Shubman Gill Trolls Santner During Toss: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ (New Zealand vs India) మధ్య ఐదు మ్యాచ్ ల వన్డే సిరీస్ ( India tour of New Zealand 2026) జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో ఇప్పటి వరకు రెండు వన్డేలు వరుసగా గెలిచిన టీమిండియా మంచి దూకుడు పైన ఉంది. నిన్న హమిల్టన్ (Seddon Park, Hamilton) వేదికగా వన్డే జరగాల్సి ఉండగా బంతి పడకుండానే మ్యాచ్ రద్దయింది. అయితే వర్షం కాస్త తగ్గుముఖం పట్టడంతో నిన్నటి మ్యాచ్ కు టాస్ వేశారు. ఈ టాస్ సందర్భంగా న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ ను వెనక్కి తోసేసాడు భారత సారధి గిల్. నువ్వు రానే రావద్దు… ఎలాగూ మేమే టాస్ గెలుస్తాం అనవసరంగా వచ్చావు అంటూ గిల్ కాస్త ఓవరాక్షన్ చేశాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన పాకిస్తాన్ సోషల్ మీడియా రెచ్చిపోయి రియాక్ట్ అవుతోంది. టాస్ కూడా ఫిక్సింగ్ చేశారని ఆరోపణలు చేస్తూ పోస్టులు పెడుతున్నారు.
టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య హామిల్టన్ వేదికగా నిన్న జరగాల్సిన మూడవ వన్డే రద్దయింది. కానీ ఈ మ్యాచ్ ప్రారంభంలో వర్షం తగ్గడంతో టాస్ మాత్రం వేశారు. ఈ క్రమంలో టాస్ కోసం వస్తున్న న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ సరదాగా బెదిరించే ప్రయత్నం చేశాడు గిల్. అక్కడే ఆగు…ఎలాగూ మేమే టాస్ గెలుస్తాం అంటూ రెచ్చిపోయాడు. దీంతో అక్కడ ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది.
ఇక తర్వాత గిల్ చెప్పినట్టే, టీమ్ ఇండియానే టాస్ నెగ్గింది. దీంతో సోషల్ మీడియాలో టీమిండియాపై విమర్శలు వస్తున్నాయి. డబ్బులతో న్యూజిలాండ్ క్రికెట్ బోర్డును బీసీసీఐ కొనుగోలు చేసిందని ఆరోపిస్తున్నారు. అందుకే ప్రతిసారి టీం ఇండియా అనే టాస్ గెలుస్తోందని వివాదాస్పద పోస్టులు పెడుతున్నారు. టాస్ గెలుస్తామని గిల్ కు ఎలా తెలుసు అంటూ ప్రశ్నిస్తున్నారు. బీసీసీఐ అలాగే కివీస్ క్రికెట్ బోర్డులు కుమ్మక్కై వన్డే సిరీస్ నిర్వహిస్తున్నాయని ఆరోపిస్తున్నారు.
టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఐదు మ్యాచ్ ల వన్డే సిరీస్ నవంబర్ 4వ తేదీన ఆక్లాండ్ వేదికగా ప్రారంభమైంది. మొదటి వన్డేలో టీమిండియానే టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకుంది. ఫలితంగా ఐదు వికెట్ల తేడాతో విక్టరీ అందుకుంది. రెండో వన్డేలో కూడా టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకొని నాలుగు పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. మూడో వన్డేలో మ్యాచ్ జరగకపోయిన టాస్ వేశారు. ఇక్కడ కూడా టాస్ నెగ్గిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది.
Gill be like- Santner bhai, kya hi zarurat hai aane ki? Toss toh mera hai 😜😜😜
I love this cute bond they both share ❤️🧿 pic.twitter.com/WQ9V6PDd6B
— Naina Dev (@NainaDev380254) November 10, 2026