున్నారు. వివాదం ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ చెంతకు చేరింది. ఇప్పటికే రమేశ్‌రెడ్డి వైరల్ ఆడియో విషయం అధిష్టానం దృష్టికి తీసుకెళ్లానని.. 10 రోజులు అవుతున్నా ఇప్పటికీ నో రెస్పాన్స్ అంటూ కొలికపూడి పార్టీ పెద్దలపైనే పరోక్షంగా విమర్శలకు దిగడం కలకలం రేపుతోంది.
Also Read : సజ్జల ఎక్కడ? వైసీపీలో అసలేం జరుగుతోంది?
ఇదే విషయమై.. మరింత సంచలన ఆరోపణలు సైతం చేశారు తిరువూరు ఎమ్మెల్యే. విజయవాడ ఎంపీ కార్యాలయంలో మూల్పురి కిషోర్ అనే వ్యక్తికి రమేశ్‌రెడ్డి.. 4 ట్రాక్టర్లు, 50 లక్షల డబ్బులు ఇచ్చి.. పార్టీ పెద్దలు తనపై ఎలాంటి చర్యలు చేపట్టకుండా లాబీయింగ్ చేస్తున్నారని చెప్పారు. రమేశ్‌రెడ్డిపై వేటు వేయకుండా.. బాధితులకు న్యాయం చేయకపోతే.. తాను ఎమ్మెల్యేగా ఉండి ఏం లాభమని ప్రశ్నించారు కొలికపూడి. అందుకే, రమేష్ రెడ్డిపై పార్టీ నాయకత్వం చర్యలు తీసుకోకపోతే 48 గంటల్లో రాజీనామా చేస్తానంటూ డెడ్‌లైన్ విధించారు కొలికపూడి శ్రీనివాస్.
కాంట్రవర్సీస్‌కు కేరాఫ్ కొలికపూడి?
ఎమ్మెల్యే అయ్యాక కొలికపూడిపై వచ్చినన్ని వివాదాలు మరే నేతపైనా రాలేదనే చెప్పాలి. గతంలో ఈయనపైనే లైంగిక వేధింపుల ఆరోపణ కూడా వచ్చింది. వాట్సాప్ కాల్ చేసి తనను అసభ్య మాటలతో వేధించారంటూ టీడీపీకి చెందిన సర్పంచ్ తుమ్మలపూడి శ్రీనివాసరావు భార్య కవిత సూసైడ్ అటెంప్ట్ చేయడం అప్పట్లో కలకలం రేపింది. ఆ సమయంలో కొలికపూడి టీడీపీ క్రమశిక్షణ సంఘం ముందు హాజరై వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. వారం క్రితం తనను సుపారీ గ్యాంగ్‌తో చంపాలని చూస్తున్నారంటూ స్థానిక జనసేన నేత మనబోలు శ్రీనివాసరావు సంచలన కామెంట్స్ చేశారు. ఏకంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు కంప్లైంట్ చేశారు. అంతకుముందు అక్రమ కేసులతో తనను వేధిస్తున్నారంటూ టీడీపీ కార్యకర్త డేవిడ్ పురుగుల మందు తాగిన సెల్ఫీ వీడియో వైరల్ అయింది. కొలికపూడి మాకు వద్దు అంటూ లోకల్ కేడర్ ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేశారు. తీరు మార్చుకోవాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఎమ్మెల్యే కొలికపూడికి గట్టిగానే వార్నింగ్ ఇచ్చారని కూడా అంటారు. అయినా.. తాజాగా రమేశ్‌రెడ్డిపై యాక్షన్ తీసుకోకపోతే 48 గంటల్లో రిజైన్ చేస్తానంటూ హైకమాండ్‌కే అల్టిమేటం జారీ చేసి.. టీడీపీలో మరింత మంట రగిలించారు. మరి, కొలికపూడిని పార్టీ ఎలా కంట్రోల్ చేస్తుందో చూడాలి.