AA23: తెలుగు సినిమా ఇప్పుడు దేశవ్యాప్తంగా పాపులర్ అవుతోంది. రాజమౌళి, సుకుమార్ లాంటి దర్శకులు తమ పాన్ ఇండియా సినిమాలతో సంచలనాలు సృష్టిస్తుంటే, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాత్రం ఇప్పటి వరకు రీజనల్ లెవల్‌లోనే ఉన్నాడు. కానీ, ఇక త్రివిక్రమ్ కూడా తన రేంజ్‌ను పెంచి, పాన్ ఇండియా లెవల్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యాడు.
ఈసారి త్రివిక్రమ్ తన స్ట్రాంగ్ జోన్‌లోనే కాకుండా, ఓ కొత్త జానర్‌ను టచ్ చేస్తూ, మైథాలజికల్ బ్యాక్‌డ్రాప్‌లో భారీ సినిమా చేయబోతున్నాడు. ఇందులో ముఖ్యంగా మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సినిమాకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించబోతున్నాడు. పుష్ప సినిమాతో నేషనల్ లెవల్ స్టార్‌గా ఎదిగిన బన్నీ, ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో మాస్ ఎంటర్‌టైనర్‌తో రావడానికి రెడీ అవుతున్నాడు.
త్రివిక్రమ్ – అల్లు అర్జున్: బ్లాక్‌బస్టర్ కాంబో
త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్ టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లలో ఒకటి. వీరిద్దరూ కలిసి “జులాయి”, “సన్నాఫ్ సత్యమూర్తి”, “అల వైకుంఠపురములో” సినిమాలతో ఘనవిజయాలు సాధించారు. ఈ మూడు సినిమాలు కూడా బన్నీ కెరీర్‌లో స్పెషల్ హిట్‌లుగా నిలిచాయి. ఇక ఇప్పుడు వీరి కాంబినేషన్‌లో నాలుగో సినిమా రాబోతోంది. అయితే, ఈసారి కథ పూర్తిగా డిఫరెంట్ అని టాక్.
పాన్ ఇండియా మార్కెట్‌లోకి త్రివిక్రమ్ ఎంట్రీ!
ఇప్పటి వరకు త్రివిక్రమ్ తన మార్క్ డైలాగ్స్, ఎమోషనల్ డ్రామా, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలను మాత్రమే తెరకెక్కించాడు. కానీ, ఈసారి ఓ మైథాలజికల్ బ్యాక్‌డ్రాప్‌తో భారీ విజువల్ ఎంటర్‌టైనర్‌ను ప్లాన్ చేస్తున్నాడట. “గాడ్ ఆఫ్ వార్” గా అల్లు అర్జున్ కనిపించనున్న ఈ సినిమా, ఇప్పటివరకూ తెరపై చూడని మైథాలజీ కథతో రూపొందనుందట. ఇది పూర్తిగా ఓ గ్రాండ్ స్కేల్ ప్రాజెక్ట్ అవుతుందని సమాచారం.
తెలుగు సినిమా – మైథాలజీ జానర్ రీ–ఎంట్రీ!
తెలుగు ఇండస్ట్రీలో మైథాలజికల్ సినిమాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఒకప్పుడు ఎన్.టి.ఆర్, ఎస్వీ రంగారావు, అక్కినేని నాగేశ్వరరావు లాంటి దిగ్గజాలు చేసిన పౌరాణిక చిత్రాలు సూపర్ హిట్ అయ్యేవి. కానీ, ప్రస్తుతం టాలీవుడ్‌లో మైథాలజికల్ సినిమాల సంఖ్య తగ్గిపోయింది. చివరిగా స్టార్ హీరోతో వచ్చిన మైథాలజికల్ సినిమా “యమదొంగ” (2007). ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా ఘనవిజయం సాధించింది.
అదే తరహాలో ఇప్పుడు మైథాలజీ ఎలిమెంట్స్ ఉండే సినిమాను త్రివిక్రమ్ తీస్తుండటం విశేషం. ఈసారి అల్లు అర్జున్ పౌరాణిక గెటప్‌లో, దేవతల పాత్రల్లో కనిపించనున్నాడని టాక్.
అల్లు అర్జున్ లుక్ టెస్ట్ – జూన్‌లో!
ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్‌ను త్రివిక్రమ్ లాక్ చేశాడు. ఇకపోతే, అల్లు అర్జున్ లుక్ టెస్ట్ కూడా జూన్‌లో జరగనుందని నిర్మాత నాగ వంశీ వెల్లడించాడు. బన్నీ పూర్తిగా డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నాడని టాక్.